Devara First Review: దేవర ఫస్ట్ రివ్యూ.. యాక్షన్ సీన్స్ అదుర్స్, జాన్వీ కపూర్ ఇరిటేటింగ్.. అదొక్కటే కన్‌ఫ్యూజన్!
Junior NTR Devara First Review: యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ నటించిన దేవర మూవీ మరో రెండు రోజుల్లో థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. ఈ లోపే దేవర ఫస్ట్ రివ్యూ వచ్చేసింది. ఓవర్సీస్‌లో ఈ సినిమాను చూసిన డిస్ట్రిబ్యూటర్స్ దేవర పార్ట్ 1పై రివ్యూ ఇచ్చారు. యాక్షన్ సీన్స్ చాలా బాగున్నాయని చెప్పారు.
Devara Part 1 First Review: యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ హై ఓల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ దేవర. రెండు పార్టులుగా తెరకెక్కిన ఈ సినిమా మొదటి పార్ట్ సెప్టెంబర్ 27న చాలా గ్రాండ్‌గా థియేటర్లలో రిలీజ్ కానుంది. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన దేవర మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
సింహాద్రి తర్వాత
ఆర్ఆర్ఆర్ తర్వాత తారక్ నటిస్తున్న సినిమా ఇది. రాజమౌళితో సినిమా చేసిన హీరోకు ఆ తర్వాతి మూవీ ప్లాప్ తీసుకొస్తుందన్న సెంటిమెంట్ టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న విషయం తెలిసిందే. ఇదివరకు సింహాద్రి తర్వాత వచ్చిన ఆంధ్రావాలా భారీ డిజాస్టర్ అందుకుంది. మళ్లీ రాజమౌళి డైరెక్షన్‌లో వచ్చిన ఆర్ఆర్ఆర్ తర్వాత వస్తున్న సినిమా దేవర.
అలాగే, ఆచార్య వంటి ప్లాప్ తర్వాత కొరటాల శివ దర్శకత్వం వహించిన సినిమా దేవర. ఇలాంటి అంశాలతో దేవరపై భారీ ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. ఈ నేపథ్యంలో రెండు రోజుల ముందుగానే దేవర ఫస్ట్ రివ్యూ వచ్చేసింది. ఇదివరకు ఈ సినిమా చూసిన రాజమౌళి అండ్ టీమ్ మంచి రివ్యూలు ఇచ్చారు. తాజాగా ఓవర్సీస్‌లో ఈ సినిమాను చూసిన డిస్ట్రిబ్యూటర్స్ రివ్యూ ఇచ్చారు.
రివర్స్ స్క్రీన్ ప్లే
ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్స్ ప్రకారం దేవర ఫస్టాఫ్ బాగుందని టాక్. అలాగే సినిమా యాక్షన్ సీక్వెన్స్ అదిరిపోయాయని వారు చెప్పారు. ఇందులో యాక్షన్ సీన్స్ కొత్త అనుభూతిని ఆడియెన్స్‌కు కలిగిస్తాయట. అలాగే, దానికి మించి సెకండాఫ్ ఉంటుందని వారు అంటున్నారు. దేవర సినిమా రివర్స్ స్క్రీన్ ప్లేతో సాగుతుందట.
దేవర రివర్స్ స్క్రీన్ ప్లే అనేది కొంచెం ప్రేక్షకులను కన్‌ఫ్యూజ్ చేసే విధంగా ఉంటుందని డిస్ట్రిబ్యూటర్స్ చెబుతున్నారు. కానీ, క్లైమాక్స్ మాత్రం గట్టిగా పుంజుకుంటుందట. క్లైమాక్స్‌లో వచ్చే యాక్షన్ ఎపిసోడ్ సరికొత్తగా ఉంటుందని అంటున్నారు. అలాగే, అనిరుధ్ రవించదర్ అందించిన బీజీఎమ్ బాగుందని, సినిమాకు ప్లస్ పాయింట్లలో ఒకటని చెబుతున్నారు.
ఆచార్య కంటే బెటర్‌గా
దేవర చిత్రంలో ఎన్టీఆర్ నటన, రత్నవేలు సినిమాటోగ్రఫీ ప్రధాన ప్లస్ పాయింట్స్ అని టాక్. సినిమాలో జాన్వీ కపూర్ ఎంట్రీ కొంతవరకు ఆలస్యంగా ఉంటుందని సమాచారం. కొరటాల శివ ఆచార్య కంటే బెటర్‌గా అభిమానులను ఆకట్టుకునే అంశాలు దేవరలో చాలా ఉన్నాయని, సాధారణ ప్రేక్షకులు సైతం మెచ్చేలా సీన్స్ ఉన్నాయని అంటున్నారు.
బాహుబలి పార్ట్ 1 వంటి తరహాలోనే దేవర క్లైమాక్స్ ఉంటుందని సినిమాటోగ్రాఫర్ రత్నవేలు ఇదివరకు చెప్పారు. బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు అనే ప్రశ్న దేశవ్యాప్తంగా వైరల్ అయిన విషయం తెలిసిందే. అలాంటి పాయింట్‌తోనే దేవర క్లైమాక్స్ ఉంటుందట. ఇక జాన్వీ కపూర్ ఎంట్రీ సెకండాఫ్‌లో ఉంటుందని సమాచారం.
జాన్వీ కపూర్ ఇరిటేటింగ్
కాగా దేవరపై క్రిటిక్‌గా చెప్పుకునే ఉమర్ సంధు రివ్యూ ఇచ్చారు. దేవర యాక్షన్ స్టంట్స్ క్రేజీగా ఉన్నాయని, ముఖ్యంగా సెకండాఫ్‌లో అని ఉమర్ సంధు తెలిపారు.
"అదిరిపోయే నటనతో ఎన్టీఆర్ ఆకట్టుకున్నారు. సినిమాకు కావాల్సినంత పవర్ ఇచ్చారు. సైఫ్ అలీ ఖాన్ ఫెంటాస్టిక్. జాన్వీ కపూర్ ఇరిటేటింగ్. బిగ్ స్క్రీన్‌లో చూసేవారికి దేవర పైసా వసూల్ ఎంటర్టైనర్" అని చెప్పిన ఉమర్ సంధు ఐదుకు 3.5 రేటింగ్ ఇచ్చారు.