Bigg Boss Yashmi: బిగ్ బాస్ హౌజ్‌లో మగాళ్లపై టాపిక్.. అతను లెక్కలోకి రాడన్న యష్మీ.. పాపం!
Bigg Boss Telugu 8 Yashmi About Naga Manikanta: బిగ్ బాస్ తెలుగు 8 లోకి త్వరలో వైల్డ్ కార్డ్ ద్వారా 12 మంది వస్తారని బిగ్ బాస్ అనౌన్స్‌మెంట్ ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో వైల్డ్ కార్డ్ గురించి హౌజ్‌మేట్స్ డిస్కషన్ పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో నాగ మణికంఠ మగాళ్ల లెక్కలోకి రాడు అని కామెంట్ చేసింది.
Bigg Boss 8 Telugu September 25 Episode Highlights: బిగ్ బాస్ తెలుగు 8 సెప్టెంబర్ 25వ తేది ఎపిసోడ్‌లో పెద్ద ట్విస్ట్ ఇచ్చాడు బిగ్ బాస్. హౌజ్‌లోకి రెండు మూడు వారాల తర్వాత 12 వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఉంటాయని అనౌన్స్‌మెంట్ చేశాడు బిగ్ బాస్. ఇలా బిగ్ బాస్ చరిత్రలో మొదటిసారి అని కూడా చెప్పాడు.
ప్రైజ్ మనీలో లక్ష యాడ్
బిగ్ బాస్ ప్రకటనతో హౌజ్‌లో ఉన్న 11 మంది కంటెస్టెంట్స్ అంతా ఒక్కసారిగా ఆశ్చర్యంతో నోరెళ్లబెట్టేసారు. ఆ తర్వాత ఆ 12 వైల్డ్ కార్డ్ ఎంట్రీలను ఆపే పవర్ కూడా కంటెస్టెంట్స్‌కు బిగ్ బాస్ ఇచ్చాడు. ఫిట్టెస్ట్ ఆఫ్ ది సర్వైవల్ ఛాలెంజ్‌లో భాగంగా పెట్టే టాస్క్‌ల్లో గెలిచిన ప్రతిసారి ఒక వైల్డ్ కార్డ్ ఎంట్రీ తొలిగిపోతుందని, అలాగే విజేత ప్రైజ్ మనీలో రూ. లక్ష చేరుతుందని బిగ్ బాస్ ప్రకటించాడు.
దాంతో హౌజ్‌మేట్స్ అంతా కూడి వైల్డ్ కార్డ్ ఎంట్రీలపై డిస్కషన్ పెట్టుకున్నారు. అందరూ ఒక చోట ఉంటే నాగ మణికంఠ ఒక్కడు మరోవైపు ఒంటరిగా కూర్చున్నాడు. బిగ్ బాస్ అనౌన్స్‌మెంట్ వచ్చినప్పటి నుంచి భయపడుతూ వైల్డ్ కార్డ్ ఎంట్రీ గురించి తీవ్రంగా ఆలోచిస్తూ కనిపించాడు.
నలుగురే అబ్బాయిలు
అయితే, హౌజ్‌మేట్స్ అంతా కలిసి చర్చిస్తుండగా మగాళ్ల టాపిక్ వచ్చింది. "కావాలని ఓడిపోయి ఎవరికీ సంబంధం లేని మనిషి వస్తే" అని ప్రేరణ అంది. "ఐదుగురు గర్ల్స్ అబ్బాయిలం నలుగురం ఉన్నాం" అని కిర్రాక్ సీత అంది. హే.. గర్ల్సే ఎక్కువ ఉన్నామా అని అంతా చప్పట్లు కొట్టారు. "ఏంటీ బాయ్స్ నలుగురేనా.. ఏయ్ మణికంఠ కూడా ఉన్నాడుగా" అని పృథ్వీరాజ్ అన్నాడు.
దాంతో "వాడు లెక్కలో లేడు" అని యష్మీ సరదాగా అంది. అలా అని నాలుక కరుచుకుంది. దాంతో "రేయ్.. నిన్ను అబ్బాయిల దాంట్లో పెట్టట్లేదు" అని మణికంఠకు అరిచి చెప్పాడు నిఖిల్. "కీప్ యువర్ బౌండ్రీస్" అని నాగ మణికంఠ సీరియస్ అయ్యాడు. "అరేయ్ నేను అనలేదురా" అని నిఖిల్ చెప్పిన తర్వాత "రారా ఇటు లేచి.. ఇప్పుడు వీడు నన్నే నామినేట్ చేస్తాడు" అని నబీల్‌తో అన్నాడు.
బాగా కవర్ చేసుకున్నావా?
నామినేషన్‌లో పడాలి అని నిఖిల్ అంటే.. "హుమ్ అప్పుడు ఆటలో మజా వస్తది" అని నబీల్ అన్నాడు. తర్వాత జరిగిన దాన్ని ఎక్స్‌ప్లేన్ చేసేందుకు మణికంఠ దగ్గరికి విష్ణుప్రియ వెళ్లింది. "అలా నేను అనలేదు. అబ్బాయిలు ఎంతమంది అని టాపిక్ వచ్చింది. అప్పుడు ఇలా" అని విష్ణుప్రియ అంటే.. మరి ఎవరు అన్నారు అని మణికంఠ అడిగాడు.
ఇంతలో నిఖిల్ దూరి బాగా కవర్ చేసుకున్నావా అని అన్నాడు. ఎవరు, ఎవరిని అన్న అది కరెక్ట్ కాదు. ఇలా హద్దులు దాటి మాట్లాడటం మంచిది కాదు అని మరింత సీరియస్ అయ్యాడు నాగ మణికంఠ. అయితే, దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దాంతో యష్మీపై నెగెటివిటీగా, మణికంఠ పాపం అంటూ కామెంట్స్ చేస్తున్నారు.