తెలుగు న్యూస్ / ఫోటో /
Gukesh Net worth: 18 ఏళ్లకే వరల్డ్ చెస్ ఛాంపియన్.. గుకేష్ సంపద విలువ ఎంతో తెలుసా? ప్రైజ్‌మనీయే రూ.11 కోట్లు
- Gukesh Net worth: అత్యంత పిన్న వయసులో వరల్డ్ చెస్ ఛాంపియన్ గా నిలిచిన గుకేష్ దొమ్మరాజు ప్రైజ్ మనీ రూపంలోనే రూ.11 కోట్లు అందుకున్నాడు. మరి 18 ఏళ్ల వయసులోనే అతడు సంపాదించిన మొత్తం ఎంతో తెలుసా?
- Gukesh Net worth: అత్యంత పిన్న వయసులో వరల్డ్ చెస్ ఛాంపియన్ గా నిలిచిన గుకేష్ దొమ్మరాజు ప్రైజ్ మనీ రూపంలోనే రూ.11 కోట్లు అందుకున్నాడు. మరి 18 ఏళ్ల వయసులోనే అతడు సంపాదించిన మొత్తం ఎంతో తెలుసా?
(1 / 5)
Gukesh Net worth: చెన్నైకి చెందిన గుకేష్ దొమ్మరాజు చైనాకు చెందిన డింగ్ లిరెన్ ను ఓడించి ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్ టైటిల్ ను గెలుచుకున్నాడు. విశ్వనాథన్ ఆనంద్ తర్వాత ఈ ఘనత సాధించిన రెండో భారతీయుడు కాగా.. అత్యంత పిన్న వయసులోనే వరల్డ్ ఛాంపియన్ గా నిలిచాడు.(D Gukesh Instagram)
(2 / 5)
Gukesh Net worth: గుకేష్ కంటే ముందు రష్యాకు చెందిన గ్యారీ కాస్పరోవ్ 1985లో 22 ఏళ్ల వయసులో ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్ ను గెలుచుకున్నాడు. ఇప్పుడు గుకేష్ 18 ఏళ్ల వయసులో చైనాకు చెందిన డింగ్ లిరెన్ ను 7.5-6.5 తేడాతో ఓడించి ఈ రికార్డును సొంతం చేసుకున్నాడు.
(3 / 5)
Gukesh Net worth: విశ్వనాథన్ ఆనంద్ గతంలో భారత్ తరఫున ఐదుసార్లు ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్ ను గెలుచుకున్నాడు. గుకేష్ 17 ఏళ్ల వయసులో ఫిడే క్యాండిడేట్స్ చెస్ ఛాంపియన్ షిప్ సాధించాడు.
(4 / 5)
Gukesh Net worth: ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్ గెలిచిన డి.గుకేష్ కు రూ.11 కోట్ల బహుమతి లభించింది. అయితే ఇప్పటి వరకూ గుకేష్ సంపద విలువ రూ.8 కోట్లు కాగా.. తాజా ప్రైజ్ మనీతో ఆ విలువ భారీగా పెరగనుంది.
ఇతర గ్యాలరీలు