Aho Vikramarka: ఆర్ఆర్ఆర్ అసోసియేట్ డైరెక్టర్‌తో మగధీర విలన్ మూవీ - అహో విక్రమార్క రిలీజ్ డేట్ ఇదే!!
Aho Vikramarka: మగధీర విలన్ దేవ్‌గిల్ హీరోగా ఎంట్రీ ఇస్తోన్న అహో విక్రమార్క మూవీ ఆగస్ట్ 30న థియేటర్లలో రిలీజ్ కాబోతోంది. ఈ సినిమాకు రాజమౌళి శిష్యుడు పేట త్రికోటి దర్శకత్వం వహిస్తున్నాడు.
Aho Vikramarka: మగధీర సినిమాలో విలన్ పాత్రతో దక్షిణాది ప్రేక్షకులకు చేరువయ్యాడు దేవ్‌గిల్. తాజాగా అతడు హీరోగా ఎంట్రీ ఇస్తోన్నాడు. అహో విక్రమార్క పేరుతో ఓ మూవీ చేశాడు. ఈ సినిమా రిలీజ్ డేట్‌ను దేవ్ గిల్ అనౌన్స్‌చేశాడు. ఆగస్ట్ 30న అహో విక్రమార్క్ పాన్ ఇండియన్ లెవెల్‌లో తెలుగు, తమిళం, హిందీ, కన్నడ భాషల్లో విడుదల కాబోతున్నట్లు ప్రకటించాడు. రిలీజ్ డేట్ పోస్టర్‌ను గమనిస్తే ఈ మూవీలో హీరో పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ పోస్టర్‌లో దేవ్ గిల్ విలన్‌కు గట్టి పంచ్ ఇస్తూ కనిపిస్తోన్నాడు.
రాజమౌళి శిష్యుడు...
అహోవిక్రమార్క మూవీలో హీరోగా నటిస్తూనే ఈ మూవీని ప్రొడ్యూస్ చేస్తోన్నాడు దేవ్ గిల్. ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీకి రాజమౌళి శిష్యుడు పేట త్రికోటి దర్శకత్వం వహిస్తున్నాడు. పోలీసుల ధైర్యం, అంకిత భావాన్ని చాటిచెప్పే కథాంశంతో యాక్షన్, ఫ్యామిలీ ఎమోషన్స్ అంశాలతో ఈ మూవీని డైరెక్టర్ తెరకెక్కిస్తోన్నట్లు సమాచారం. ఇప్పటి వరకు తాను ఎక్కువ నెగెటివ్ షేడ్స్‌తో కూడిన పాత్రలే చేశానని, వాటికి భిన్నంగా నటుడిగా తనలోని కొత్త కోణాన్ని అహో విక్రమార్క సినిమాలో చూస్తారని దేవ్‌గిల్ అన్నాడు.
మగధీర నుంచి...
పోలీసుల పవర్‌ను తెలియజెప్పే రోల్‌లో దేవ్‌గిల్ ఈ మూవీలో కనిపిస్తాడని డైరెక్టర్ అన్నాడు. మగధీర నుంచి దేవ్‌గిల్‌తో పరిచయం ఉందని, అతడిని దృష్టిలో పెట్టుకొని ఈ కథను రాసుకున్నట్లు చెప్పాడు. తెలుగు, హిందీ భాషల్లో ఈ సినిమాను షూట్ చేశామని, తమిళం, కన్నడ భాషల్లోకి డబ్ చేసి రిలీజ్ చేయబోతున్నట్లు డైరెక్టర్ వెల్లడించాడు.
కేజీఎఫ్ ఫేమ్...
అహో విక్రమార్క మూవీలో చిత్రాశుక్లా హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రవీణ్, తేజస్విని పండిట్, బత్తిరి సత్తి ఇతర కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. ఈ సినిమాకు కేజీఎఫ్ ఫేమ్ రవి బస్రూర్, ఆర్కో ప్రవో ముఖర్జీ మ్యూజిక్ అందిస్తోన్నారు. ఇటీవలే ీ మూవీ టీజర్ ను రిలీజ్ చేశారు.
బాహుబలి నుంచి ఆర్ఆర్ఆర్
పేట త్రికోటి మగధీర నుంచి రాజమౌళి టీమ్‌లో పనిచేస్తోన్నారు. మగధీరతో పాటు బాహుబలి, బాహుబలి 2, ఆర్ఆర్ఆర్ సినిమాలకు రాజమౌళి దగ్గర అసోసియేట్ డైరెక్టర్‌గా త్రికోటి పనిచేశాడు. గతంలో జువ్వ పేరుతో దర్శకుడిగా ఓ సినిమా చేశాడు. అహో విక్రమార్క అతడి సెకండ్ మూవీ.
మెగా హీరోల మూవీల్లో...
మగధీర మూవీతో తెలుగులో పాపులర్ అయ్యాడు దేవ్‌గిల్. ఈ మూవీలో విలన్‌గా డ్యూయల్ షేడ్ క్యారెక్టర్‌లో అదరగొట్టాడు. ఆ తర్వాత రగడ, పూలరంగడు, రచ్చ, నాయక్. వకీల్‌సాబ్‌తో పాటు మరికొన్ని సినిమలు చేశాడు. ఎక్కువగా మెగా హీరోల సినిమాల్లోనే విలన్‌గా కనిపించాడు. తెలుగుతో పాటు హిందీ, కన్నడ, పంజాబీతో పాటు పలు భాషల్లో సినిమాలు చేశాడు.
పెళ్లి తర్వాత ఫస్ట్ మూవీ...
తెలుగులో నేను శైలజ, రంగులరాట్నంతో పాటు పలు సినిమాల్లో హీరోయిన్‌గా కనిపించింది చిత్రాశుక్లా. గత ఏడాది ప్రియుడితో ఏడడుగులు వేసింది. పెళ్లి తర్వాత విడుదలవుతోన్న చిత్రాశుక్లా మొదటి మూవీగా అహో విక్రమార్క నిలవనుంది.