Bigg Boss 6 Telugu 67th Episode: రేవంత్‌కు ఆదిరెడ్డి వార్నింగ్ - కెప్టెన్సీ రేసులో ఆరుగురు హౌజ్‌మేట్స్‌-bigg boss 6 telugu 67th episode adi reddy warning to revanth and six contestants in captaincy race ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Bigg Boss 6 Telugu 67th Episode: రేవంత్‌కు ఆదిరెడ్డి వార్నింగ్ - కెప్టెన్సీ రేసులో ఆరుగురు హౌజ్‌మేట్స్‌

Bigg Boss 6 Telugu 67th Episode: రేవంత్‌కు ఆదిరెడ్డి వార్నింగ్ - కెప్టెన్సీ రేసులో ఆరుగురు హౌజ్‌మేట్స్‌

Nelki Naresh Kumar HT Telugu
Nov 10, 2022 08:10 AM IST

Bigg Boss 6 Telugu 67th Episode: ఈ వారం కెప్టెన్సీ రేసులో శ్రీహాన్‌, ఫైమా, ఆదిరెడ్డి, రోహిత్‌, మ‌రీనా నిలిచారు. కెప్టెన్సీ టాస్క్‌లో రేవంత్ ఫిజిక‌ల్ కావ‌డంతో ఆదిరెడ్డి, కీర్తి, ఫైమా అత‌డికి వార్నింగ్ ఇచ్చారు. హౌజ్‌లో త‌న‌ను అర్థం చేసుకునే వారు లేరంటూ ఇనాయా ఎమోష‌న‌ల్ అయ్యింది.

ఆదిరెడ్డి
ఆదిరెడ్డి

Bigg Boss 6 Telugu 67th Episode: బిగ్‌బాస్ 67వ ఎపిసోడ్ కంటెస్టెంట్స్ గొడ‌వ‌ల‌తో సాగింది. కెప్టెన్సీ రేసు కోసం బిగ్‌బాస్ ఇచ్చిన టాస్క్‌లో రేవంత్ ప‌దే ప‌దే ఫిజిక‌ల్ అవ‌డం ప‌ట్ల అంద‌రూ అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు. అంతుకుముందు లైఫ్‌లో త‌న‌కు ఏది ఇష్ట‌మో అది ఎప్పుడూ దొర‌క‌ద‌ని ఇనాయా ఏడుస్తూ క‌నిపించింది. తాను ఏం కోరుకుంటే లైఫ్‌లో నుంచి అదే వెళ్లిపోతుంద‌ని ఎమోష‌న‌ల్ అయ్యింది. కెప్టెన్ అయిదామ‌ని ఆశ‌ప‌డితే క‌నీసం కంటెండ‌ర్ కూడా కాలేక‌పోయాన‌ని ఒంట‌రిగా కూర్చొని బాధ‌ప‌డింది. బాధ‌వ‌స్తే చెప్పుకోవ‌డానికి హౌజ్‌లో ఎవ‌రూ లేర‌ని మ‌ద‌న‌ప‌డింది.

రాజ్‌కు ప‌నిష్‌మెంట్‌…

ఆ త‌ర్వాత పాము నిచ్చెన టాస్క్‌లో ఓడిపోయి కెప్టెన్సీ రేసు నుంచి త‌ప్పుకొన్న రోహిత్‌, శ్రీస‌త్య‌, ఇనాయా, వాసంతిల‌కు బిగ్‌బాస్ స్టిక్కీ సిట్యూవేష‌న్ అనే టాస్క్ ఇచ్చాడు. ఈ టాస్క్‌లో మ‌ధ్య‌లోనే ఇనాయా, వాసంతి ఔట్ అయ్యారు. దాంతో శ్రీస‌త్య‌, రోహిత్‌ను విన్న‌ర్‌గా సంచాల‌క్ రేవంత్ ప్ర‌క‌టించాడు. శ్రీస‌త్య త‌న‌ను కావాల‌నే గేమ్ నుంచి ఔట్ నుంచి తోసేసింద‌ని ఇనాయా బాధ‌ప‌డింది. రేవంత్‌, రాజ్ నిద్ర‌పోవ‌డంతో వారికి కెప్టెన్ శ్రీస‌త్య ప‌నిష్‌మెంట్ ఇచ్చింది. రాజ్ బాత్‌రూమ్స్ క్లీన్ చేశాడు.

