Bigg Boss: తల్లి, చెల్లి అంటూ వాడిని ఇష్టమొచ్చినట్లు వాడుకుంటున్నావ్- సోనియాపై యష్మీ ఫైర్- ఏడ్చేసిన ముకుంద (వీడియో)-bigg boss telugu 8 yashmi gowda crying about sonia comments nikhil prithvi bigg boss 8 telugu today episode highlights ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Bigg Boss: తల్లి, చెల్లి అంటూ వాడిని ఇష్టమొచ్చినట్లు వాడుకుంటున్నావ్- సోనియాపై యష్మీ ఫైర్- ఏడ్చేసిన ముకుంద (వీడియో)

Bigg Boss: తల్లి, చెల్లి అంటూ వాడిని ఇష్టమొచ్చినట్లు వాడుకుంటున్నావ్- సోనియాపై యష్మీ ఫైర్- ఏడ్చేసిన ముకుంద (వీడియో)

Sanjiv Kumar HT Telugu
Sep 24, 2024 12:35 PM IST

Bigg Boss Telugu 8 Yashmi Vs Sonia: బిగ్ బాస్ తెలుగు 8 నేటి ఎపిసోడ్ ప్రోమోలో సోనియా వర్సెస్ యష్మీ జోరుగా సాగింది. సోనియాపై యష్మీ విరుచుకుపడింది. నామినేషన్స్‌లో తనను అన్న మాటలపై కౌంటర్ ఇచ్చింది. సిస్టర్, మదర్ అంటూ వాడిని బాగా వాడుకుంటున్నావ్ అని గట్టిగా చెప్పేసింది. తర్వాత ఎమోషనల్ అయి ఏడ్చేసింది.

తల్లి, చెల్లి అంటూ వాడిని ఇష్టమొచ్చినట్లు వాడుకుంటున్నావ్- సోనియాపై యష్మీ ఫైర్- ఏడ్చేసిన ముకుంద
తల్లి, చెల్లి అంటూ వాడిని ఇష్టమొచ్చినట్లు వాడుకుంటున్నావ్- సోనియాపై యష్మీ ఫైర్- ఏడ్చేసిన ముకుంద

Bigg Boss Telugu 8 Today Episode Promo: బిగ్ బాస్ తెలుగు 8 సెప్టెంబర్ 23వ తేది ఎపిసోడ్‌లో కంటెస్టెంట్ల మధ్య నాలుగో వారం నామినేషన్స్ రచ్చ రచ్చగా సాగాయి. ఈ వారం నామినేషన్స్‌లో నబీల్ వర్సెస్ సోనియా వర్సెస్ యష్మీ మాటల తూటాలతో సాగిపోయింది.

నామినేషన్స్‌లో ఆరుగురు

అయితే, యష్మీ నామినేట్ చేసినప్పుడు మళ్లీ పర్సనల్ అటాక్ చేసింది ఆర్జీవీ హీరోయిన్ సోనియా. నువ్ నిఖిల్, పృథ్వీని అలాగే చూస్తుంటావ్ అని సైట్ కొట్టినట్లుగా మాట్లాడింది సోనియా. దానికి అప్పుడు అవును చూస్తాను, అది నా ఇష్టం అని గట్టిగా ఇచ్చిపడేసింది యష్మీ. తర్వాత అలా వాగ్వాదంతోనే నామినేషన్ పూర్తి చేసింది. నామినేషన్స్‌లో ఆరుగురు ఉన్నట్లు ప్రకటించిన తర్వాత మళ్లీ యష్మీ, సోనియా మధ్య ఫైట్ జరిగినట్లు తెలుస్తోంది.

నేనేందుకు నమ్ముతా

దీనికి సంబంధించిన విషయాన్ని తాజాగా రిలీజ్ చేసిన సెప్టెంబర్ 24వ తేది ఎపిసోడ్‌ ప్రోమోలో చూపించారు. "నువ్ మదర్, సిస్టర్ అని చెపితే నేనేందుకు నమ్ముతా. అలా నువ్ తీయకూడదు. అంటే అలా మీరు తీసి ఏమైనా చేయొచ్చా. దానికి అటాచ్‌మెంట్ యాడ్ చేయొచ్చా అని" పృథ్వీతో కోపంగా యష్మీ చెప్పింది. దాంతో మధ్యలోకి సోనియా వచ్చింది.

ఇష్టమొచ్చినట్లు వాడుకుంటున్నావ్

"నేను అంత క్లియర్‌గా" అని సోనియా అంటుంటే.. "నేను గేమ్ పరంగా చూశానమ్మా. నీలాగా నేను ఆలోచించలేదు. హలో ఎక్స్‌క్యూజ్ మీ. నువ్ మాత్రం దానికి ఒక అటాచ్‌మెంట్ యాడ్ చేసి నేను సిస్టర్ మదర్ అని ఇష్టమొచ్చినట్లు వాడిని వాడుకుంటున్నావ్ అని నాకు అనిపిస్తుంది. ఈరోజు అది క్లియర్ చేశావ్" అని యష్మీ చెప్పింది.

వాళ్లిద్దరిలో క్లారిటీ ఉంది

"ఆ ముగ్గురికి ఇస్తున్న ఇంపార్టెన్స్ క్లాన్‌లో ఎవరికీ ఇవ్వలేదు" అని సోనియాపై ఫైర్ అయిన యష్మీ నాన్సెన్స్ అనుకుంటూ వెళ్లిపోయింది. తర్వాత బెడ్ రూమ్స్ దగ్గర మళ్లీ సోనియా, యష్మీ గొడవ పడ్డారు. "వాళ్లిద్దరి క్లారిటీలోనే ఉంది కదా. ఇప్పుడు చూస్తాలేవు కదా. వెరీ క్లియర్. యా నువ్ చూడు" అని సోనియా అంది.

నిఖిల్‌ను చూస్తున్నానా

"ఏ క్లారిటీ.. ఒక్క నిమిషం అమ్మా.. నెక్ట్స్ టైమ్ నువ్ నన్ను చూడు. నేను నిఖిల్‌ను చూస్తున్నానా.. పృథ్వీని చూస్తున్నానా.. గేమ్ ఆడుతున్నానా.. నెక్ట్స్ నామినేషన్‌లో చూడు" అని యష్మీ అంది. దానికి సోనియా నవ్వుతున్నట్లు చూపించారు. తర్వాత "తను చేస్తే నామినేషన్స్.. మేము చేస్తే నామినేషన్స్ కాదు" అని యష్మీ అంది.

ఓదార్చిన నిఖిల్

కట్ చేస్తే.. యష్మీ ఏడుస్తూ కన్నీరుపెట్టుకుంది. "అంటే ప్రతిసారి ఎంత తప్పుగా అర్థం చేసుకుంది. నువ్ నాతో మాట్లాడినప్పుడు" అని నిఖిల్‌తో చెబుతూ యష్మీ ఏడ్చేసింది. యష్మీని హగ్ చేసుకుని సీత ఓదార్చింది. మణికంఠ అలాగే చూస్తూ ఉండిపోయాడు. "ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతుంది" అని యష్మీ కన్నీళ్లు పెట్టుకుంది. యష్మీని హగ్ చేసుకుని నిఖిల్ ఓదార్చాడు. కాగా కృష్ణ ముకుంద మురారి సీరియల్‌లో ముకుంద పాత్రతో యష్మీ బాగా పాపులర్ అయింది.