OTT Telugu Movies: ఈనెల ఓటీటీల్లోకి వచ్చిన టాప్-7 తెలుగు చిత్రాలు ఇవే.. మీరు చూశారా?-ott top seven telugu releases in september committee kurrollu to saripodhaa sanivaaram netflix prime video etv win ott ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ott Telugu Movies: ఈనెల ఓటీటీల్లోకి వచ్చిన టాప్-7 తెలుగు చిత్రాలు ఇవే.. మీరు చూశారా?

OTT Telugu Movies: ఈనెల ఓటీటీల్లోకి వచ్చిన టాప్-7 తెలుగు చిత్రాలు ఇవే.. మీరు చూశారా?

Chatakonda Krishna Prakash HT Telugu
Sep 28, 2024 02:30 PM IST

OTT Top Telugu Movies in September: ఈనెలలో ఓటీటీల్లోకి చాలా తెలుగు సినిమాలు వచ్చాయి. పాపులర్ చిత్రాలు ఓటీటీల్లోకి అడుగుపెట్టాయి. ఇందులో కొన్ని థియేటర్లలో సూపర్ హిట్‍లు ఉండగా.. మరికొన్ని డిజాస్టర్ అయినవి ఉన్నాయి. ఈనెల ఓటీటీల్లోకి వచ్చిన టాప్ తెలుగు చిత్రాలు ఏవో ఇక్కడ చూడండి.

OTT Telugu Movies: ఈనెల ఓటీటీల్లోకి వచ్చిన టాప్-7 తెలుగు చిత్రాలు ఇవే.. మీరు చూశారా?
OTT Telugu Movies: ఈనెల ఓటీటీల్లోకి వచ్చిన టాప్-7 తెలుగు చిత్రాలు ఇవే.. మీరు చూశారా?

ఓటీటీల్లో ఈ నెల (సెప్టెంబర్) తెలుగు సినిమాల జాతర నడిచింది. చాలా చిత్రాలు ఓటీటీల్లో స్ట్రీమింగ్‍కు వచ్చాయి. ఆగస్టులో థియేటర్లలో రిలీజైన ముఖ్యమైన చిత్రాలు ఈనెలలో వివిధ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍ల్లోకి ఎంట్రీ ఇచ్చాయి. వివిధ జానర్ల చిత్రాలు అందుబాటులోకి వచ్చాయి. ఇందులో కొన్ని ముఖ్యమైన సినిమాలు ఉన్నాయి. ఈనెలలో ఓటీటీలోకి వచ్చిన టాప్-7 సినిమాలు ఏవో ఇక్కడ చూడండి.

కమిటీ కుర్రోళ్ళు

రూరల్ కామెడీ డ్రామా సినిమా కమిటీ కుర్రోళ్ళు సెప్టెంబర్ 12వ తేదీన ఈటీవీ విన్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టింది. ఆగస్టు 9న థియేటర్లలో రిలీజైన ఈ మూవీ బ్లాక్‍బస్టర్ అయింది. రూ.5కోట్లలోపు బడ్జెట్‍తో రూపొంది.. రూ.17కోట్ల వరకు కలెక్షన్లు సాధించింది. కమిటీ కుర్రోళ్ళు మూవీకి యధు వంశీ దర్శకత్వం వహించగా.. కొణెదల నిహారిక నిర్మించారు.

సరిపోదా శనివారం

బ్లాక్‍బస్టర్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ సరిపోదా శనివారం సెప్టెంబర్ 26వ తేదీన నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు వచ్చింది. ఆగస్టు 29న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం రూ.100కోట్లకు పైగా వసూళ్లతో సూపర్ హిట్ అయింది. నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన ఈ మూవీకి వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించారు. నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీల్లో సరిపోదా శనివారం స్ట్రీమింగ్ అవుతోంది.

ఆయ్

తక్కువ బడ్జెట్‍తో చిన్న చిత్రంగా వచ్చిన ఆయ్ కూడా సూపర్ సక్సెస్ సాధించింది. ఆగస్టు 15న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా రూ.14కోట్ల వరకు కలెక్షన్లతో దుమ్మురేపింది. ఈ సినిమా సెప్టెంబర్ 12వ తేదీన నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టింది. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడలో స్ట్రీమ్ అవుతోంది. నార్నే నితిన్, నయన్ సారిక హీరోహీరోయిన్లుగా నటించిన ఈ రొమాంటిక్ కామెడీ డ్రామా మూవీ ఆయ్‍కు అంజి కే మణిపుత్రం దర్శకత్వం వహించారు.

డబుల్ ఇస్మార్ట్

ఎనర్జిటిక్ హీరో, ఉస్తాద్ రామ్ పోతినేని హీరోగా నటించిన డబుల్ ఇస్మార్ట్ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ఎన్నో అంచనాలతో ఆగస్టు 15న రిలీజైన ఈ మాస్ యాక్షన్ మూవీ బోల్తా కొట్టింది. మిస్టర్ బచ్చన్ చిత్రం సెప్టెంబర్ 6వ తేదీన అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలోకి స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టింది. ఈ సీక్వెల్ మూవీకి పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించారు.

మిస్టర్ బచ్చన్

మిస్టర్ బచ్చన్ చిత్రం థియేటర్లలో తీవ్రంగా నిరాశపరించింది. మాస్ మహారాజ్ రవితేజ హీరోగా నటించిన ఈ మూవీ ప్లాఫ్‍గా నిలిచింది. హరీశ్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆగస్టు 15న థియేటర్లలో రిలీజై మిక్సడ్ టాక్‍తో అనుకున్న స్థాయిలో కలెక్షన్లు రాబట్టలేకపోయింది. మిస్టర్ బచ్చన్ చిత్రం సెప్టెంబర్ 12వ తేదీన నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టింది.

ప్రతినిధి 2

నారా రోహిత్ హీరోగా నటించిన పొలిటికల్ థ్రిల్లర్ చిత్రం ‘ప్రతినిధి 2’ ఈ ఏడాది మే నెలలో థియేటర్లలో రిలీజైంది. ప్రతినిధికి సీక్వెల్‍గా సుమారు ఐదేళ్ల తర్వాత వచ్చిన ఈ మూవీ ఆకట్టుకోలేకపోయింది. దీంతో కలెక్షన్లు పెద్దగా రాలేదు. ఈ ప్రతినిధి 2 చిత్రం ఇటీవలే సెప్టెంబర్ 27న ఆహా ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు వచ్చింది.

సింబా

జగపతి బాబు, అనసూయ భరద్వార్ ప్రధాన పాత్రలు పోషించిన సింబా సినిమా ఈ ఏడాది ఆగస్టు 9న థియేటర్లలో రిలీజ్ అయింది. అంచనాలు లేకుండా వచ్చిన ఈ మూవీ అంతగా బజ్ క్రియేట్ చేయలేకపోయింది. దీంతో కలెక్షన్లు ఎక్కువగా రాలేదు. సింబా చిత్రం సెప్టెంబర్ 6వ తేదీన ఆహా, అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీల్లో స్ట్రీమింగ్‍కు వచ్చింది.

Whats_app_banner