Bigg Boss Sonia Love Story: లవ్ స్టోరీ బయటపెట్టిన సోనియా.. అబ్బాయి డివోర్సీ.. ప్రేరణ చెవిలో చెప్పింది ఇదే!
Bigg Boss Telugu 8 Sonia Akula Love Story: బిగ్ బాస్ తెలుగు 8 కంటెస్టెంట్ సోనియా ఆకుల తన లవ్ స్టోరీని ఎట్టకేలకు బయటపెట్టింది. బిగ్ బాస్ 8 తెలుగు సెప్టెంబర్ 18వ తేది ఎపిసోడ్‌లో ప్రేరణతో తన ప్రేమ విషయం చెప్పింది. అంతేకాకుండా ప్రేరణ చెవిలో చిన్న సీక్రెట్ కూడా చెప్పేసింది.
Bigg Boss 8 Telugu Day 17 Episode Highlights: బిగ్ బాస్ తెలుగు షోలో గొడవలు ఎంత కామనో లవ్ ట్రాక్‌లు అంతే సర్వసాధారణం. ఇక బిగ్ బాస్ తెలుగు 8 సీజన్‌లో హాట్ టాపిక్ అయ్యే అంశం నిఖిల్, సోనియా, పృథ్వీ లవ్ ట్రాక్. పైకి ఫ్రెండ్షిప్, చిన్నోడు, పెద్దోడు అంటూ చెప్పే సోనియా వారితో బిహేవ్ చేసే విధానం మాత్రం వేరేలా ఉంటుంది.
యశ్మీర్ ఎవరు
నిఖిల్, పృథ్వీతో సోనియా ఉండే తీరు డౌట్ పడేలా చేస్తుంది. సిగరేట్ తాగితే ఏదైనా ఇస్తానంటూ నిఖిల్‌తో సోనియా చేసిన కామెంట్స్ తెగ వైరల్ అయ్యాయి. ఇదిలా ఉంటే, సోనియాపై ఉన్న నెగెటివిటీని దూరం చేయడగానికో, తన ఇదివరకే రిలేషన్‌లో ఉందని చెప్పడానికో "యశ్వీర్ ఎవరు, YS అని రాసుకున్నావ్ కదా. నేను ఏదో గెస్ చేసి చెప్పాను యశ్వీర్ అని" అని ఓ ఎపిసోడ్‌లో నాగార్జున అన్నారు.
నాగార్జున మాటలతో నిఖిల్ ఒక్కసారిగా ఖంగుతిన్నాడు. ఆ తర్వాత కూడా ఈ ముగ్గురు క్లోజ్‌గానే ఉంటున్నారు. అయితే, తాజాగా సెప్టెంబర్ 18వ తేది ఎపిసోడ్‌లో సోనియా తన లవ్ మ్యాటర్‌ను బయటపెట్టింది. ప్రేరణతో ఒంటరిగా మాట్లాడుతు లవ్ స్టోరీ చెప్పేసింది. "నేను ఎప్పుడు ప్రపోజ్ చేయలేదు కానీ, రేండున్నర ఏళ్లుగా మేము కలిసి పని చేస్తున్నాం" అని సోనియా చెప్పింది.
చాలా మార్పులు జరిగాయ్
"నేను స్టార్ట్ చేసిన ఎన్‌జీవోకి వెబ్ సైట్ డిజైనింగ్ ఆయనే చేశారు. దానికి యూఎస్ నుంచి స్పాన్సర్ కూడా" అని సోనియా తెలిపింది. దానికి "అయితే, అందులో కాంప్లికేషన్ ఏముంది. పెళ్లి చేసుకోవచ్చు కదా" అని ప్రేరణ చెప్పింది. "ఆయనకు వేరే ఒకరితే రిలేషన్ ఉంది. కానీ ఇప్పుడు కాదు. కాకపోతే ఇప్పటికీ డిపెండెన్సీ ఉంది. కానీ, ఆయన వచ్చాక నా లైఫ్‌లో చాలా మార్పులు జరిగాయి" అని సోనియా తెలిపింది.
"నేను ఇంతకుముందు కుటుంబానికి దూరుంగా ఉండేదాన్ని.. నా గోల్స్‌కు ఇబ్బంది అవుతుందని, కానీ, తను వచ్చాకే అది మారింది" అని సోనియా చెప్పింది. మరి డిపెండెన్సీ ఏంటీ అని ప్రేరణ అడిగింది. "అతను నా నిర్ణయం కోసం వెయిటింగ్ అంతే" అని చెప్పిన సోనియా.. ప్రేరణ చెవి దగ్గరికి వెళ్లి మెల్లిగా.. "ఆయనకు డివోర్స్ అయింది" అని చెప్పింది.
అమెరికా-డివోర్సీ
హో.. నైస్.. క్యూట్.. నువ్ అర్థం చేసుకున్న విధాననం నాకు నచ్చింది అని ప్రేరణ కాంప్లిమెంట్ ఇచ్చింది. అలా ఎట్టకేలకు తన లవర్ అమెరికాలో ఉంటాడని, డివోర్సీ అని సోనియా బయటపెట్టింది. ఇదిలా ఉంటే, బిగ్ బాస్ 8 తెలుగు మూడో వారం నామినేషన్స్‌లో మొత్తం 8 మంది ఉన్నారు.
బిగ్ బాస్ తెలుగు 8 థర్డ్ వీక్ నామినేట్ అయిన వాళ్లలో ప్రేరణ కంబం, నాగ మణికంఠ, పృథ్వీరాజ్, కిర్రాక్ సీత, విష్ణుప్రియ, అభయ్ నవీన్, యష్మీ గౌడ, నైనిక ఉన్నారు. వీరిలో అభయ్ నవీన్, పృథ్వీరాజ్ అతి తక్కువ ఓట్లతో డేంజర్ జోన్‌లో ఉన్నారు.