Bigg Boss 8 Telugu Day 22: నువ్వు నా పేరెంట్ కాదు: సోనియాకు నబీల్ పంచ్.. మాటల యుద్ధం.. నామినేషన్లలో ఆరుగురు
Bigg Boss 8 Telugu Day 22 Soniya vs Nabeel: సోనియా, నబీల్ మధ్య మాటల యుద్ధం తీవ్రంగా జరిగింది. నాలుగో వారం నామినేషన్లలో ఇద్దరూ గట్టిగా వాదించుకున్నారు. పలుమార్లు గొడవ పెట్టుకున్నారు. నిఖిల్ ఒకరిని సేవ్ చేయగా ఈ వారం నామినేషన్లలో ఆరుగురు ఉన్నారు.
బిగ్‍బాస్‍లో నామినేషన్ల తంతు మరోసారి రచ్చరచ్చగా సాగింది. 8వ సీజన్‍లో నాలుగో వారం ఎలిమినేషన్ల ప్రక్రియ నేడు (సెప్టెంబర్ 23) పూర్తయింది. చీఫ్ నిఖిల్ ఒకరిని సేవ్ చేయగా.. చివరికి నామినేషన్లలో ఆరుగురు నిలిచారు. నామినేషన్ల సందర్భంగా కంటెస్టెంట్ల మధ్య వాగ్వాదాలు గట్టిగా సాగాయి. ముఖ్యంగా సోనియా, నబీల్ మధ్య మాటల యుద్ధం తీవ్రంగా జరిగింది.
హౌస్‍లో 22వ రోజు రంగస్థలం టైటిల్ సాంగ్‍తో మొదలైంది. కంటెస్టెంట్లు డ్యాన్స్ చేశారు. ఇంట్లో ఉండడానికి అనర్హులని అనుకునే ఇద్దరు సభ్యులపై కారణాలు చెప్పి ముఖం మీద ఫోమ్ కొట్టి నామినేట్ చేయాలని కంటెస్టెంట్లకు బిగ్‍బాస్ చెప్పారు. చీఫ్‍గా ఉన్న నిఖిల్‍ను నామినేట్ చేయకూడదని తెలిపారు. ముందుగా పృథ్విరాజ్, సోనియాను ఆదిత్య నామినేట్ చేశారు. మణికంఠ, ఆదిత్యను నైనిక నామినేట్ చేశారు.
సోనియా, నబీల్ వార్
సోనియాను నబీల్ ఆఫ్రిది నామినేట్ చేశారు. బెలూన్ టాస్కులో సంచాలక్‍గా సరిగా చేయలేదని అన్నారు. అభయ్‍ను డిస్‍క్వాలిఫై చేయకుండా కన్‍ఫ్యూజ్ అయ్యావని చెప్పారు. ఎగ్ టాస్కులో తాను సంచాలక్‍గా బాగా చేశానని నబీల్ అన్నారు. అన్ని రూల్స్ పాటించానని సమర్థించుకున్నారు. సోనియా మధ్యలో మాట్లాడితే నబీల్ అడ్డుకున్నారు. తన పాయింట్ చెప్పనివ్వాలని అన్నారు. సోనియా ఆపకపోవటంతో రకరకాల శబ్దాలు చేశారు. నబీల్‍ను ఫెయిల్డ్ సంచాలక్ అని సోనియా అన్నారు. జనాలు అందరూ చూస్తున్నారని నబీల్ వెటకారంగా అరిచారు.
నా పేరెంట్, గార్డియన్ కాదు
ఆ తర్వాత పృథ్విరాజ్‍ను నబీల్ నామినేట్ చేశారు. పృథ్వి గురించి నబీల్ మాట్లాడుతుంటే సోనియా మధ్యలో డిస్ట్రబ్ చేశారు. దీంతో నబీల్‍కు చిర్రెత్తుకొచ్చింది. తాను పృథ్వితో మాట్లాడుతుంటే సోనియా ఎందుకు వస్తోందని బిగ్‍బాస్‍కు చెప్పారు. అయినా సోనియా ఆగలేదు. దీంతో తానే కరెక్ట్ అని నిరూపించుకునేందుకు సోనియా ఆరాటపడుతోందని నబీల్ అన్నారు. తప్పు అని గుర్తు చేస్తున్నానని సోనియా వాదించారు.
