Koratala Siva: మితిమీరిన ధైర్యం మూర్ఖత్వం, సలహాలు ఇచ్చేవాళ్లు లేరు.. దేవర డైరెక్టర్ కొరటాల శివ కామెంట్స్-director koratala siva comments on jr ntr devara movie and starrer by janhvi kapoor saif ali khan ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Koratala Siva: మితిమీరిన ధైర్యం మూర్ఖత్వం, సలహాలు ఇచ్చేవాళ్లు లేరు.. దేవర డైరెక్టర్ కొరటాల శివ కామెంట్స్

Koratala Siva: మితిమీరిన ధైర్యం మూర్ఖత్వం, సలహాలు ఇచ్చేవాళ్లు లేరు.. దేవర డైరెక్టర్ కొరటాల శివ కామెంట్స్

Sanjiv Kumar HT Telugu
Sep 25, 2024 10:18 AM IST

Director Koratala Siva About Jr NTR Devara Movie: జూనియర్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ దేవర పార్ట్ 1కు డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వం వహించారు. దేవర ప్రమోషన్స్‌ చేస్తూ బిజీగా ఉన్న కొరటాల శివ మితిమీరిన ధైర్యం కరెక్ట్ కాదని, అది మూర్ఖత్వం అవుతుందని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

మితిమీరిన ధైర్యం మూర్ఖత్వం, సలహాలు ఇచ్చేవాళ్లు లేరు.. దేవర డైరెక్టర్ కొరటాల శివ కామెంట్స్
మితిమీరిన ధైర్యం మూర్ఖత్వం, సలహాలు ఇచ్చేవాళ్లు లేరు.. దేవర డైరెక్టర్ కొరటాల శివ కామెంట్స్

Koratala Siva About Jr NTR Devara Movie: మ్యాన్ ఆఫ్ మాసెస్ టైటిల్ పాత్ర‌లో న‌టించిన భారీ బ‌డ్జెట్ చిత్రం దేవర. దీనికి కొరటాల శివ దర్శకత్వం వహించారు. జాన్వీ క‌పూర్ హీరోయిన్‌గా న‌టిస్తోన్న ఈ సినిమాలో మ‌రో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ కీల‌క పాత్ర‌లో న‌టించారు.

నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ స‌మ‌ర్ప‌ణ‌లో ఎన్టీఆర్ ఆర్ట్స్‌, యువ సుధ ఆర్ట్స్ ప‌తాకాల‌పై మిక్కిలినేని సుధాక‌ర్‌, హ‌రికృష్ణ‌.కె నిర్మించిన దేవర మూవీ సెప్టెంబ‌ర్ 27న వ‌ర‌ల్డ్ వైడ్ గ్రాండ్ రిలీజ్ అవుతోంది. ఈ సంద‌ర్భంగా చిత్ర ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ ‘దేవర’ సినిమా గురించి ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాల‌ను తెలియ‌జేశారు. కొరటాల శివ మాట్లాడుతూ..

ఎగ్జామ్ రాసి

-దేవ‌ర‌ సినిమా రిలీజ్ డేట్ ద‌గ్గ‌ర ప‌డుతోంది. ఎగ్జామ్ రాసిన త‌ర్వాత రిజ‌ల్ట్ కోసం వెయిట్ చేసేట‌ప్పుడు ఉండే ఎగ్జ‌యిట్‌మెంటో, నెర్వ‌స్‌నెస్ ఏదైనా అనుకోవ‌చ్చు.. మ‌న‌సులో అలా ఉంది. ప్ర‌తి సినిమా రిలీజ్‌కు ముందు ఉండేదే.

-దేవ‌ర‌ మూవీ క‌థ అంతా పిక్ష‌న‌ల్‌. ఎక్క‌డా నిజ ఘ‌ట‌న‌ల‌ను ఆధారంగా చేసుకోలేదు. మ‌నిషికి మితిమీరిన ధైర్యం కూడా క‌రెక్ట్ కాదు. అది మూర్ఖ‌త్వం అవుతుంది. మ‌న‌కు తెలియ‌కుండానే మ‌న‌లో ఓ భ‌యం ఉంటుంది. దాన్ని గౌర‌వించాల‌ని చెప్ప‌ట‌మే దేవ‌ర‌ క‌థ‌.

