(1 / 8)
జాన్వీ కపూర్ అందాల అప్సరసల దర్శనమిచ్చింది. జూనియర్ ఎన్టీఆర్ దేవర: పార్ట్ 1ను ప్రమోట్ చేస్తున్న జాన్వీ కపూర్ ఇలా ఎంతో గ్లామర్‌గా కనిపించి కనువిందు చేసింది.
(Instagram/@janhvikapoor)(2 / 8)
జాన్వీ ఇన్ స్టాగ్రామ్ లో వరుసగా తన ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులకు సర్‌ప్రైజ్ ఇచ్చింది. అయితే, దీంతో అభిమానులు ఫిదా అవుతున్నారు.
(Instagram/@janhvikapoor)(3 / 8)
జాన్వీ కపూర్ పింక్ కలర్ చీరలో ఎంతో అందంగా దర్శనమిచ్చింది. స్లీవ్ లెస్ బ్లౌజ్‌తో గ్లామర్‌ను జోడించింది. ఆ చీర, ఎంబ్రాయిడరీ బ్లౌజ్‌ను నచికేత్ బావే డిజైన్ చేశారు. అయితే, ఈ చీర ధర రూ. 1,24, 850. అంటే, అక్షరాల లక్ష 24 వేల ఎనిమిది వందల యాభై రూపాయలు.
(Instagram/@janhvikapoor)(4 / 8)
అయితే, ఈ చీరకు సెలబ్రిటీ స్టైలిస్ట్ అమీ పటేల్ సహకారంతో డైమండ్ ఇయర్ రింగ్స్‌ను పెట్టుకుని మ్యాచ్ చేసింది. ఇప్పుడు ఈ ఇయర్ రింగ్స్ ధర ఇంట్రెస్టింగ్‌గా మారింది. జాన్వీ కపూర్ పెట్టుకున్న ఇయర్ రింగ్స్ ధర ఏకంగా రూ. 13 లక్షలు. చీర కంటే ఇయర్ రింగ్స్ రేటు ఎక్కువ ఉండటం విశేషంగా మారింది.
(Instagram/@janhvikapoor)(5 / 8)
మేకప్ ఆర్టిస్ట్ సావ్లీన్ కౌర్ మన్ చందా రూపొందించిన పింక్ ఐషాడో, రెక్కల ఐలైనర్, నిగనిగలాడే పెదవులతో జాన్వీ కపూర్ అందం మరింత మెరిసిపోయింది. హెయిర్ స్టైలిస్ట్ మార్స్ పెడ్రోజో సహాయంతో ఆమె తన జుట్టును మృదువైన గుండ్రంగా డిజైన్ చేసి సైడ్ పార్టిషన్ లో వదులుగా ఉంచింది.
(Instagram/@janhvikapoor)(6 / 8)
ఇదిలా ఉంటే, మరో లుక్‌లో జాన్వీ కపూర్ చాలా హాట్‌గా కనిపించింది. మోడ్రన్ డ్రెస్ తో కూడిన అదిరిపోయే ఐస్ బ్లూ చీరలో జాన్వీ అందం మరింత సుమనోహరంగా కనిపించింది. ముత్యాలు పూసిన బ్లౌజ్ ధరించి, ఒక భుజం మీద పల్లును కప్పి, అప్సర లాంటి సొగసుతో గ్లామర్ ను యాడ్ చేసింది.
(Instagram/@janhvikapoor)(7 / 8)
తెల్లటి ముత్యాలతో కూడిన స్టేట్ మెంట్ చెవిపోగులతో ఆమె తన లుక్ ను పూర్తి చేసింది. అంతేకాకుండా సూపర్ హాట్ పోజులతో జాన్వీ మరింత సెక్సీగా కనిపించింది.
(Instagram/@janhvikapoor)ఇతర గ్యాలరీలు