Trisha: వామ్మో! విశ్వంభర కోసం త్రిష అన్ని కోట్లు రెమ్యునరేషన్ తీసుకుందా!
Trisha: చిరంజీవి విశ్వంభరతో దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత టాలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇస్తోంది త్రిష. వశిష్ట మల్లిడి దర్శకత్వంలో ఫాంటసీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ మూవీ వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ కాబోతోంది.
(1 / 5)
విశ్వంభర తెలుగులో చిరంజీవి, త్రిష కాంబినేషన్‌లో వస్తోన్న సెకండ్ మూవీ. గతంలో వీరిద్దరి కలయికలో స్టాలిన్ రూపొందింది. విశ్వంభర తో దాదాపు 18 ఏళ్ల లాంగ్ గ్యాప్ తర్వాత చిరంజీవి, త్రిష మళ్లీ స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు.
(2 / 5)
విశ్వంభర సినిమా కోసం త్రిష దాదాపు 12 కోట్ల రెమ్యునరేషన్ స్వీకరించినట్లు ప్రచారం జరుగుతోంది. సౌత్ ఇండియాలో అత్యధిక రెమ్యునరేషన్ అందుకున్న హీరోయిన్‌గా ఈ మూవీతో త్రిష నిలిచినట్లు సమాచారం.
(3 / 5)
గత కొన్నేళ్లుగా పరాజయాల కారణంగా అవకాశాలు రేసులో వెనుకబడ్డ త్రిష...దళపతి విజయ్ లియోతో అదిరిపోయే కమ్‌బ్యాక్ ఇచ్చింది. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద 590 కోట్ల వరకు వసూళ్లను రాబట్టింది.
(4 / 5)
ప్రస్తుతం కమల్‌హాసన్, దిగ్గజ దర్శకుడు మణిరత్నం కాంబోలో రూపొందుతోన్న థగ్ లైఫ్‌లో త్రిష హీరోయిన్‌గా నటిస్తోంది. అజిత్‌తో విదా ముయార్చి సినిమా చేస్తోంది.
ఇతర గ్యాలరీలు