Devara OTT: అవాక్కయ్యే ధరకు దేవర ఓటీటీ రైట్స్, బిజినెస్.. ఆ పండుగకే స్ట్రీమింగ్.. ఎక్కడ చూడాలంటే?
Junior NTR Devara OTT Streaming On Festival: జూనియర్ ఎన్టీఆర్ నటించిన దేవర మూవీ ఓటీటీ రైట్స్ కళ్లు చెదిరే ధరకు అమ్ముడు పోయినట్లు తాజాగా సమాచారం అందింది. అంతేకాకుండా తెలుగు నాట పెద్ద పండుగ నాడు దేవర ఓటీటీ రిలీజ్ కానుందని టాక్ నడుస్తోంది. పూర్తి వివరాల్లోకి వెళితే..
Devara OTT Release On Festival: ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో గట్టిగా వినిపిస్తోన్న సినిమా పేరు దేవర. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ నటించిన హై ఓల్టేజ్ యాక్షన్ మూవీ దేవరకు డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వం వహించారు. ఎన్నో రోజుల నుంచి ఊరిస్తున్న దేవర మూవీ భారీ అంచనాల నడుమ ఇవాళ (సెప్టెంబర్ 27) థియేటర్లలో విడుదలైంది.
పెద్దగా స్కోప్ లేని పాత్ర
అయితే, ఎన్నో ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్న దేవరపై మిశ్రమ స్పందన వస్తోంది. కేవలం యాక్షన్ ఎపిసోడ్స్ మాత్రం నెక్ట్స్ లెవెల్‌లో ఉన్నాయని, సినిమా మాత్రం చాలా ల్యాగ్ ఉందని, బోర్ కొట్టే సీన్స్ ఉన్నాయని మిక్స్‌డ్ రివ్యూలు వస్తున్నాయి. పాటల్లో గ్లామర్ పరంగా తప్పితే జాన్వీ కపూర్ పాత్రకు పెద్దగా స్కోప్ లేదని ఆమె అభిమానులు పెదవి విరుస్తున్నారు.
దేవర పార్ట్ 1లో సాంగ్స్ మినహాయిస్తే.. కేవలం 8 నుంచి 15 నిమిషాలు మాత్రమే జాన్వీ కపూర్ కనిపిస్తుందని నెటిజన్స్ రివ్యూల్లో చెబుతున్నారు. అయితే, తంగం పాత్రలో జాన్వీ కపూర్ తన నటనతో ఆకట్టుకుందని, ఉన్నంతలో తాను బాగా యాక్ట్ చేసినట్లు టాక్ వినిపిస్తోంది.
దేవర ఓటీటీ రైట్స్
ఇక కోలీవుడ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ బీజీఎమ్ కూడా బాగుందని ప్రశంసలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే, శుక్రవారం ఈ మూవీ రిలీజైన సందర్భంగా దేవర ఓటీటీ రైట్స్‌పై క్యూరియాసిటీ నెలకొంది. దేవర ఓటీటీ హక్కులు కళ్లు చెదిరే ధరకు అమ్ముడుపోయినట్లు టాలీవుడ్ ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.
దేవర డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను నెట్‌ఫ్లిక్స్ సంస్థ రూ. 155 కోట్లు వెచ్చించి కొనుగోలు చేసిందని సమాచారం. ఎన్నో ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ పోటీ పడగా ఆఖరుకు నెట్‌ఫ్లిక్స్స సొంతం చేసుకుందని ఇన్‌సైడ్ టాక్. రూ. 300 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన దేవర సినిమాకు ఓటీటీ, శాటిలైట్, థియేటర్స్ అన్ని కలిపి రూ. 400 కోట్ల వరకు బిజినెస్ జరిగిందని సమాచారం.
దీపావళి ఫెస్టివల్‌కు
ఇకపోతే దేవర సినిమాను థియేటర్లలో విడుదలైన 50 రోజుల తర్వాతే ఓటీటీలోకి తీసుకురానున్నట్లు ఇటీవల ఓ అప్డేట్ వచ్చిన విషయం తెలిసిందే. అంటే, దేవర ఓటీటీ రిలీజ్ నవంబర్‌లో ఉండే అవకాశం ఉందని, అది కూడా దీపావళి పండుగ కానుకగా డిజిటల్ స్ట్రీమింగ్ చేయనున్నారని ఓ న్యూస్ చాలా వైరల్ అవుతోంది.
ఇక దేవర సినిమాను నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో తెలుగుతోపాటు కన్నడ, మలయాళం, తమిళం, హిందీ భాషల్లో డిజిటల్ ప్రీమియర్ చేయనున్నారని టాక్. అయితే, దేవర ఓటీటీ రైట్స్, డిజిటల్ స్ట్రీమింగ్‌పై ఇప్పటికీ ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. కాకపోతే దేవర ఓటీటీ స్ట్రీమింగ్‌కు రెండు మూడు రోజుల ముందు అఫిషియల్‌గా అనౌన్స్ చేసే అవకాశం ఉంటుంది.
గెటప్ నుంచి యాక్టింగ్ వరకు
ఇదిలా ఉంటే, దేవర సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ విలన్ రోల్ ప్లే చేశారు. ఇదివరకు ఆయన ప్రభాస్ ఆదిపురుష్ మూవీలో రావణాసురుడిగా కనిపించి ఆకట్టుకున్న విషయం తెలిసిందే. దేవరలో సైఫ్ అలీ ఖాన్ యాక్టింగ్‌కు కూడా మంచి మార్కులు పడుతున్నాయి. గెటప్ నుంచి యాక్టింగ్ వరకు సైఫ్ అలీ ఖాన్ సెటిల్డ్ పర్ఫామెన్స్ ఇచ్చారని అంటున్నారు.