Mirabai Chanu: మీరాబాయి చానుపై ప్రశంసలు కురిపించిన 'థోర్' క్రిస్ హెమ్స్‌వర్త్
Mirabai Chanu: ఈసారి కామన్వెల్త్ గేమ్స్‌లో ఇండియాకు తొలి గోల్డ్ మెడల్ అందించిన వెయిట్‌లిఫ్టర్ మీరాబాయి చానుపై ప్రశంసలు కురిపించాడు థోర్ క్రిస్ హెమ్స్‌వర్త్. ట్విటర్‌లో ఓ అభిమాని అతన్ని ట్యాగ్ చేయగా.. హెమ్స్‌వర్త్ స్పందించడం విశేషం.
బర్మింగ్‌హామ్: టోక్యో ఒలింపిక్స్‌లో సిల్వర్ మెడల్‌తో దేశాన్ని ఆశ్చర్యానికి గురి చేసింది వెయిట్‌లిఫ్టర్ మీరాబాయి చాను. ఈ సంచలన విజయంతో ఆమె దేశవ్యాప్తంగా హీరో అయిపోయింది. కామన్వెల్త్ గేమ్స్‌లోనూ మీరాబాయిపైనే భారీ అంచనాలు ఉన్నాయి. అందుకు తగినట్లే ఆ అంచనాల భారాన్ని విజయవంతంగా మోస్తూ ఇండియాకు తొలి గోల్డ్ మెడల్ అందించింది.
కామన్వెల్త్ గేమ్స్ రికార్డును బ్రేక్ చేస్తూ మొత్తంగా స్నాచ్, క్లీన్ అండ్ జెర్క్ కలిపి 201 కేజీలు ఎత్తిన ఆమె.. వరుసగా రెండో గోల్డ్ సాధించింది. చాను 2014లో సిల్వర్, 2018లో గోల్డ్ గెలిచింది. ఈ తాజా విజయం తర్వాత మీరాబాయిపై ప్రశంసల వర్షం కురిపించింది ట్విటర్. అందులో ఓ అభిమాని పాపులర్ మార్వెల్ క్యారెక్టర్ థోర్‌ను ట్యాగ్ చేశాడు.
ఈ క్యారెక్టర్ పోషించే క్రిస్ హెమ్స్‌వర్త్‌ను ఆ అభిమాని ట్యాగ్ చేయగా.. దీనికి అతడు కూడా స్పందించడం విశేషం. థోర్ ఇక తన సుత్తిని వదిలేయాల్సిన సమయం వచ్చింది అంటూ మీరాబాయి ట్వీట్‌కు కామెంట్ చేస్తూ హెమ్స్‌వర్త్‌ను ట్యాగ్ చేశాడు. దీనికి అతడు స్పందిస్తూ.. మీరాబాయిపై ప్రశంసలు కురిపించాడు. ఆమె దీనికి పూర్తి అర్హురాలని అన్నాడు.
"అందుకు ఆమె అర్హురాలే. కంగ్రాట్స్, సైకోమ్, నువ్వో లెజెండ్" అని హెమ్స్‌వర్త్ కామెంట్ చేయడం విశేషం. థోర్ క్యారెక్టర్‌తో ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయిన హెమ్స్‌వర్త్ ఇలా మీరాబాయిని పొగడటం అభిమానులకు తెగ నచ్చేసింది. అటు పాకిస్థాన్ వెయిట్‌లిఫ్టర్ నూహ్ దస్తగిర్ భట్ కూడా తనకు మీరాబాయి చానుయే స్ఫూర్తి అని చెప్పిన విషయం తెలిసిందే.