Saripodhaa Sanivaaram OST: సర్‌ప్రైజ్: సరిపోదా శనివారం ‘ఓఎస్‍టీ’ వచ్చేసింది.. ఓటీటీ స్ట్రీమింగ్‍కు ఒక రోజు ముందు..
Saripodhaa Sanivaaram OST: సరిపోదా శనివారం చిత్రం నుంచి ఓఎస్‍టీ వచ్చేసింది. బ్యాక్‍గ్రౌండ్ మ్యూజిక్‍లతో కూడిన ఈ ఓఎస్‍టీని మూవీ టీమ్ అందుబాటులోకి తెచ్చింది. సినిమా ఓటీటీ స్ట్రీమింగ్‍కు కొన్ని గంటల ముందే సర్‌ప్రైజ్ ఇచ్చింది.
సరిపోదా శనివారం సినిమా బ్లాక్‍బస్టర్ అయింది. నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం సూపర్ హిట్ కొట్టింది. నాని యాక్టింగ్, వివేక్ ఆత్రేయ డైరెక్షన్‍తో పాటు ఈ మూవీ సక్సెస్ అవడంలో మ్యూజిక్ కూడా కీలకపాత్ర పోషించింది. జేక్స్ బెజేయ్ అందించిన బ్యాక్‍గ్రౌండ్ మ్యూజిక్ ఈ చిత్రానికి హైలైట్‍గా నిలిచింది. దీంతో సరిపోదా శనివారం నుంచి బ్యాక్‍గ్రౌండ్ మ్యూజిక్‍లతో ఉండే ఒరిజినల్ సౌండ్ ట్రాక్ (ఓఎస్‍టీ) ఎప్పుడు వస్తుందా అని చాలా మంది ఎదురుచూస్తున్నారు.
సరిపోదా శనివారం ఓఎస్‍టీ కావాలంటూ కొంతకాలంగా సోషల్ మీడియాలో నెటిజన్లు పోస్టులు చేస్తున్నారు. ఎట్టకేలకు మూవీ టీమ్ దీన్ని తీసుకొచ్చేసింది. ఓఎస్‍టీని నేడు (సెప్టెంబర్ 25) యూట్యూబ్‍లో అందుబాటులోకి తీసుకొచ్చింది.
73 సౌండ్ ట్రాక్స్
సరిపోదా శనివారం సినిమా నుంచి వచ్చిన ఓఎస్‍టీలో 73 బీజీఎం సౌండ్ ట్రాక్స్ ఉన్నాయి. సోనీ మ్యూజిక్ సౌత్ యూట్యూబ్ ఛానెల్‍లో ఓఎస్‍టీని మూవీ టీమ్ అందుబాటులోకి తెచ్చింది. “రీసౌండింగ్ ఇంపాక్ట్‌తో థియేట్రలను షేక్ చేసిన బీట్స్.. ఇప్పుడు మీ ఇంట్లోకి వచ్చేశాయి” అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది డీవీవీ ఎంటర్‌టైన్‍మెంట్.
సరిపోదా శనివారం ఓఎస్‍టీకి ఫుల్ క్రేజ్ కనిపించే ఛాన్స్ ఉంది. ఇప్పటికే ఈ మూవీలోని కొన్ని బ్యాక్‍గ్రౌండ్ మ్యూజిక్స్ చాలా పాపులర్ అయ్యాయి. సోషల్ మీడియాలో మోత మోగిపోయాయి. ఇప్పుడు ఓఎస్‍టీ రావటంతో మూవీలోని అన్నీ బీజీఎంలు అందుబాటులోకి వచ్చేశాయి. ఈ సినిమా యాక్షన్ సీన్లను ఎలివేట్ చేయటంలో జేక్స్ బేజోయ్ మ్యూజిక్ చాలా ఉపయోగపడింది.
కొన్ని గంటల్లో ఓటీటీ స్ట్రీమింగ్
సరిపోదా శనివారం సినిమా మరికొన్ని గంటల్లో ఓటీటీలో స్ట్రీమింగ్‍కు రానుంది. ఈ అర్ధరాత్రి (సెప్టెంబర్ 26) ఈ మూవీ నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టనుంది. తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్‍కు అందుబాటులోకి వస్తోంది. థియేటర్లలో దుమ్మురేపిన ఈ చిత్రం ఓటీటీలోనూ భారీ వ్యూస్ దక్కించుకుంటుందనే అంచనాలు ఉన్నాయి. నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలోకి సినిమా వచ్చే కొన్ని గంటల ముందే సరిపోదా శనివారం చిత్రం ఓఎస్‍టీతో సర్‌ప్రైజ్ చేసింది.
కొన్ని రోజులుగా సరిపోదా శనివారం చిత్రం నుంచి డిలీటెడ్ సీన్లను కూడా మూవీ టీమ్ తీసుకొస్తోంది. థియేట్రికల్ వెర్షన్‍లో తీసేసిన సీన్లను యూట్యూబ్‍లో తీసుకొచ్చింది. ఇప్పటి వరకు మూడు డిలీటెడ్ వీడియోలను అందుబాటులోకి తెచ్చింది.
సరిపోదా శనివారం చిత్రం ఆగస్టు 29వ తేదీన థియేటర్లలో రిలీజ్ అయింది. ఆరంభం నుంచి పాజిటివ్ టాక్‍తో సుమారు రూ.100కోట్ల కలెక్షన్లను ఈ చిత్రం దక్కించుకుంది. నానికి వరుసగా మూడో హిట్ దక్కింది. మూవీ బ్లాక్‍బస్టర్ అయినా.. ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం నెలలోగానే సెప్టెంబర్ 26నే నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలోకి వచ్చేస్తోంది.
సరిపోదా శనివారం చిత్రంలో నానికి జోడీగా ప్రియాంక మోహన్ నటించగా.. ఎస్‍జే సూర్య విలన్‍గా చేశారు. సాయికుమార్, అభిరామి, అదితి బాలన్, మురళీ శర్మ, అజయ్ ఘోష్ కీలకపాత్రల్లో కనిపించారు. డీవీవీ ఎంటర్‌టైన్‍మెంట్ పతాకంపై డీవీవీ దానయ్య ఈ చిత్రాన్ని నిర్మించారు. మురళీ జీ సినిమాటోగ్రఫీ చేసిన ఈ మూవీకి కార్తీక శ్రీనివాస్ ఎడిటింగ్ చేశారు.