Action Thriller Movie OTT: ఓటీటీలో మైల్‍స్టోన్ దాటిన తెలుగు యాక్షన్ మూవీ.. ట్రెండింగ్‍లోకి దూసుకొచ్చిన సినిమా
Harom Hara OTT Streaming: హరోంహర చిత్రం ఓటీటీలో దూసుకెళుతోంది. థియేటర్లలో పెద్దగా వసూళ్లు దక్కించుకోలేకపోయిన ఈ చిత్రం ఓటీటీలో మంచి స్టార్ట్ అందుకుంది. అప్పుడే ఓ మైల్‍స్టోన్ దాటింది.
నవ దళపతి సుధీర్ బాబు హీరోగా నటించిన హరోంహర సినిమా ఓటీటీ విషయంలో ఓ దశలో సందిగ్ధత నెలకొంది. అధికారికంగా ప్రకటించిన తేదీకి ముందుగా ఈ మూవీ రాలేదు. వాయిదా పడింది. అయితే, ఎట్టకేలకు జూలై 15న హరోంహర చిత్రం ఆహా ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు వచ్చింది. ఆ మరుసటి రోజే ఈటీవీ విన్‍లోనూ అడుగుపెట్టింది. జూన్ 14న థియేటర్లలో రిలీజైన హరోంహర నెల తర్వాత ఓటీటీల్లోకి వచ్చింది. కాగా, ఈ సినిమా ఆహా ఓటీటీలో దుమ్మురేపుతోంది. తాజాగా ఓ మైలురాయిని అధిగమించింది.
75 మిలియన్ మినిట్స్ దాటి..
హరోంహర సినిమా ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్‍కు వచ్చిన వారంలోనే ఓ మైల్‍స్టోన్ అధిగమించింది. ఈ సినిమా ఆహాలో 75 మిలియన్ల స్ట్రీమింగ్ నిమిషాల మార్క్ దాటింది. ఈ విషయాన్ని ఆహా నేడు (జూలై 22) వెల్లడించింది. అలాగే, ఆ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో హరోం హర సినిమా ప్రస్తుతం టాప్‍లో ట్రెండ్ అవుతోంది.
హరోంహర చిత్రానికి ఓటీటీలో పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. ఓటీటీలో చూశాక చాలా మంది నెటిజన్లు సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. ఈ మూవీలో యాక్షన్ అదిరిపోయిందని పోస్టులు చేస్తున్నారు. సుధీర్ బాబు పర్ఫార్మెన్స్ అదిరిపోయిందని ప్రశంసిస్తున్నారు. థియేటర్లలో ఆశించిన స్థాయిలో కలెక్షన్లను రాబట్టలేకపోయిన హరోంహర ఓటీటీలో మాత్రం దూసుకెళుతోంది.
హిందీలో కూడా..
హరోంహర సినిమా ఆహా, ఈటీవీ విన్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍ల్లో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే, ఈ చిత్రం హిందీ డబ్బింగ్ కూడా అయింది. ఈ మూవీ హిందీ వెర్షన్ జియోసినిమా ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు అందుబాటులోకి వచ్చింది.
హరోంహర సినిమాకు జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వం వహించారు. 1980ల బ్యాక్‍డ్రాప్‍లో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ మూవీలో సుధీర్ బాబు సరసన మాళవిక శర్మ హీరోయిన్‍గా నటించారు. సునీల్ ఓ మెయిన్ రోల్ చేశారు. జయప్రకాశ్, రవి కాలే, అర్జున్ గౌడ, లక్కీ లక్ష్మణ్ కీలకపాత్రలు పోషించారు.
హరోంహర చిత్రాన్ని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్ పతాకంపై సుమంత్ నాయుడు నిర్మించారు. ఈ సినిమాకు చైతన్ భరద్వాజ్ మ్యూజిక్ ఇచ్చారు. ఈ మూవీలో బ్యాక్‍గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఆకట్టుకుంది. యాక్షన్ సీక్వెన్సులను బీజీఎం ఎలివేట్ చేసింది.
హరోంహర చిత్రం సుమారు రూ.6కోట్ల కలెక్షన్లను సాధించింది. సుమారు రూ.10కోట్ల బడ్జెట్‍తో రూపొందిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచింది. ఈ చిత్రానికి ప్రమోషన్లను కూడా మూవీ టీమ్ ఎక్కువగానే చేసింది. హీరో సుధీర్ బాబు బావ సూపర్ స్టార్ మహేశ్ బాబు కూడా సపోర్ట్ చేశారు. అయితే, జూన్ 14న థియేటర్లలో రిలీజైన ఈ మూవీకి మొదటి నుంచి మిక్స్డ్ టాక్ వచ్చింది. ఈ ప్రభావం కలెక్షన్లపై పడింది.
కాగా, ఆహా ఓటీటీలో గెటప్ శ్రీను హీరోగా నటించిన రాజుయాదవ్ చిత్రం జూలై 24వ తేదీన స్ట్రీమింగ్‍కు రానుంది. మే 24న థియేటర్లలో విడుదలైన ఈ మూవీ సరిగ్గా రెండు నెలల తర్వాత ఓటీటీలోకి వస్తోంది. ఈ చిత్రాన్ని డైరెక్టర్ కృష్ణమాచారి కే తెరకెక్కించారు. కామెడీ ఎమోషనల్ డ్రామాగా రాజుయాదవ్ చిత్రం వచ్చింది.
టాపిక్