OTT Hollywood Action Movie: రెంట్ లేకుండా ఓటీటీలోకి రానున్న హాలీవుడ్ పాపులర్ యాక్షన్ చిత్రం.. స్ట్రీమింగ్ డేట్ ఇదే!
Furiosa: A Mad Max Saga OTT: ‘ఫ్యూరియోసా: ఎ మ్యాడ్ మ్యాక్స్ సాగా’ చిత్రం ఇండియాలో ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అవుతోంది. ఇప్పటికే ఓ ప్లాట్‍ఫామ్ రెంట్ విధానంలో ఉంది. ఇప్పుడు పూర్తిస్థాయిలో రెంట్ లేకుండా మరో ఓటీటీలోకి ఈ యాక్షన్ మూవీ అడుగుపెడుతోంది.
హాలీవుడ్ మూవీ ఫ్రాంచైజీ ‘మ్యాడ్‍మాక్స్’కు ఫుల్ క్రేజ్ ఉంటుంది. ఈ లైనప్ చిత్రాలకు ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్ ఉంటారు. ఈ ఫ్రాంచైజీలో ఈ ఏడాది మేలో ‘ఫ్యూరియోసా: ఎ మ్యాడ్ మ్యాక్స్ సాగా’ చిత్రం వచ్చింది. ఈ యాక్షన్ మూవీలో అన్య టేలర్ జాక్, థార్‌గా పాపులర్ అయిన క్రిస్ హెమ్స్‌వర్త్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ మూవీ రెంట్ లేకుండా ఇండియాలో స్ట్రీమింగ్‍కు రానుంది. డేట్ కూడా ఖరారైంది.
స్ట్రీమింగ్ డేట్ ఇదే
‘ఫ్యూరియోసా: ఎ మ్యాడ్ మ్యాక్స్ సాగా’ మూవీ అక్టోబర్ 23వ తేదీన జియోసినిమా ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు రానుంది. ఈ విషయంపై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. అక్టోబర్ 23న ఈ చిత్రం స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టడం దాదాపు ఖాయంగా ఉంది.
ఫ్యూరియోసా చిత్రం తెలుగు డబ్బింగ్‍లోనూ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. డ్యూన్ 2, ది ఫాల్ గాయ్ సహా ఇటీవల చాలా చిత్రాలను ఇంగ్లిష్‍తో పాటు తెలుగు, హిందీ సహా మరిన్ని భారతీయ భాషల డబ్బింగ్‍లో జియోసినిమా ఓటీటీ తీసుకొస్తోంది. దీంతో ఫ్యూరియోసా: ఎ మ్యాడ్ మ్యాక్స్ సాగా మూవీ కూడా తెలుగు వెర్షన్‍లో రానుందని అంచనా.
రెంట్ లేకుండా..
ఫ్యూరియోసా: ఎ మ్యాడ్ మ్యాక్స్ సాగా చిత్రం మూడు నెలల కిందటే అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్‍కు అందుబాటులోకి వచ్చింది. అయితే, రెంటల్ విధానంలోనే అందుబాటులో ఉంది. దీంతో ప్రైమ్ వీడియో సబ్‍స్క్రైబర్లు కూడా ఈ చిత్రాన్ని రెంట్‍లోనే చూడాల్సి ఉంది. అయితే, జియో సినిమా ఓటీటీలోకి ఎలాంటి రెంట్ లేకుండా పూర్తిస్థాయిలో ఈ ఫ్యూరియోసా చిత్రం అక్టోబర్ 23న అందుబాటులోకి రానుంది.
మ్యాడ్ మ్యాక్స్ ఫ్రాంచైజీలో ఐదో మూవీగా ఫ్యూరియోసా: ఎ మ్యాడ్ మ్యాక్స్ వచ్చింది. ఈ ఏడాది మే 24వ తేదీన థియేటర్లలో రిలీజ్ అయింది. ఈ మూవీకి జార్జ్ మిల్లర్ దర్శకత్వం వహించారు. యాక్షన్ ప్యాక్డ్ చిత్రంగా వచ్చింది. అయితే, ఫుల్ హైప్ మధ్య వచ్చిన ఈ చిత్రానికి మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది. ప్యురియోసా కిడ్నాప్ అవడం, ఆ తర్వాత మ్యాడ్ మ్యాక్స్ టీమ్‍తో కలవడం చుట్టూ ఈ మూవీ స్టోరీ సాగుతుంది.
ఫ్యూరియోసా: ఎ మ్యాడ్ మ్యాక్స్ చిత్రంలో అన్య టేలర్, క్రిస్ హెమ్స్‌వర్త్ సహా టామ్ బుర్కే, లాచీ హల్మే. జార్జ్ షెవ్‍సోవ్, జాన్ హావర్డ్, అంగస్ సాంప్సన్, నాథన్ జోన్స్ కీలకపాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని కెనెడీ మిల్లర్ మిచెల్, డొమైన్ ఎంటర్‌టైన్‍మెంట్ బ్యానర్లపై డాజ్ మిచెల్, జార్జ్ మిల్లర్ ప్రొడ్యూజ్ చేశారు. టామ్ హాకెన్‍బొర్గ్ సంగీతం అందించిన ఈ మూవీకి సైమన్ డుగ్గాన్ సినిమాటోగ్రఫీ చేశారు.
ఫ్యూరియోసా: ఎ మ్యాడ్ మ్యాక్స్ చిత్రానికి బాక్సాఫీస్ వద్ద కాస్త నిరాశే ఎదురైంది. భారీ అంచనాలతో వచ్చిన ఈ మూవీ ఆస్థాయిలో కలెక్షన్లు దక్కించుకోలేకపోయింది. 168 మిలియన్ డాలర్ల బడ్జెట్‍తో రూపొందిన ఈ మూవీ.. ప్రపంచవ్యాప్తంగా 172.8 మిలియన్ డాలర్లను దక్కించుకుంది. పర్వాలేదనిపించుకుంది.