Chiranjeevi: మెగాస్టార్‌కు మరో అవార్డు - ఔట్‌స్టాండింగ్ అఛీవ్‌మెంట్ ఇన్ ఇండియన్ సినిమా పురస్కారం అందుకున్న చిరు
Chiranjeevi: చిరంజీవి మరో అరుదైన అవార్డును అందుకున్నారు. శుక్రవారం అబుదాబీలో మొదలైన ఐఫా 2024 వేడుకల్లో చిరంజీవి ఔట్‌స్టాండింగ్ అఛీవ్‌మెంట్ ఇన్ ఇండియన్ సినిమా పురస్కారాన్ని సొంతం చేసుకున్నారు. బాలీవుడ్ దిగ్గజ రచయిత జావేద్ అక్తర్ చేతుల మీదుగా చిరంజీవి ఈ అవార్డును స్వీకరించారు.
Chiranjeevi: ఇటీవలే చిరంజీవి గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకున్నారు. సుదీర్ఘ కెరీర్‌లో 156 సినిమాలు, 537 పాటలు, 24 వేల స్టెప్పులతో అభిమానులను అలరించినందుకు గిన్నిస్ బుక్‌లో ఆయన పేరు లిఖించబడింది. తాజాగా చిరంజీవి మరో అరుదైన పురస్కారాన్ని అందుకున్నాడు. ఔట్‌స్టాండింగ్ అఛీవ్‌మెంట్ ఇన్ ఇండియన్ సినిమా పురస్కారంతో చిరంజీవిని ఐఫా (ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడెమీ అవార్డ్స్) సత్కరించింది.
జావేద్ అక్తర్ చేతుల మీదుగా...
ఐఫా 2024 అవార్డులు అబుదాబీ వేడుకగా శుక్రవారం మొదలయ్యాయి. ఈ వేడుకల్లో ఔట్‌స్టాండింగ్ అఛీవ్‌మెంట్ ఇన్ ఇండియన్ సినిమా అవార్డుకు చిరంజీవి ఎంపికైనట్లు ఐఫా ప్రకటించింది. బాలీవుడ్ దిగ్గజ రచయిత జావేద్ అక్తర్ చేతుల మీదుగా ఈ అవార్డును చిరంజీవి అందుకున్నారు. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్నాయి.
వెంకటేష్, బాలకృష్ణ...
ఐఫా వేడుకల్లో చిరంజీవితో పాటు బాలకృష్ణ, వెంకటేష్ పాల్గొన్నారు. వీరితో పాటు పలువురు బాలీవుడ్, బాలీవుడ్ అగ్ర నటీనటులు ఈ వేడుకలో సందడి చేయనున్నారు.
ఎప్పుడూ పోటీనే...
చిరంజీవికి అవార్డు రావడం ఆనందంగా ఉందని ఐఫా వేడుకల్లో బాలకృష్ణ అన్నాడు. సినిమాల పరంగా చిరంజీవికి తనకు మధ్య ఎప్పుడూ పోటీ ఉంటుందని, అయితే ఈ పోటీ ఆరోగ్యకరంగా సాగుతోందని అన్నాడు. కథలు, పాత్రల విషయంలో ఒకరినుంచి మరొకరం స్ఫూర్తి పొందుతూ సినిమాలు చేస్తున్నామని బాలకృష్ణ తెలిపాడు. చిరంజీవి కంటే తాను నాలుగైదేళ్లు ఇండస్ట్రీలో సీనియర్‌నని, నటుడిగా యాభై ఏళ్ల ప్రయాణం పూర్తిచేసుకోవడం ఆనందంగా ఉందని బాలకృష్ణ తెలిపాడు.
వంద కోట్ల బడ్జెట్...
గత ఏడాది రిలీజైన భోళాశంకర్ తర్వాత సినిమాలకు ఏడాదిపైనే గ్యాప్ ఇచ్చారు చిరంజీవి. ప్రస్తుతం విశ్వంభర మూవీ చేస్తున్నాడు. దాదాపు వంద కోట్ల బడ్జెట్‌తో సోషియో ఫాంటసీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ మూవీకి బింబిసార ఫేమ్ వశిష్ట దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో చిరంజీవికి జోడీగా త్రిష హీరోయిన్‌గా నటిస్తోంది. స్టాలిన్ తర్వాత చిరంజీవి, త్రిష కాంబోలో తెరకెక్కుతోన్న మూవీ ఇది.
మీనాక్షి చౌదరి...
విశ్వంభరలో హీరోయిన్లు ఆషికా రంగనాథ్, మీనాక్షి చౌదరి కీలక పాత్రల్లో కనిపించబోతున్నాడు. వచ్చే ఏడాది సంక్రాంతికి విశ్వంభర రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాకు కీరవాణి మ్యూజిక్ అందిస్తున్నాడు. యూవీ క్రియేషన్స్ సంస్థ ఈ మూవీని ప్రొడ్యూస్ చేస్తోంది. విశ్వంభర తర్వాత సోగ్గాడే చిన్ని నాయనా ఫేమ్ కళ్యాణ్ కృష్ణతో చిరంజీవి ఓ మూవీ చేయబోతున్నాడు.
ఎన్‌బీకే 109
మరోవైపు బాలకృష్ణ ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో ఓ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీ చేస్తున్నాడు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ ప్రొడ్యూస్ చేస్తోన్న ఈ మూవీలో యానిమల్ ఫేమ్, బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ విలన్‌గా కనిపించబోతున్నాడు. ఈ సినిమా కూడా దసరి బరిలో ఉంది. బాలకృష్ణ హీరోగా నటిస్తోన్న 109వ మూవీ ఇది.
టాపిక్