Bigg Boss Vishnupriya: రివేంజ్ తీర్చుకున్న యాంకర్ విష్ణుప్రియ.. చీప్‌గా రెచ్చగొడుతుందన్న స్నేకియా.. అభయ్ వత్తాసు!
Bigg Boss Telugu 8 Vishnupriya Vs Sonia Akula: బిగ్ బాస్ తెలుగు 8 సీజన్ సెప్టెంబర్ 11వ తేది ఎపిసోడ్‌లో విష్ణుప్రియ రివేంజ్ తీర్చుకుంటానని చెప్పి చేసింది. అది చూసిన సోనియా చీప్‌గా రెచ్చగొడుతదని కామెంట్స్ చేసింది. ఇలా ప్రతిసారి విష్ణుప్రియపై సోనియా విషం చిమ్ముతోందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
(1 / 7)
బిగ్ బాస్ తెలుగు 8 సెప్టెంబర్ 11వ తేది ఎపిసోడ్‌లో ముగ్గురు క్లాన్ టీమ్స్‌కు రేషన్ టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. అందుకు రెండు అవకాశాలు ఇచ్చిన బిగ్ బాస్.. మూడు టీమ్స్‌కు డిఫరెంట్ టైమ్ లిమిట్ పెట్టాడు. (All Pics @YouTube)
(2 / 7)
అతిపెద్ద క్లాన్ అయిన యశ్మీకి ఎక్కువ సమయం, అందరికంటే చిన్న క్లాన్ అయిన నిఖిల్‌కు అతి తక్కువ సమయం ఇచ్చిన బిగ్ బాస్ మధ్యస్థ సమయంగా నైనిక్ క్లాన్‌కు ఇచ్చాడు.
(3 / 7)
రేషన్ టాస్క్ తర్వాత వాటిని వాడుకునేందుకు రెండు టాస్క్‌లు ఇచ్చారు. దాంట్లో మొదటిసారి యశ్మీ క్లాన్ గెలవగా.. రెండో అవకాశంలో నైనిక టీమ్ గెలిచింది. దీంతో ఈ రెండు టీమ్స్‌కు రేషన్, కూరగాయలు, చికెన్, మటన్ వంటి నిత్యావసర వస్తువులు వచ్చాయి.
(4 / 7)
ఓడిపోయిన నిఖిల్ క్లాన్‌కు రాగి పిండి, ఉడకబెట్టిన కూరగాయలు మాత్రమే పంపించారు బిగ్ బాస్. అయితే, ఎవరి రేషన్‌ను వారు కాపాడుకోవాల్సిందిగా బిగ్ బాస్ చెప్పాడు. దాంతో అంతా దొంగతనాలు చేయడం స్టార్ట్ చేశారు. ముందు యశ్మీ టీమ్‌లోని పృథ్వీ, సోనియా, అభయ్ నైనిక క్లాన్ సంపాదించుకున్న చికెన్ దొంగతనం చేశారు.
(5 / 7)
అనంతరం యశ్మీ టీమ్‌లోని జ్యూస్ బాటిల్‌ను సైలెంట్‌గా ఇవ్వమని నైనికను అడిగింది విష్ణుప్రియ. నేను వాళ్లపై రివేంజ్ తీర్చుకోవాలి. ఈ జ్యూస్ వాళ్లకళ్ల ముందే తాగాలి అని నైనికతో చెప్పిన విష్ణుప్రియ యశ్మీ ముందు బాటిల్ పట్టుకుని ఊరించింది. దాంతో విష్ణును యశ్మీ పట్టుకోడానికి సరాదాగా ట్రై చేసింది. ఇద్దరూ సరదాగా ఫన్ గేమ్ ఆడారు.
(6 / 7)
అదంతా చూసిన సోనియా.. ఇతరులను రెచ్చగొట్టాలంటే వాళ్లిద్దరే విష్ణుప్రియ, ప్రేరణ అని చెప్పింది. ప్రేరణ మెచ్యూర్‌గా రెచ్చగొడుతుంది అని అభయ్ అంటే.. విష్ణు చీప్‌గా రెచ్చగొడుతుంది అని సోనియా అంది. దానికి అభయ్ వత్తాసు పలికాడు.
ఇతర గ్యాలరీలు