కీర్తితో రేవంత్ గొడ‌వ‌...

ఆ త‌ర్వాత కెప్టెన్సీ పోటీదారుల కోసం మ‌రోసారి నాగ‌మ‌ణి అనే టాస్క్ ఇచ్చాడు బిగ్‌బాస్‌. ఈ టాస్క్‌కు ఇనాయా, వాసంతి సంచాల‌క్‌గా వ్య‌వ‌హ‌రించారు. ఈ గేమ్‌లో ప‌దే ప‌దే ఫిజిక‌ల్ అవుతూ క‌నిపించాడు రేవంత్‌. అత‌డిని ఆదిరెడ్డి హెచ్చ‌రించాడు. ఈ గేమ్‌లో కీర్తి, రేవంత్ గొడ‌వ‌ప‌డ్డారు.టాస్క్ అయ్యేంత సేపు కీర్తితో రేవంత్ ఆర్గ్యూ చేస్తూనే క‌నిపించాడు. గేమ్ ఆడ‌టానికే ప్ర‌య‌త్నిస్తున్నాన‌ని, చేత‌కాక ఫిజిక‌ల్ అంటూ అపోజిట్ టీమ్ ఆరోపిస్తున్న‌ద‌ని రేవంత్ అరిచాడు. త‌మ టీమ్ స‌భ్యులు అత‌డికి న‌చ్చ‌జెప్ప‌డానికి ఎంత ప్ర‌య‌త్నించిన విన‌లేదు. నోరు జార‌డం త‌గ్గించ‌లేదు

రేవంత్‌కు ఆదిరెడ్డి వార్నింగ్‌...

ఆ త‌ర్వాత మ‌రోసారి ఆదిరెడ్డితో గొడ‌వ‌ప‌డ్డాడు రేవంత్‌. ఆట తాను నీట్‌గా ఆడుతాన‌ని ఫిజిక‌ల్ అవ్వాన‌ని ఆదిరెడ్డి అన్నాడు. త‌ప్పు చేస్తే త‌న‌ను నామినేట్ చేసుకోమ‌ని రేవంత్ అన్నాడు. గొడ‌వ ముద‌ర‌డంతో మిగిలిన కంటెస్టెంట్స్ ఇద్ద‌రికి స‌ర్ధిచెప్పారు. టాస్క్ మొత్తం గొడ‌వ‌ల‌తోనే సాగింది. నువ్వు కాదు తోపు అంద‌రూ తోపే ఎవ‌రిని త‌క్కువ‌గా అంచ‌నా వేయ‌ద్ద‌ని ఫైమా కూడా రేవంత్‌కు వార్నింగ్ ఇచ్చింది. నాగ‌మ‌ణి టాస్క్‌లో పాము టీమ్ గెలిచింది.

కెప్టెన్సీ రేసులో ఆరుగురు...

టీమ్ స‌భ్యులంద‌రూ కెప్టెన్సీ రేసులో నిలిచిన‌ట్లు బిగ్‌బాస్ పేర్కొన్నాడు. బంగారుమ‌ణి ఉన్న కార‌ణంగా నిచ్చెన టీమ్‌లో మ‌రీనా కెప్టెన్సీ రేసులో నిలిచింది. శ్రీహాన్‌, కీర్తి, ఫైమా, ఆదిరెడ్డి, రోహిత్‌, మ‌రీనా ఈ వారం కెప్టెన్సీ కోసం పోటీప‌డ‌తార‌ని బిగ్‌బాస్ అన్నాడు. కెప్టెన్సీ పోటీ కోసం శ్రీహాన్ అన‌ర్హుడు కావ‌డంతో త‌న స్థానంలో శ్రీస‌త్య‌ను నామినేట్ చేశాడు రేవంత్‌.

Whats_app_banner