Devara Collection: తొలి రోజు 140 కోట్లు కొల్లగొట్టిన Jr NTR- దేవర ఫస్ట్ డే కలెక్షన్స్- మిక్స్‌డ్ టాక్‌తో సంబంధం లేకుండా!-devara first day worldwide box office collection 140 cr jr ntr devara collection in hindi tamil malayalam kannada ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Devara Collection: తొలి రోజు 140 కోట్లు కొల్లగొట్టిన Jr Ntr- దేవర ఫస్ట్ డే కలెక్షన్స్- మిక్స్‌డ్ టాక్‌తో సంబంధం లేకుండా!

Devara Collection: తొలి రోజు 140 కోట్లు కొల్లగొట్టిన Jr NTR- దేవర ఫస్ట్ డే కలెక్షన్స్- మిక్స్‌డ్ టాక్‌తో సంబంధం లేకుండా!

Sanjiv Kumar HT Telugu

Devara Day 1 Worldwide Box Office Collection: కొరటాల శివ దర్శకత్వం వహించిన దేవర పార్ట్ 1 ఈ చిత్రం శుక్రవారం (సెప్టెంబర్ 27) ఇండియాలో మంచి వసూళ్లు రాబట్టింది. జూనియర్ ఎన్టీఆర్, సైఫ్ అలీఖాన్, జాన్వీ కపూర్ ప్రధాన పాత్రలు పోషించిన దేవర మూవీ ఫస్ట్ డే వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎంతో లుక్కేద్దాం.

తొలి రోజు 140 కోట్లు కొల్లగొట్టిన Jr NTR- దేవర ఫస్ట్ డే కలెక్షన్స్- మిక్స్‌డ్ టాక్‌తో సంబంధం లేకుండా!

Devara Box Office Collection: డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన పాన్ ఇండియా సినిమా దేవర. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ పతాకాలపై కొసరాజు హరికృష్ణ, సుధాకర్ మిక్కిలినేని నిర్మించారు. జూనియర్ ఎన్టీఆర్, జాన్వీ కపూర్ హీరో హీరోయిన్లుగా నటించిన దేవర సినిమాలో సైఫ్ అలీ ఖాన్ విలన్ రోల్ పోషించిన విషయం తెలిసిందే.

దేవర ఫస్ట్ డే కలెక్షన్స్

ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ 27న చాలా గ్రాండ్‌గా విడుదలైంది దేవర మూవీ. తొలి రోజున ఈ సినిమాకు టాక్ ఎలా వచ్చిన కలెక్షన్స్ మాత్రం అదిరిపోయాయని తెలుస్తోంది. ఇండియాలో తొలి రోజున దేవర సినిమాకు రూ. 77 కోట్ల నెట్ ఇండియా కలెక్షన్స్ వసూలు అయినట్లు ట్రేడ్ వర్గాలు రిపోర్ట్ ఇచ్చాయి.

తమిళం, హిందీ వెర్షన్‌లో

ఈ 77 కోట్ల కలెక్షన్స్‌లలో తెలుగు నుంచి రూ.68.6 కోట్లు, హిందీ నుంచి రూ.7 కోట్లు, కన్నడ నుంచి రూ. 30 లక్షలు, తమిళం ద్వారా రూ. 80 లక్షలు, మళయాళం వెర్షన్‌లో రూ. 30 లక్షలు వచ్చాయి. అలాగే, దేవర పార్ట్-1కు శుక్రవారం 79.56 శాతం తెలుగులో థియేటర్ ఆక్యుపెన్సీ నమోదైంది.

దేవర వరల్డ్ వైడ్‌ కలెక్షన్స్

ఇదిలా ఉంటే, దేవర పార్ట్ 1 సినిమాకు వరల్డ్ వైడ్‌గా ఓపెనింగ్ డే నాడు రూ. 140 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు అయ్యాయి. దీంతో దేశీయంగా, అంతర్జాతీయంగా దేవర బలమైన స్థానాన్ని సంపాదించుకుంది. అలాగే, ఆక్యుపెన్సీ పరంగా తెలుగు వెర్షన్ 80 శాతం మార్నింగ్ రేట్‌తో ఆధిపత్యం చెలాయించడంతోపాటు రోజంతా స్థిరంగా ఉంది.

పెరిగిన ఆక్యుపెన్సీ

నైట్ షోలకు 87.45 శాతం గరిష్ట స్థాయికి దేవర థియేటర్ ఆక్యుపెన్సీ చేరుకుంది. ఏది ఏమైనప్పటికీ, హిందీ వెర్షన్‌కు మాత్రం కాస్తా తక్కువ స్పందన వచ్చింది. హిందీలో మొత్తం ఆక్యుపెన్సీ సగటుగా కేవలం 18.37 శాతం నమోదు అయింది. దీంతో దక్షిణ భారత మార్కెట్‌లో ఎన్టీఆర్‌కు ఉన్న ఫ్యాన్ బేస్ ఏంటో చూపిస్తుంది.

కల్కి కంటే తక్కువే

దేవర సినిమా మిక్స్‌డ్‌ రివ్యూలను అందుకున్నప్పటికీ ప్రపంచవ్యాప్తంగా టాప్ డే 1 వసూళ్లలో నిలిచింది. ఈ ఓపెనింగ్ విశేషమైనప్పటికీ, ప్రభాస్ కల్కి 2898 ఏడీ కంటే వెనుకబడి ఉందని ట్రేడ్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కల్కి సినిమా మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ. 191.5 కోట్లు రాబట్టింది.

దేవర యాక్టర్స్

ఇదిలా ఉంటే, దేవర సినిమాలో జూనియర్ ఎన్టీఆర్, సైఫ్ అలీ ఖాన్, జాన్వీ కపూర్, ప్రకాష్ రాజ్, శ్రీకాంత్ మేకా, టామ్ షైన్ చాకోతోపాటు నరైన్ నటించారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ దేవర, వరదుడు అనే ఇద్దరి పాత్రలో ద్విపాత్రాభినయం చేశాడు. సినిమాకు టాక్ ఎలా ఉన్న ఎన్టీఆర్ నటన మాత్రం ఇరగదీశాడని అంటున్నారు.