Bigg Boss Elimination: ఈరోజు ఇద్దరు ఎలిమినేట్.. వారిలో ఒకరికి రెండు ఆఫర్స్.. తన ముద్దుబిడ్డను కాపాడుకోనున్న బిగ్ బాస్-bigg boss telugu 8 this week elimination aditya om sonia akula into secret room bigg boss 8 telugu elimination updates ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Bigg Boss Elimination: ఈరోజు ఇద్దరు ఎలిమినేట్.. వారిలో ఒకరికి రెండు ఆఫర్స్.. తన ముద్దుబిడ్డను కాపాడుకోనున్న బిగ్ బాస్

Bigg Boss Elimination: ఈరోజు ఇద్దరు ఎలిమినేట్.. వారిలో ఒకరికి రెండు ఆఫర్స్.. తన ముద్దుబిడ్డను కాపాడుకోనున్న బిగ్ బాస్

Sanjiv Kumar HT Telugu
Sep 28, 2024 02:15 PM IST

Bigg Boss Telugu 8 Elimination Fourth Week: బిగ్ బాస్ తెలుగు 8 ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉంటుందనే వార్తలు చాలా గట్టిగా వినిపించాయి. ఈ నేపథ్యంలో బిగ్ బాస్ 8 తెలుగు హౌజ్‌ నుంచి ఇవాళ (సెప్టెంబర్ 28) ఇద్దరిని ఎలిమినేట్ చేసే అవకాశం ఉంది. వారిలో తన ముద్దుబిడ్డను కాపాడేందుకు బిగ్ బాస్ 2 ఆఫర్స్ ఇస్తాడని టాక్.

ఈరోజు ఇద్దరు ఎలిమినేట్.. వారిలో ఒకరికి రెండు ఆఫర్స్.. తన ముద్దుబిడ్డను కాపాడుకోనున్న బిగ్ బాస్
ఈరోజు ఇద్దరు ఎలిమినేట్.. వారిలో ఒకరికి రెండు ఆఫర్స్.. తన ముద్దుబిడ్డను కాపాడుకోనున్న బిగ్ బాస్

Bigg Boss 8 Telugu Elimination This Week: బిగ్ బాస్ తెలుగు 8 సీజన్ బాగానే సాగుతోంది. అయితే, ప్రతి సీజన్‌లో బిగ్ బాస్‌కు ఓ ముద్దుబిడ్డ ఉంటారు. వారిని కాపాడుకునేందుకు ఇతరులను బలి చేస్తూ ఎలిమినేట్ చేయడం, లేదా వారికి స్పెషల్ ఆఫర్స్ ఇవ్వడం లాంటివి చేస్తాడు బిగ్ బాస్. ఈ సీజన్‌లో అది కూడా ఈ వారం అలాంటిదే జరగనుందని టాక్ వినిపిస్తోంది.

నామినేషన్స్‌లో ఆరుగురు

బిగ్ బాస్ 8 తెలుగులోకి 14 మంది కంటెస్టెంట్స్ ఎంట్రీ ఇస్తే ముగ్గురు ఎలిమినేట్ అయిపోయి ప్రస్తుతం 11 మంది మిగిలారు. వీరికి నాలుగో వారం నామినేషన్స్ నిర్వహించారు. బిగ్ బాస్ తెలుగు 8 నాలుగో వారం ఆరుగురు నామినేట్ అయ్యారు. 4వ వారం నామినేషన్స్‌లో నాగ మణికంఠ, ప్రేరణ, నబీల్, సోనియా, ఆదిత్య ఓం, పృథ్వీ ఉన్నారు.

అధికారిక ఓటింగ్‌లో

వీరికి తొలి రోజు నుంచి ఓటింగ్ నమోదు కాగా నబీల్ వారందరిలో టాప్‌లో ఉన్నాడు. చివరి స్థానాల్లో ఆదిత్య, పృథ్వీ, సోనియా నిలిచారు. అయితే, అధికారిక ఓటింగ్‌లో ప్రేరణ మొదటి స్థానంలో, రెండో స్థానంలో నబీల్ ఉంటే.. ఆరో స్థానంలో సోనియా, ఏడో స్థానంలో ఆదిత్య, 8వ స్థానంలో పృథ్వీ నిలిచినట్లు సమాచారం.

డబుల్ ఎలిమినేషన్

అయితే, వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ఉన్న నేపథ్యంలో హౌజ్ నుంచి ఎక్కువ మందిని ఎలిమినేట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు బీబీ టీమ్. ఈ క్రమంలోనే ఇవాళ డబుల్ ఎలిమినేషన్ ఉండనుందని సమాచారం. దీంతో చివరిలో ఉన్న సోనియా, ఆదిత్యను ఎలిమినేట్ చేయనున్నారని టాక్ నడుస్తోంది. వీరిలో ఎక్కువగా బిగ్ బాస్ ముద్దుబిడ్డ అయిన సోనియాను ఎలిమినేట్ చేయాలని ఆడియెన్స్ కోరుకుంటున్నారు.

సీక్రెట్ రూమ్‌లోకి

అందుకని, ప్రజల నుంచి వ్యతిరేకత తట్టుకోకుండా, తన ముద్దుబిడ్డను సేవ్ చేసేందుకు బిగ్ బాస్ రెండు రకాలుగా ప్రయత్నాలు చేసే అవకాశం ఉందని రివ్యూవర్స్ అంచనా వేస్తున్నారు. సోనియాను ఎలిమినేట్ చేసినట్లే చేసి సీక్రెట్ రూమ్‌కి పంపిస్తారని టాక్ నడుస్తోంది. అందుకోసమే దుమ్ముపట్టిన సీక్రెట్ రూమ్‌ను క్లీన్ చేస్తున్నారని బిగ్ బాస్ వర్గాల నుంచి వచ్చిన సమాచారం.

వైల్డ్ కార్డ్ ఎంట్రీ

సీక్రెట్ రూమ్ కాకుండా ఎలిమినేట్ చేసి గత సీజన్ 7లో రతికను వైల్డ్ కార్డ్ ద్వారా తిరిగి తీసుకొచ్చినట్లుగా సోనియా రీ ఎంట్రీని ప్లాన్ చేసే అవకాశం ఉందని అంటున్నారు. ఎటు చూసిన సోనియాకు రెండు ఆఫర్స్ ఉండగా.. మంచి ఓటింగ్ సంపాదించుకున్న ఆదిత్య ఓం మాత్రం ఇవాళ (సెప్టెంబర్ 28) ఎలిమినేట్ కానున్నాడని తెలుస్తోంది.

షూటింగ్ ప్రారంభం

బిగ్ బాస్ ఎలిమినేషన్ కంటెస్టెంట్‌ను ఆదివారం ప్రకటించినప్పటికీ దానికి సంబందించిన షూటింగ్ ఒకరోజు ముందే చేస్తారని తెలిసిందే. ఈ లెక్కన ఇవాళే డబుల్ ఎలిమినేషన్ చిత్రీకరణ ఉండనుంది. ఈపాటికే వీకెండ్ షూటింగ్ మొదలైందని సమాచారం. మరి ఇలాగే జరుగుతుందా.. లేకా బిగ్ బాస్ ఇంకా ఏమైనా ట్విస్టులు ఇస్తాడా అనేది వేచి చూడాల్సిందే.