సోనియా తనకు సూచనలు ఇస్తుండటంతో నబీల్ ఫైర్ అయ్యారు. “నాకు గుర్తు చేసేందుకు నువ్వు నా పేరెంట్ కాదు. గార్డియన్ కాదు. నాకు గుర్తు చేయకు. నాకు తెలుసు నేనేం చేస్తున్నానో” అని సోనియాకు నబీల్ పంచ్‍లు వేశారు. దీంతో సోనియా సైలెంట్ అయ్యారు. పృథ్వితో కూడా గొడవ జరిగింది. తనకు ఇష్టమొచ్చినట్టు మాట్లాడతానని పృథ్వి అన్నారు.
మణికంఠ, నైనికను ప్రేరణ నామినేట్ చేశారు. నైనిక గట్టిగానే డిఫెండ్ చేసుకున్నారు.
మళ్లీ నబీల్, సోనియా మధ్య..
నబీల్‍ను సోనియా నామినేట్ చేశారు. తాను నిలబడనని, పృథ్వి కూడా అలాగే చేశాడని నబీల్ అన్నారు. ఫెయిల్డ్ సంచాలక్ అని నబీల్‍ను సోనియా అన్నారు. ఆట ఆడినప్పుడు నబీల్ రూల్స్ బ్రేక్ చేసి, సంచాలక్ అయినప్పుడు రూల్స్ మాట్లాడాడని సోనియా చెప్పారు. రూల్స్ ఇష్టమొచ్చినట్టు చెప్పాడని విమర్శించారు. తనను తప్పు అనడంపై వెటకారంగా నబీల్ అరిచారు. ఆదిత్యను కూడా సోనియా నామినేట్ చేశారు. వెళ్లిపోతానని అంటున్నారని, హౌస్ నుంచి వెళ్లిపోవాలని సోనియా అన్నారు.
పృథ్విరాజ్, ఆదిత్యను మణికంఠ, ఆదిత్య, ప్రేరణను విష్ణుప్రియ నామినేట్ చేశారు. నబీల్‍ను పృథ్విరాజ్ నామినేట్ చేశారు. ఎగ్ టాస్కులో పక్షపాతం చూపావని చెప్పారు. ఆ తర్వాత మణికంఠను పృథ్వి నామినేట్ చేశారు. దోశ విషయాన్ని మణి కావాలని పెద్దగా చేశారని ఆరోపించారు. ప్రేరణ, మణికంఠను సీత నామినేట్ చేశారు.
మణికంఠను యష్మి నామినేట్ చేశారు. శారీరకంగా వీక్‍గా ఉన్నావని, ఎగ్ టాస్కులో అది నిరూపితమైందని చెప్పారు. ఇద్దరూ గట్టిగా అరుచుకున్నారు. తాను బలహీనంగా లేదని మణి వాదించారు. వెళ్లే వరకు నామినేట్ చేస్తూనే ఉంటానని మరోసారి యష్మి అన్నారు.
నీకు వాడుకోవడం బాగా తెలుసు
సోనియాను యష్మి కూడా నామినేట్ చేశారు. వేరే వాళ్లను ఆయుధంగా వాడుకుంటూ సోనియా గేమ్ ఆడుతోందని అన్నారు. పృథ్వి, నిఖిల్.. సోనియాకు హెల్ప్ చేస్తున్నారనేలా మాట్లాడారు. ముందుకు వచ్చి ఆడడం లేదని యష్మి ఫైర్ అయ్యారు. సోనియా కూడా గట్టిగా వాదించారు. ఎవరిని ఎలా వాడుకోవాలో నీకు బాగా తెలుసంటూ సోనియాను యష్మి చెప్పారు.
నైనికను సేవ్ చేసిన నిఖిల్.. నామినేషన్లలో ఆరుగురు
ముందుగా పృథ్విరాజ్, ఆదిత్య, మణికంఠ, సోనియా, నైనిక, నబీల్, ప్రేరణ నామినేషన్లలో నిలిచారు. అయితే, చీఫ్‍గా ఉన్న నిఖిల్‍కు నామినేట్ అయిన వారిలో ఒకరిని సేవ్ చేసే సూపర్ పవర్‌ను బిగ్‍బాస్ ఇచ్చారు. దీంతో నైనికను నిఖిల్ సేవ్ చేశారు. దీంతో నాలుగో వారం ఎలిమినేషన్ కోసం పృథ్విరాజ్, ఆదిత్య, సోనియా, మణికంఠ, నబీల్, ప్రేరణ నామినేట్ అయ్యారు. దీంతో ఈ వారం నామినేషన్ల తంతు పూర్తయింది.