(1 / 5)
టాలీవుడ్ సీనియర్ హీరో చిరంజీవి...భార్య సురేఖ, కూతురు సుస్మితతో కలిసి జూబ్లీహిల్స్ క్లబ్‌లో ఓటు హక్కును వినియోగించుకున్నారు.
(2 / 5)
మంగళగిరి లక్ష్మీనరసింహ స్వామి కాలనీలోని పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కును వినియోగించుకున్నాడు జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్.
(3 / 5)
టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ హైదరాబాద్‌లోని జూబ్లీ హిల్స్‌లో ఓటేశాడు. తనకు ఏ పార్టీతో సంబంధం లేదని, మావయ్య పవన్ కళ్యాణ్ మద్ధుతు ఉంటుందని ఓటుహక్కును వినియోగించుకున్న అనంతరం అల్లు అర్జున్ చేసిన కామెంట్స్ హాట్ టాపిక్‌గా మారాయి.
(4 / 5)
అగ్ర దర్శకుడు రాజమౌళి లోక్‌సభ ఎన్నికల్లో ఓటువేశారు. ఓటు హక్కును వినియోగించుకోవడం కోసమే దుబాయ్ నుంచి వచ్చినట్లు రాజమౌళి పేర్కొన్నాడు. ఎయిర్‌పోర్ట్ నుంచి డైరెక్ట్‌గా పోలింగ్ బూత్‌కు వచ్చినట్లు చెప్పాడు.
(5 / 5)
టాలీవుడ్ అగ్ర హీరో ఎన్టీఆర్ భార్య లక్ష్మిప్రణతి, తల్లి షాలినితో కలిసి జూబ్లీహిల్స్‌లోని ఓబుల్‌రెడ్డి స్కూల్‌లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్నాయి.
ఇతర గ్యాలరీలు