Indian 2: ఇండియన్ 2 ఫైనల్ కలెక్షన్స్ - వంద కోట్ల నష్టం - ఈ ఏడాది బిగ్గెస్ట్ ఫ్లాపుల్లో ఫస్ట్ ప్లేస్
Indian 2 Final Collections: కమల్‌హాసన్, డైరెక్టర్ శంకర్ కాంబోలో వచ్చిన ఇండియన్ 2 మూవీ భారతీయ సినీ చరిత్రలో అత్యధిక నష్టాలను మిగిల్చిన సినిమాల్లో ఒకటిగా నిలిచింది. దాదాపు 172 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో రిలీజైన ఈ యాక్షన్ మూవీ 73 కోట్ల వరకు కలెక్షన్స్ రాబట్టింది
Indian 2: విలక్షణ నటుడు కమల్‌హాసన్, డైరెక్టర్ శంకర్ కాంబోలో వచ్చిన ఇండియన్ 2 బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా నిలిచింది. కమల్‌హాసన్‌తో పాటు శంకర్ కెరీర్‌లోనే అత్యధిక నష్టాలను మిగిల్చిన సినిమాల్లో ఒకటిగా నిలిచింది. 1996లో రిలీజైన కల్ట్ క్లాసిక్ మూవీ ఇండియన్‌కు సీక్వెల్‌గా ఇండియన్ 2 ప్రేక్షకుల ముందుకొచ్చింది.
176 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్...
కమల్‌హాసన్, శంకర్ కాంబోపై ఉన్న క్రేజ్ కారణంగా ఈ సినిమాపై తమిళంతో పాటు తెలుగు, హిందీ భాషల్లో భారీగా హైప్ ఏర్పడింది. అన్ని భాషల్లో కలిపి ఇండియన్ 2 మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ దాదాపు 170 కోట్ల వరకు జరిగింది. దాదాపు 172 కోట్ల వరకు బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో ఇండియన్2 ప్రేక్షకుల ముందుకొచ్చింది. కథలో కొత్తదనం లేకపోవడం, శంకర్ మ్యాజిక్ అంతగా వర్కవుట్ కాకపోవడంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్‌లో సగం కూడా ఇండియన్ 2 వసూళ్లను రాబట్టలేకపోయింది.
వరల్డ్ వైడ్‌గా ఈ మూవీ 73 కోట్ల వరకు షేర్ కలెక్షన్స్ దక్కించుకున్నట్లు ట్రేడ్ వర్గాలు చెబుతోన్నాయి. దాదాపు 100 కోట్ల వరకు నిర్మాతకు కమల్‌హాసన్, శంకర్ మూవీ నష్టాలను తెచ్చిపెట్టినట్లు సమాచారం. భారతీయ సినీ చరిత్రలోనే అత్యధిక నష్టాలను మిగిల్చిన సినిమాల్లో ఒకటిగా ఇండియన్ 2 చెత్త రికార్డును మూట గట్టుకుంది.
తెలుగులో నష్టాలు ఎంతంటే?
తెలుగులో భారతీయుడు 2 మూవీ 25 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో రిలీజైంది. ఫుల్ థియేట్రికల్ రన్‌లో పదమూడు కోట్ల కలెక్షన్స్ దక్కించుకున్నది. 12 కోట్ల వరకు నష్టాలను మూటగట్టుకుంది. తెలుగులో రీసెంట్ టైమ్‌లో నిర్మాతలకు అత్యధిక నష్టాలను తెచ్చిపెట్టిన డబ్బింగ్ మూవీగా భారతీయుడు 2 మూవీ నిలిచింది.
లుక్‌పై ట్రోల్స్...
ఇండియన్ 2 మూవీలో కమల్‌హాసన్‌తో పాటు సిద్ధార్థ్, రకుల్ ప్రీత్‌సింగ్, ప్రియా భవానీ శంకర్ కీలక పాత్రల్లో నటించారు. అనిరుధ్ ఈ సీక్వెల్‌కు మ్యూజిక్ అందించాడు. ఈ సినిమాలో సేనాపతిగా కమల్‌హాసన్ లుక్‌పై దారుణంగా ట్రోల్స్ వచ్చాయి. కమల్‌హాసన్ కంటే సిద్ధార్థ్ పాత్రకు ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇవ్వడం, రొటీన్ స్టోరీతో శంకర్ ఈ సినిమాను తెరకెక్కించడంపై ఫ్యాన్స్ విమర్శలు గుప్పించారు.
ఇండియన్ 2 కథ ఇదే...
దేశంలో అవినీతి, అక్రమాలు పెరిగిపోవడంతో సేనాపతి మళ్లీ రావాలని చిత్ర అరవింద్ (సిద్ధార్థ్) అనే యూట్యూబర్ పిలుపునిస్తాడు. తన ఛానెల్ ద్వారా అవినీతి, లంచగొండి ఆఫీసర్ల అక్రమాలను రెడ్ హ్యాండెడ్‌గా బయటపెడుతుంటాడు. చిత్ర అరవింద్ ఉద్యమం కారణంగా చైనీస్ తైపే నుంచి ఇండియాకు వచ్చిన సేనాపతి (కమల్‌హాసన్) అవినీతిపరుల భరతం పడతాడు.
సేనాపతిని పట్టుకునేందుకు సీబీఐ ఆఫీసర్ ప్రమోద్ (బాబీ సింహా) ప్రయత్నిస్తుంటాడు. సేనాపతి ఇండియాకు రావాలని పిలుపు నిచ్చిన అరవింద్ తో పాటు చాలా మంది యువత అతడిని ఎందుకు ద్వేషించారు? గో బ్యాక్ సేనాపతి అని పిలుపునివ్వడానికి కారణమేమిటి? తండ్రి గురించి అరవింద్ తెలుసుకున్న నిజమేమిటి? సేనాపతి పోలీసులకు దొరికాడా? లేదా? అన్నదే ఇండియన్ 2 మూవీ కథ.
ఇండియన్ 3 రిలీజ్ ఎప్పుడంటే?
ఇండియన్ 2కు కొనసాగింపుగా ఇండియన్ 3 కూడా రాబోతోంది. ఇండియన్ 3లో కమల్‌హాసన్‌తో పాటు కాజల్ అగర్వాల్ కీలక పాత్రలో నటిస్తోంది. వచ్చే ఏడాది ఆరంభంలో ఇండియన్ 3 రిలీజ్ కానున్నట్లు సమాచారం.