Bigg Boss 12 Wild Cards: బిగ్ బాస్ ఇంట్లో భూకంపం.. కొత్తగా 12 మంది సెలబ్రిటీల ఎంట్రీ.. వారిని ఆపే పవర్ కూడా! (వీడియో)
Bigg Boss Telugu 8 12 Celebrities Entry With Wild Card: బిగ్ బాస్ తెలుగు 8 నేటి ఎపిసోడ్ ప్రోమోలో హౌజ్‌లో భూకంపం రానున్నట్లు, దాంతో హౌజ్ నుంచి బయటకు వెళ్లే అవకాశం ఉన్నట్లుగా బిగ్ బాస్ చెప్పాడు. అలాగే, బిగ్ బాస్ హౌజ్‌లోకి ఎన్నడూ లేని విధంగా ఏకంగా 12 వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఉండనున్నట్లు చెప్పారు.
Bigg Boss Telugu 8 Today Episode Promo: బిగ్ బాస్ తెలుగు 8 సెప్టెంబర్ 25వ తేది ఎపిసోడ్‌లో కొత్తగా చీఫ్ అయిన సీత క్లాన్‌లోకి హౌజ్‌మేట్స్ అంతా వెళ్లడంపై డిస్కషన్ జరిగింది. నిఖిల్ క్లాన్ అయన శక్తిలోకి తన గ్రూప్ పృథ్వీ, సోనియా తప్పితే ఎవరు వెళ్లాలనుకోలేదు. దీనిపై హౌజ్‌మేట్స్ మాట్లాడుకోవడంతో బిగ్ బాస్ 8 తెలుగు నేటి ఎపిసోడ్ ప్రోమో 2లో చూపించారు.
ఇప్పటికైనా తెల్వాలి
నిఖిల్ క్లాన్‌లోకి వాళ్లిద్దరు (పృథ్వీ, సోనియా) తప్పా ఎవరు వెళ్లలేదని నబీల్‌తో సీత అంది. "తప్పులు, ఒప్పులు, పర్సనాలిటీలు మాట్లాడుతరు" అని నబీల్ అన్నాడు. "ఇప్పటికైనా నిఖిల్‌కు అర్థం కావాలి" అని సీత అంటే.. "అర్థం కావాలే కదా. తెల్వాలి" అని నబీల్ అన్నాడు. "ఏం అండర్‌స్టాండింగ్ ఏమో.. నేనైతో అందరితోపోయి గొడవ అయ్యాక పోయి మాట్లాడుతున్నా. అది నువ్వు తీసుకోకపోతే నేనేం చేయలేను" అని ఆదిత్యతో సోనియా చెప్పుకుంది.
"వీరిద్దరి సోనియానే బాగా కన్సిడర్ చేస్తారు అనేది నామీద కోపం వాళ్లకి" అని పృథ్వీతో సోనియా చెప్పింది. "బాండ్స్, ఫ్రెండ్స్‌కు సపోర్ట్ చేయడం గురించి వాళ్లే మాట్లాడుతున్నార్రా.. మరి రెడ్ ఎగ్ ఎందుకిచ్చాడురా సోనియాకి" అని యష్మీతోపాటు తన క్లాన్‌తో సీత అడిగింది. తర్వాత బిగ్ బాస్ అనౌన్స్ చేయడంతో అంతా వచ్చి హాల్లో కూర్చున్నారు.
ఏకంగా 12 వైల్డ్ కార్డ్ ఎంట్రీస్
"బిగ్ బాస్ ఇంట్లో ఒక పెద్ద భూకంపం రాబోతుంది. మీ మనుగడను సవాలు చేస్తూ మిమ్మల్ని ఇంట్లో నుంచి బయటకు తీసుకెళ్లవచ్చు. బిగ్ బాస్ చరిత్రలో ఒకటి కాదు.. రెండూ కాదు.. ఐదు కూడా కాదు.. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్. మరొక రెండు వారాల్లో రాబోతున్నారు" అని బిగ్ బాస్ చెప్పాడు. దాంతో హౌజ్‌లో ఉన్న కంటెస్టెంట్స్ ఆశ్చర్యంతో అరిచారు.
"12 మెంబర్స్" అని యష్మీ ఎగ్జైటెడ్‌గా చెప్పింది. "మొదటిసారిగా బిగ్ బాస్ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ రాకుండా ఆపే పవర్ మీకు ఇస్తున్నాడు. సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్ ఛాలెంజెస్ గెలవడం. ప్రతి ఛాలెంజ్ గెలిచినప్పుడల్లా మీరు ఒక వైల్డ్ కార్డ్ ఎంట్రీని ఆపొచ్చు" అని బిగ్ బాస్ అనౌన్స్‌మెంట్ ఇచ్చాడు. దాంతో కంటెస్టెంట్స్ అంతా ఆలోచనలో పడిపోయారు.
12 టాస్కులు
"నెక్ట్స్ మూడు నాలుగు రోజుల్లో 12 టాస్కులు" అని ఆదిత్య ఓం అంటే.. "టాస్క్ ఫెయిల్ అయిన వెంటనే ఒకరు లోపలికి ఎంట్రీ ఇస్తారు అంతేనా" అని నాగ మణికంఠ అన్నాడు. "తెలియదు" అని ఆదిత్య ఓం బదులిచ్చాడు. ఇలా బిగ్ బాస్ చరిత్రలోనే ఏకంగా 12 మంది కొత్త సెలబ్రిటీలను వైల్డ్ కార్డ్ ద్వారా ప్రవేశపెట్టడం మొదటిసారి.
అయితే, ఈ 12 మందిలో ప్రస్తుతం ఉన్న హౌజ్‌మేట్స్ ఎంతమందిని ఆపుతారో మరోకొన్ని రోజుల్లో తెలియనుంది. వైల్డ్ కార్డ్ ద్వారా వచ్చే సెలబ్రిటీలు అక్టోబర్ 5న జరిగే బిగ్ బాస్ తెలుగు 8 గ్రాండ్ ఫినాలే 2.0తో అడుగుపెట్టనున్నారు. వైల్డ్ కార్డ్ ద్వారా జబర్దస్త్ అవినాష్, హరితేజ, నయని పావని, జబర్దస్త్ రోహిణి 100 శాతం కన్ఫర్మ్ అయినట్లు సమాచారం.