Kalki 2898 Ad: కల్కి 2898 ఏడీలో రాజమౌళి పాత్ర ఇదేనా?- ప్రభాస్ మూవీలో గెస్ట్‌లుగా నటిస్తోన్న హీరోలు ఎవరంటే?
Kalki 2898 Ad: ప్రభాస్ కల్కి 2898 ఏడీ మూవీలో దిగ్గజ దర్శకుడు రాజమౌళి గెస్ట్ పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం. విశ్వామిత్ర క్యారెక్టర్‌లో రాజమౌళి కనిపిస్తాడని అంటున్నారు.

Kalki 2898 Ad: ప్రభాస్ కల్కి 2898 ఏడీ మూవీ సెకండ్ ట్రైలర్ నేషనల్ వైడ్‌గా ట్రెండింగ్‌గా మారింది. టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్, కోలీవుడ్ అనే భేదాలు లేకుండా అన్ని భాషల ఆడియెన్స్‌ను ఈ ట్రైలర్ మెప్పిస్తోంది. సెకండ్ ట్రైలర్ తో కల్కి మూవీపై ఉన్న అంచనాలను అమాంతం పెరిగాయి.
సెకండ్ ట్రైలర్‌లోని విజువల్స్, ప్రభాస్ హీరోయిజంతో పాటు అమితాబ్, కమల్‌హాసన్ క్యారెక్టర్స్ లుక్స్ ఆడియెన్స్‌లో ఇంట్రెస్ట్‌ను కలిగిస్తోన్నాయి. హాలీవుడ్ సినిమాలకు ధీటుగా ఈ ట్రైలర్ ఉందంటూ ప్రశంసలు కురిపిస్తోన్నారు. మూడు లోకాల కథతో దర్శకుడు నాగ్ అశ్విన్ ఈ మూవీని తెరకెక్కిస్తోన్నాడు.
కమల్‌హాసన్ విలన్...
కల్కి 2898 ఏడీలో కమల్‌హాసన్ విలన్ పాత్రలో కనిపించబోతున్నాడు. అమితాబ్‌బచ్చన్ ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడు. దీపికా పదుకోణ్ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈసినిమాలో దిశా పటానీ మరో నాయికగా కనిపించబోతున్నది. వీరితో పాటు అన్నాబెన్, మాళవికా నాయర్, శోభన, రాజేంద్రప్రసాద్ కీలక పాత్రల్లో నటిస్తోన్నారు.
నాని, విజయ్ దేవరకొండ....
కల్కి 2898 ఏడీ సినిమాలో టాలీవుడ్ హీరోలు నాని, విజయ్ దేవరకొండ గెస్ట్ పాత్రల్లో కనిపించబోతున్నట్లు వార్తలు వినిపిస్తోన్నాయి. వీరితో పాటు మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ కూడా నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. అలాగే టాలీవుడ్ దిగ్గజ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి కల్కి మూవీలో విశ్వామిత్రగా కనిపించబోతున్నట్లు సమాచారం.
సినిమాలో కీలక సందర్భంలో రాజమౌళి పాత్ర కనిపిస్తోందని అంటున్నారు. రెండు నుంచి మూడు నిమిషాల నిడివి లోపే రాజమౌళి క్యారెక్టర్ ఉండబోతున్నట్లు తెలిసింది. కల్కి మూవీ కోసం ఫస్ట్ టైమ్ డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మ యాక్టర్‌గా మారినట్లుచెబుతోన్నారు. ఆర్‌జీవీ క్యారెక్టర్ సర్‌ప్రైజింగ్‌గా ఉంటుందని అంటున్నారు.
మృణాల్ ఠాకూర్…
కల్కి 2898 ఏడీలో హీరోలు మాత్రమే కాదు పలువురు హీరోయిన్లు కూడా గెస్ట్‌లుగా కనిపించి ఆడియెన్స్‌కు థ్రిల్లింగ్‌ను పంచబోతున్నట్లు సమాచారం. సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్ కల్కి మూవీలో గెస్ట్‌గా తళుక్కున మెరవబోతున్నది.
అయితే మృణాల్ క్యారెక్టర్ ఏమిటన్నది మాత్రం మేకర్స్ రివీల్ చేయలేదు. మృణాల్ మాత్రమే కాదు...మిగిలిన గెస్ట్ హీరోలు, హీరోయిన్లు అందరి పాత్రలపై థియేటర్లలోనే క్లారిటీ ఇవ్వనున్నట్లు సమాచారం. దాదాపు ఆరు వందల కోట్ల బడ్జెట్‌తో వైజయంతీ మూవీస్ పతాకంపై అశ్వనీదత్ ఈ మూవీని ప్రొడ్యూస్ చేస్తున్నాడు.
అడ్వాన్స్ బుకింగ్స్ రికార్డులు...
ఓవర్‌సీస్‌లో అడ్వాన్స్ బుకింగ్స్‌తోనే కల్కి 2898 ఏడీ రికార్డులను సృష్టిస్తోంది. అమెరికాలో ఈ మూవీ అడ్వాన్స్ బుకింగ్స్ రెండు మిలియన్లు దాటింది. అతి తక్కువ టైమ్‌లో ఈ ఘనతను సాధించిన ఇండియన్ మూవీగా కల్కి నిలిచింది. అంతే కాకుండా అమెరికాలో కల్కి మూవీ ఐమాక్స్ వెర్షన్ షోస్ ఇప్పటివరకు 210కిపైగా కన్ఫామ్ అయ్యాయి. అమెరికాలో ఐమాక్స్ వెర్షన్‌లో అత్యధిక షోస్ స్క్రీనింగ్ కాబోతున్న ఫస్ట్ ఇండియన్ మూవీగా కల్కి నిలిచింది. కల్కి మూవీ తెలుగుతో పాటు తమిళం, హిందీ, మలయాళం, కన్నడ, ఇంగ్లీష్ భాషల్లో రిలీజ్ కాబోతోంది.