Bigg Boss Telugu 8: అభయ్‌పై బిగ్ బాస్ వేటు.. నిఖిల్‌కు స్పెషల్ గుడ్డు.. ఎలిమినేషన్‌లో సేవ్ చేసే ఛాన్స్!-bigg boss telugu 8 abhay naveen out from chief position nikhil wins special egg in bigg boss 8 telugu today highlights ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Bigg Boss Telugu 8: అభయ్‌పై బిగ్ బాస్ వేటు.. నిఖిల్‌కు స్పెషల్ గుడ్డు.. ఎలిమినేషన్‌లో సేవ్ చేసే ఛాన్స్!

Bigg Boss Telugu 8: అభయ్‌పై బిగ్ బాస్ వేటు.. నిఖిల్‌కు స్పెషల్ గుడ్డు.. ఎలిమినేషన్‌లో సేవ్ చేసే ఛాన్స్!

Sanjiv Kumar HT Telugu
Sep 19, 2024 06:35 AM IST

Bigg Boss Telugu 8 Today Episode Highlights: బిగ్ బాస్ తెలుగు 8 హౌజ్‌లో చీఫ్ పొజిషన్ నుంచి అభయ్ నవీన్‌ను తీసేసినట్లు సమాచారం. దీనికి సంబంధించిన విషయాన్ని ఇవాళ్టి (సెప్టెంబర్ 19) ఎపిసోడ్‌లో టెలికాస్ట్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. అలాగే నిఖిల్‌కు స్పెషల్ గుడ్డు వచ్చింది.

అభయ్‌పై బిగ్ బాస్ వేటు.. నిఖిల్‌కు స్పెషల్ గుడ్డు.. ఎలిమినేషన్‌లో సేవ్ చేసే ఛాన్స్!
అభయ్‌పై బిగ్ బాస్ వేటు.. నిఖిల్‌కు స్పెషల్ గుడ్డు.. ఎలిమినేషన్‌లో సేవ్ చేసే ఛాన్స్!

Bigg Boss 8 Telugu Abhay Nikhil: బిగ్ బాస్ తెలుగు 8లో మూడో వారం నామినేషన్స్ అనంతరం వాడీ వేడీగా సాగేవి టాస్కులు. ఈ వారం కూడా రేషన్ అందుకునేందుకు హౌజ్ మేట్స్‌కు బిగ్ బాస్ టాస్క్‌లు ఇచ్చాడు. బెలూన్ టాస్క్‌లో నిఖిల్, అభయ్ ఇద్దరూ పోటీ పడగా.. నిఖిల్ గెలిచాడు. దాంతో నిఖిల్‌కు సూపర్ మార్కెట్‌లో షాపింగ్ చేసే అవకాశం, అభయ్‌కు జెనరల్ స్టోర్‌లో షాపింగ్ చేసే అవకాశం లభించింది.

పృథ్వీ వయెలెంట్ గేమ్

నిఖిల్‌కు నాన్ వెజ్ ఐటమ్స్ లభిస్తే.. అభయ్‌కు వెజిటేబుల్స్ దక్కాయి. ఆ తర్వాత ప్రభావతి 2.0 అని కోడిపెట్టే ఎంట్రీ ఇచ్చింది. దాని నుంచి వచ్చే కోడిగుడ్లను కలెక్ట్ చేసి.. బజర్ మోగే సమయానికి ఎవరి దగ్గర ఎన్ని ఎక్కువ ఎగ్స్ ఉంటే వారు విన్ అయినట్లు. ఈ టాస్క్ హోరాహోరీగా సాగింది. పృథ్వీరాజ్ రెచ్చిపోయి మరి ఫిజికల్‌గా, వయలెంట్ గేమ్ ఆడాడు.

సంచాలక్‌గా నబీల్

మొత్తానికి ఆట పూర్తయ్యే సమయానికి నిఖిల్ టీమ్ వద్ద 66 గుడ్లు ఉంటే.. అభయ్ క్లాన్ దగ్గర 34 ఎగ్స్ మాత్రమే లభించాయి. దాంతో ఈ టాస్క్ విజేతగా నిఖిల్ టీమ్ గెలిచింది. దాంతో అపోనెంట్ టీమ్ నుంచి ఒక సభ్యుడిని ఎలిమినేట్ చేయాల్సిందిగా బిగ్ బాస్ చెప్పగానే.. అంతా నబీల్ పేరు చెప్పారు. దాంతో అభయ్ క్లాన్‌లో ఉన్న నబీల్ గేమ్ ఆడకుండా సంచాలక్‌గా వ్యవహరిస్తాడని బిగ్ బాస్ చెప్పాడు.

చీఫ్ స్థానం నుంచి

ఆ తర్వాత పెట్టే రెండు టాస్కుల్లో కూడా అభయ్ నవీన్ క్లాన్ ఓడిపోయినట్లు లైవ్‌లో చూపించారు. దీనికి సంబంధించిన ఫుటేజ్‌ను నేటి (సెప్టెంబర్ 19) ఎపిసోడ్‌లో టెలీకాస్ట్ చేసే అవకాశం ఉంది. వరుసగా టాస్కు‌ల్లో అభయ్ నవీన్ ఓడిపోవడం, తన పార్టిసిపిటేషన్ తక్కువ ఉండటంతో అతనిపై వేటు పడిందని సమాచారం. అభయ్ నవీన్‌ను క్లాన్ చీఫ్ పొజిషన్ నుంచి తీసేశారు.

స్పెషల్ ఎగ్ ఉపయోగం

ఇక ఎక్కువ టాస్క్‌లు గెలిచే విధంగా టీమ్‌ను ముందుకు నడిపిన శక్తి క్లాన్ చీఫ్‌కు స్పెషల్ గుడ్డు బహుమతిగా వచ్చింది. దీనికి ప్రత్యేకతలు ఉండనున్నాయి. ఈ స్పెషల్ గుడ్డు వల్ల నామినేషన్‌లో ఉన్న వాళ్లలో ఒకరిని ఎలిమినేట్ కాకుండా కాపాడే ఛాన్స్ ఉండొచ్చు. లేదా స్పెషల్ రేషన్, టాస్కులో ఏమైనా మార్పుల కోసం స్పెషల్ ఎగ్ పవర్‌ను ఉపయోగించవచ్చని బిగ్ బాస్ చెప్పే అవకాశం ఉంది.

ఎలిమినేషన్ నుంచి సేవ్

ఒకవేళ ఎలిమినేషన్ నుంచి సేవ్ చేసే అవకాశం నిఖిల్‌కు వస్తే.. అభయ్ నవీన్‌ను లేదా పృథ్వీరాజ్‌ను కాపాడే అవకాశం ఉంది. వీరిద్దరు నిఖిల్‌కు మంచి ఫ్రెండ్స్. పైగా వీరిద్దరిలో అభయ్ నవీన్‌నే కాపాడే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఎందుకుంటే సెల్ఫ్ నామినేషన్స్‌లో నిఖిల్‌ను వద్దని అభయ్ నామినేట్ అయ్యాడు. దానికి రుణంగా అభయ్‌ను సేవ్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలుస్తోంది.