భయం ఎంతో అవసరం

-భ‌యం లేకుండా ఉండాల‌నుకోవ‌టం త‌ప్పు. లా ఆఫ్ ల్యాండ్ అనేది ఒక‌టి ఉంటుంది క‌దా. దాన్ని అంద‌రూ పాటించాలి. అదే భ‌యం అంటే. ఉదాహ‌ర‌ణ‌కు ట్రాఫిక్ ద‌గ్గ‌ర రెడ్ సిగ్న‌ల్ ప‌డ‌గానే అంద‌రం ఆగుతాం. ఎందుకు ఆగాలి.. వెళ్లిపోవ‌చ్చు క‌దా అనుకోవ‌చ్చు. కానీ, మ‌న‌లో ఆగాల‌నే చిన్న‌పాటి భ‌యం ఉంటుందిగా. అందుకే ఆగుతాం. అలాంటి భ‌యం మ‌నిషికి ఎంతో అవ‌స‌రం.. మంచిది కూడా. అదే నేను దేవ‌ర‌ సినిమాలో చెప్పాను.

-జ‌వాబుదారీత‌నం కూడా ఓ భ‌య‌మే. ఇలాంటి భ‌యం ఉండ‌టం వ‌ల్ల మ‌నం చేసే ప‌నిని చెక్ చేసుకుని మంచి రిజ‌ల్ట్ పొందుతాం. ఎన్టీఆర్ గారితో జ‌ర్నీ ఎప్పుడూ నాకు స్పెష‌లే. ఏ విష‌యం అయినా ఆయ‌న‌తో డిస్క‌స్ చేసిన‌ప్పుడు బాగున్నా, బాగోలేక‌పోయినా డిప్లొమెటిక్‌గా స‌మాధానం చెప్ప‌రు. ఓపెన్‌గా మ‌న‌సులో ఉన్న భావాన్ని చెబుతారు. దేవ‌ర‌ లైన్ చెప్పిన‌ప్పుడు ఆయ‌న స్పందించిన తీరుతోనే నెక్ట్స్ లెవ‌ల్‌కు వెళ్లాల‌ని నిర్ణ‌యించుకున్నాం.

-దేవ‌ర‌ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్ల‌టానికే 6 నెల‌లు స‌మ‌యం తీసుకున్నాం. స‌ముద్రంపై ఎలా షూట్ చేయాలి.. అక్క‌డ లైటింగ్ వేరియేష‌న్స్ ఉంటాయి. మ‌నం స‌ముద్రాన్ని ఎలా క్రియేట్ చేసుకోవాలి. దాన్నెలా చేయాల‌నే అంశాల‌పై స్ట‌డీ చేశాం. అందుక‌నే స‌మ‌యం తీస‌ుకున్నాం. ఎందుకంటే ఇలా షూటింగ్ ఎవ‌రూ చేయ‌క‌పోవటం వ‌ల్ల మ‌న‌కు స‌ల‌హాలిచ్చేవాళ్లు లేరు. అందుకే స‌మ‌యం ప‌ట్టింది.

మనవాళ్లకు అలవాటే

-మ‌న టెక్నీషియ‌న్స్ గురించి ఎంత చెప్పినా త‌క్కువే. చాలా టాలెంటెడ్‌. మ‌న‌వాళ్లు ప్రిపరేష‌న్ లేకుండా వెళ్లినా ఎగ్జిక్యూట్ చేయ‌గ‌ల‌రు. హాలీవుడ్ టెక్నీషియ‌న్స్ అలా కాదు. వాళ్లు ప్రిపేర్ కాక‌పోతే భ‌య‌ప‌డిపోతారు. ప్ర‌తీ స‌న్నివేశాన్ని రిహార్స‌ల్స్ చేసుకుని వెళతారు. అదే లాస్ట్ మినిట్ టెన్ష‌న్‌లోనూ ప‌ని చేయ‌టం మ‌న వాళ్ల‌కు అల‌వాటే. అదే మ‌న వాళ్ల‌కు హాలీవుడ్ టెక్నీషియ‌న్స్ త‌ర‌హాలో ప్రిప‌రేష‌న్ టైమ్ ఇస్తే.. ఇంకా అద్భుతాలు చేస్తారు.