Double Ismart First Review: డబుల్ ఇస్మార్ట్ ఫస్ట్ రివ్యూ- క్లైమాక్స్ ట్విస్ట్ నెక్ట్స్ లెవెల్- పూరి హిట్ కొట్టాడా అంటే?
Double Ismart Movie First Review In Telugu: డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెరకెక్కించిన మరో యాక్షన్ సినిమా డబుల్ ఇస్మార్ట్. ఉస్తాద్ రామ్ పోతినేని హీరోగా చేసిన ఈ సినిమా ఆగస్ట్ 15న విడుదల కానుంది. అయితే, ఈ మూవీ చూసేసిన సెన్సార్ సభ్యులు డబుల్ ఇస్మార్ట్ మూవీ ఫస్ట్ రివ్యూ ఇచ్చేశారు.
Double Ismart First Review Telugu: డ్యాషింగ్ అండ్ డేరింగ్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్నాడు పూరి జగన్నాథ్. క్రిటిక్స్ సైతం ఆశ్చర్యపోయే హిట్స్ ఇచ్చిన పూరి జగన్నాథ్ లైగర్ మూవీతో భారీ డిజాస్టర్ అందుకున్నాడు. ఈ సినిమా తర్వాత పూరి జగన్నాథ్ తెరకెక్కించిన మూవీ డబుల్ ఇస్మార్ట్.
2019లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. పూరి కెరీర్‌లో ఇస్మార్ట్ శంకర్ మూవీ మరో హిట్‌గా నిలవగా చిత్రంలోని పాటలకు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాకు సీక్వెల్‌గా తెరకెక్కిందే డబుల్ ఇస్మార్ట్. ఉస్తాద్ రామ్ పోతినేని హీరోగా పూరి జగన్నాథ్ కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
డబుల్ ఇస్మార్ట్ చిత్రాన్ని పూరి కనెక్ట్స్ బ్యానర్‌పై పూరి జగన్నాథ్, సీనియర్ హీరోయిన్, నిర్మాత ఛార్మి కౌర్ సంయుక్తంగా నిర్మించారు. మణిశర్మ సంగీతం అందించిన డబుల్ ఇస్మార్ట్ సినిమా స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆగస్ట్ 15న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో సినిమాను చూసిన సెన్సార్ మెంబర్స్ డబుల్ ఇస్మార్ట్ మూవీపై ఫస్ట్ రివ్యూ ఇచ్చేశారు.
ఇటీవలే డబుల్ ఇస్మార్ట్ సినిమాను సెన్సార్ బోర్డ్ మెంబర్స్ చూసినట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి సెన్సార్ సభ్యులు ఏ (A) సర్టిఫికెట్ ఇచ్చినట్లు మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించింది. అలాగే డబుల్ ఇస్మార్ట్ మూవీ రన్ టైమ్ 2 గంటల 42 నిమిషాలు (162 నిమిషాలు) అని సమాచారం. అంటే, సాధారణ సినిమాలతో చూస్తే డబుల్ ఇస్మార్ట్ రన్ టైమ్ కాస్తా ఎక్కువగానే ఉంది.
డబుల్ ఇస్మార్ట్ సినిమా వీక్షించిన సెన్సార్ బోర్డ్ సభ్యులు ఫిదా అయ్యారని సమాచారం. ఇస్మార్ట్ శంకర్ సినిమాకు మించి మాస్ ఫీస్ట్‌ను డబుల్ ఇస్మార్ట్‌తో అందించనున్నారను సెన్సార్ మెంబర్స్ అభిప్రాయపడుతున్నారట. సినిమాకు ఫుల్ పాజిటివ్ టాక్ ఇచ్చారు బోర్డ్ మెంబర్స్. బీ, సీ సెంటర్స్ ఆడియెన్స్‌కు డబుల్ ఇస్మార్ట్ బాగా నచ్చుతుందని వారు చెప్పారని సమాచారం.
డబుల్ ఇస్మార్ట్ సినిమాలో రామ్ పోతినేని క్యారెక్టర్ మరింత ఎనర్జిటిక్‌గా ఉంటుందట. ప్రధానంగా రామ్, సంజయ్ దత్ పాత్రల మధ్య వచ్చే సీన్స్ అదిరిపోయాయని అంటున్నారు. క్లైమాక్స్ ట్విస్ట్ అయితే నెక్ట్స్ లెవెల్‌లో ఉందని చెబుతున్నారు.
అలాగే డైలాగ్స్ స్పెషల్ అట్రాక్షన్ కానున్నాయట. సామెతలు, వెటకారం యాడ్ చేసి తెలంగాణ యాసలో చెప్పే డైలాగ్స్ బాగా పేలాయని చెబుతున్నారు. యాక్షన్, కామెడీ, రొమాంటిక్ సీన్లతో తెరకెక్కిన డబుల్ ఇస్మార్ట్ బాక్సాఫీస్ దగ్గర బాగా వర్కౌట్ అవుతుందని అంటున్నారు.
"డబుల్ ఇస్మార్ట్ సినిమాలో పూరి జగన్నాథ్ స్టోరీ, హీరో ఎనర్జీ, డైరెక్షన్, డైలాగ్స్, స్క్రీన్‌ప్లే, ఎమోషన్స్, ఇంటర్వెల్ సీన్, హీరో హీరోయిన్ మధ్య లవ్ ట్రాక్, సంజయ్ దత్-రామ్ మధ్య మైండ్ గేమ్, మదర్ సెంటిమెంట్, క్లైమాక్స్ ట్విస్ట్ హైలెట్" అని సెన్సార్ సభ్యులు చెప్పినట్లు సమాచారం.
ఇదిలా ఉంటే, డబుల్ ఇస్మార్ట్ చిత్రంలో విలన్‌గా బాలీవుడ్ స్టార్ యాక్టర్ సంజయ్ దత్ నటించాడు. అలాగే హీరోయిన్‌గా బ్యూటిఫుల్ కావ్య థాపర్ చేసింది.