Mr Bachchan OTT Release: మరికొన్ని గంటల్లో స్ట్రీమింగ్‍కు మిస్టర్ బచ్చన్ సినిమా.. ఓటీటీలో అయినా సత్తాచాటుతుందా?-ravi teja action thriller mr bachchan ott to stream on netflix ott from tomorrow ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Mr Bachchan Ott Release: మరికొన్ని గంటల్లో స్ట్రీమింగ్‍కు మిస్టర్ బచ్చన్ సినిమా.. ఓటీటీలో అయినా సత్తాచాటుతుందా?

Mr Bachchan OTT Release: మరికొన్ని గంటల్లో స్ట్రీమింగ్‍కు మిస్టర్ బచ్చన్ సినిమా.. ఓటీటీలో అయినా సత్తాచాటుతుందా?

Chatakonda Krishna Prakash HT Telugu
Sep 11, 2024 04:24 PM IST

Mr Bachchan OTT: మిస్టర్ బచ్చన్ సినిమా ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అయింది. రేపే (సెప్టెంబర్ 12) ఈ చిత్రం స్ట్రీమింగ్‍కు రానుంది. రవితేజ హీరోగా నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. దీంతో ఓటీటీలో ఎలా పర్ఫార్మ్ చేస్తుందోననే ఆసక్తి నెలకొంది. ఏ ఓటీటీలోకి రానుందంటే..

Mr Bachchan OTT: మరికొన్ని గంటల్లో స్ట్రీమింగ్‍కు మిస్టర్ బచ్చన్ సినిమా.. ఓటీటీలో అయినా సత్తాచాటుతుందా?
Mr Bachchan OTT: మరికొన్ని గంటల్లో స్ట్రీమింగ్‍కు మిస్టర్ బచ్చన్ సినిమా.. ఓటీటీలో అయినా సత్తాచాటుతుందా?

మాస్ మాహారాజ రవితేజ బోలెడు ఆశలు పెట్టుకున్న మిస్టర్ బచ్చన్ సినిమా చతికిలపడింది. రవితేజ హీరోగా డైరెక్టర్ హరీశ్ శంకర్ తెరకెక్కించిన ఈ మూవీ దారుణమైన పరాజయాన్ని ఎదుర్కొంది. రిలీజ్‍కు ముందు మంచి అంచనాలు ఏర్పడినా వాటిని నిలబెట్టుకోలేకపోయింది. ఆగస్టు 15న థియేటర్లలో రిలీజైన మిస్టర్ బచ్చన్ డిజాస్టర్ అయింది. ఇప్పుడు నెలలోనే ఓటీటీలోకి వచ్చేస్తోంది.

స్ట్రీమింగ్ ఎక్కడంటే..

మిస్టర్ బచ్చన్ సినిమా రేపు (సెప్టెంబర్ 12) నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు రానుంది. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ భాషల్లోనూ స్ట్రీమింగ్‍కు వస్తుంది. థియేటర్లలో తెలుగులో ఒక్కటే రిలీజైన ఈ మూవీ నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో మరో మూడు భాషల్లో వస్తోంది.

మిస్టర్ బచ్చన్ సినిమా స్ట్రీమింగ్ నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో ఈ అర్ధరాత్రే మొదలవుతుంది. అంటే మరికొన్ని గంటల్లో ఈ చిత్రం ఓటీటీలోకి అందుబాటులోకి రానుంది.

ఆదరణ దక్కుతుందా?

థియేటర్లలో భారీగా బోల్తా కొట్టిన మిస్టర్ బచ్చన్ సినిమా ఓటీటీలో ఏ మేరకు ఆదరణ దక్కించుకుంటుందన్నది ఆసక్తికరంగా ఉంది. నెగెటివ్ టాక్ రావటంతో ఈ మూవీని థియేటర్లలో జనాలు పెద్దగా చూడలేదు. అందుకే కలెక్షన్లు కూడా చాలా తక్కువగా వచ్చాయి. అయితే, థియేటర్లలో చూడని వారు చాలామంది రవితేజ కోసమైనా ఈ చిత్రంపై నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో ఓ లుక్కేసే ఛాన్స్ ఉంటుంది. ఓటీటీలో మిస్టర్ బచ్చన్ మూవీ మంచి వ్యూస్ దక్కించుకునే అవకాశాలు ఉన్నాయి. మరి ఈ చిత్రం ఎలా పర్ఫార్మ్ చేస్తుందో చూడాలి.

సూపర్ హిట్ హిందీ చిత్రం రైడ్‍కు రీమేక్‍గా మిస్టర్ బచ్చన్ మూవీని హరీశ్ శంకర్ తెరకెక్కించారు. అయితే, చాలా మార్పులు చేయటంతో పాటు కమర్షియల్ హంగులను జత చేశారు. అయితే, ఈ ప్రయత్నం మంచి ఫలితాన్ని ఇవ్వలేకపోయింది. కథను పక్కదోవ పట్టించేలా ఉన్న విషయాలపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. కథనం సాదాసీదాగా ఉందని అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.

మిస్టర్ బచ్చన్ సినిమాలో రవితేజ సరసన హీరోయిన్‍గా భాగ్యశ్రీ బోర్సే నటించారు. ఈ చిత్రంతోనే తెలుగులోకి అడుగుపెట్టారు. సినిమా ప్లాఫ్ అయినా భాగ్యశ్రీకి భారీగా పాపులారిటీ వచ్చింది. గ్లామర్, డ్యాన్స్‌తో ఆకట్టుకున్నారు. ఈ చిత్రంలో జగపతి బాబు, శుభలేఖ సుధాకర్, సత్య, సచిన్ ఖేడేకర్ కీరోల్స్ చేశారు.

కలెక్షన్లు ఇలా..

మిస్టర్ బచ్చన్ సినిమా సుమారు రూ.50కోట్ల బడ్జెట్‍తో రూపొందిందని అంచనాలు ఉన్నాయి. అయితే, ఈ చిత్రం రూ.10కోట్లలోపు గ్రాస్ వసూళ్లనే దక్కించుకుంది. కమర్షియల్‍గా ఈ మూవీ భారీ పరాజయాన్ని చవిచూసింది. బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, టీ సిరీస్ ఫిల్మ్స్, పనోరమ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించాయి.

మిస్టర్ బచ్చన్ మూవీకి మిక్కీ జే మేయర్ సంగీతం అందించారు. ఈ చిత్రంలో పాటలకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. మిక్కీ తన పంథాను మార్చి మాస్ బీట్ పాటలతో ఈ చిత్రంలో మెప్పించారు. ఈ మూవీకి అయనంక బోస్ సినిమాటోగ్రఫీ చేయగా.. ఉజ్వల్ కులకర్ణి ఎడిటింగ్ చేశారు. మిస్టర్ బచ్చన్ చిత్రాన్ని రేపటి నుంచి నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో చూడొచ్చు.