Akhil Akkineni Dheera: టీమిండియా జెర్సీపై అఖిల్ నెక్స్ట్ మూవీ టైటిల్ - వంద కోట్ల బడ్జెట్‌తో పాన్ ఇండియన్పై గురి!
Akhil Akkineni Dheera: అఖిల్ అక్కినేని నెక్స్ట్ మూవీకి ధీర అనే టైటిల్‌ను ఫిక్స్ చేసినట్లు సమాచారం. టీమిండియా జెర్సీతో ఈ సినిమా టైటిల్‌ను డిఫరెంట్‌గా అఖిల్ రివీల్ చేసిన పోస్టర్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోన్నాయి.
Akhil Akkineni Dheera: ఏజెంట్ తర్వాత అఖిల్ అక్కినేని నెక్స్ట్ మూవీపై ఓ క్లారిటీ వచ్చేసింది. ఈ సినిమా టైటిల్ కూడా ఫిక్సయినట్లు సమాచారం. సోషియో ఫాంటసీ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతోన్న ఈ సినిమాకు ధీర అనే టైటిల్ ఫిక్సయినట్లు సమాచారం. ఈ సినిమా టైటిల్‌ను డిఫరెంట్‌గా రివీల్ చేశారు. టీమ్ ఇండియా జెర్సీ ధరించి అఖిల్ ఫొటోల్లో కనిపిస్తున్నాడు.
జెర్సీ వెనుక ధీర అనే అక్షరాలు రాసి ఉన్న పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. త్వరలోనే ఈ టైటిల్‌ను అఫీషియల్‌గా అనౌన్స్ చేయబోతున్నట్లు సమాచారం. ధీర సినిమాను దాదాపు వంద కోట్ల బడ్జెట్‌తో యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మించబోతున్నట్లు తెలిసింది. సాహో సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన అనిల్ కుమార్ ధీర మూవీతో దర్శకుడిగా టాలీవుడ్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలిసింది.
ఈ సినిమాలో అఖిల్ డిఫరెంట్ లుక్‌లో కనిపించబోతున్నట్లు సమాచారం. ప్రస్తుతం ధీర మూవీకి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతోన్నట్లు వార్తలు వినిపిస్తోన్నాయి. వచ్చే ఏడాది మార్చిలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించబోతున్నట్లు సమాచారం.
ఈ సినిమాలో అఖిల్‌కు జోడీగా జాన్వీకపూర్ హీరోయిన్గా నటించే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అఖిల్ గత సినిమా ఏజెంట్ భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా కథలో కొత్తదనం లేకపోవడంతో డిజాస్టర్‌గా మిగిలింది.