Bigg Boss: ఐదేళ్లకు లవర్ వదిలేసి వెళ్లిపోయాడన్న సీత- నైనికకు వేధింపులు- తండ్రి షర్ట్ కొట్టేసిన నిఖిల్- ఏడిపించేశారుగా!
Bigg Boss Telugu 8 September 13th Episode Promo: బిగ్ బాస్ తెలుగు 8 నేటి ఎపిసోడ్ ప్రోమోలో కంటెస్టెంట్స్‌కు సర్‌ప్రైజ్ ఇచ్చారు. కానీ, ఆ సర్‌ప్రైజ్ గిఫ్ట్‌ను గెలుచుకునేందుకు ఐదుగురికి మాత్రమే అవకాశం ఉందని కండిషన్ పెట్టారు. తమ వ్యక్తిగత జీవితాల్లో పడిన బాధలు చెబుతూ కంటెస్టెంట్స్ అందరిని ఏడిపించేశారు.
Bigg Boss Telugu 8 Today Episode Promo: బిగ్ బాస్ తెలుగు 8 సెప్టెంబర్ 13వ తేది ఎపిసోడ్‌లో కంటెస్టెంట్స్ అందరికీ బిగ్ బాస్ సర్‌ప్రైజ్ ఇచ్చాడు. "మీకు ఇష్టమైన వారిని మీరంతా మిస్ అవుతున్నారని బిగ్ బాస్‌కు తెలుసు. ఐదురుగు సభ్యులకు వారి ఇంటి నుంచి గిఫ్ట్స్ పొందే అవకాశం ఉంది. కానీ ఐదుగురు ఎవరనేది మీతో ఉన్న ఇంటి సభ్యులపై ఆధారపడి ఉంటుంది" అని బిగ్ బాస్ అనౌన్స్ చేశాడు.
ఎక్కువ లాలిపాప్స్
దాంతో నైనిక ఆనందంగా ఎమోషనల్ అయింది. ఐదుగురికే అని చెప్పడంతో యశ్మీ బాధపడింది. అయితే, ఒక కంటెస్టెంట్ తమకు వచ్చిన గిఫ్ట్స్‌తో ఉన్న బంధాన్ని చెప్పాలి. దాంట్లో ఎవరిది నచ్చితే వారికి మిగతా కంటెస్టెంట్స్ లాలిపాప్ ఇస్తారు. అలా ఎక్కువ లాలిపాప్స్ గెలుచుకున్న వాళ్లు ఆ బహుమతులు పొందుతారని ప్రోమో చూస్తుంటే తెలుస్తోంది.
ఇందులో భాగంగానే ఒక్కోక్కరు తమకు గిఫ్ట్స్‌తో ఉన్న ఎమోషనల్ బాండింగ్‌ను చెప్పారు. "అది మా నాన్న షర్ట్. బేసిక్‌గా అబ్బాయిలకు నాన్నతో అంతా.. హగ్ చేయాలన్న అది ఉండదు కాబట్టి ఆయనకు తెలియకుండా ఆయన షర్ట్ దొంగతనం చేసి తీసుకున్నా" అని నిఖిల్ కన్నీళ్లు పెట్టుకున్నాడు.
ఐదేళ్ల రిలేషన్ తర్వాత
"సినిమాలోకి వచ్చిన కొత్తలో నాకు వచ్చిన ఫస్ట్ సాలరీతో మా డాడీకి కొనిచ్చిన వాచ్ అది. ఆయన ఉన్నన్ని రోజులు అదే పెట్టుకున్నడు" అని అభయ్ చెప్పాడు. తర్వాత సోనియాను పట్టుకుని ఏడ్చాడు. "ఐదేళ్లు ఒక రిలేషన్‌షిప్‌లో ఉన్న తర్వాత తను వదిలేసి వెళ్లిపోయినప్పుడు నాకు ఒక ఫ్రెండ్ దొరికాడు. కుమార్ ఐ మిస్ యూ" అని అతను పంపిన గిఫ్ట్ పక్కన కూర్చుని ఏడ్చేసింది కిర్రాక్ సీత.
"నా వేధింపుల బంధం (అబ్యూసివ్ రిలేషన్‌షిప్) తర్వాత హైదారాబాద్‌లో ఒక పర్సన్ వల్ల నేను హీల్ అయ్యాను. అది తనే. నన్ను అంతలా లవ్ చేసినందుకు థ్యాంక్యూ" అని తనకు వచ్చిన ఏనుగు బొమ్మను చూపిస్తూ కన్నీరుమున్నీరు అయింది నైనిక. అయితే, ఒక క్లాన్‌లో ఉన్న నైనిక, సీత ఇద్దరిలో ఒకరికి గిఫ్ట్ అందుకునే అవకాశం వచ్చినట్లుగా తెలుస్తోంది.
ఓదార్చిన అభయ్
"ఆ పర్సన్ ఇది చూసి నీతో లైఫ్ లాంగ్ ఉండాలని కోరుకుంటున్నాను" అని సీతను హగ్ చేసుకుని అభయ్ సపోర్ట్ చేసినట్లుగా చూపించారు. "తను ఏం ఫీల్ అవుతుందో నేను ఫీల్ అవగలుగుతున్నాను. ఒక రిలేషన్‌షిప్ ఏంటీ.. దాని వాల్యూ ఏంటీ" అని నిఖిల్ అన్నాడు. అయితే, తను ఎవరి గురించి అన్నాడో తెలియలేదు. అనంతరం నిఖిల్ ఏడుస్తుంటే అభయ్ ఓదార్చాడు.
"ఇద్దరిలో ఎవరి దగ్గరయితే తక్కువ లాలిపాప్స్ ఉన్నాయో ఆ సభ్యులు గిఫ్ట్‌ను కోల్పోతారు" అని బిగ్ బాస్ అనౌన్స్‌మెంట్ ఇవ్వడం చూపించారు. దాంతో కిర్రాక్ సీత కిందపడి ఏడ్చింది. చూస్తుంటే తనకు గిఫ్ట్ దక్కలేదని తెలుస్తోంది. మరోవైపు నిఖిల్‌ను పట్టుకుని సోనియా ఏడ్చింది.
ఏడిపించేశారుగా..
సోనియాను నిఖిల్ ఓదార్చడంతో ప్రోమో ముగిసింది. ఇలా అందరి బాధను చెప్పించి వారిని ఏడిపించడమే కాకుండా మిగతా వారందరిని ఎమోషనల్ అయ్యేలా చేశాడు బిగ్ బాస్. మరి ఎవరికి గిఫ్ట్స్ వచ్చాయో తెలియాలంటే బిగ్ బాస్ 8 తెలుగు నేటి ఎపిసోడ్ టెలీకాస్ట్ అయ్యేవరకు ఆగాల్సిందే.