Bigg Boss Vishnupriya: అడుక్కునేవాళ్లకు వేసినట్లు వేసింది.. ఎవరికైనా ఆకలేగా అంటూ ఏడ్చేసిన విష్ణుప్రియ (వీడియో)-bigg boss telugu 8 vishnupriya crying for prerana behaviour while give food bigg boss 8 telugu day 18 episode highlights ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Bigg Boss Vishnupriya: అడుక్కునేవాళ్లకు వేసినట్లు వేసింది.. ఎవరికైనా ఆకలేగా అంటూ ఏడ్చేసిన విష్ణుప్రియ (వీడియో)

Bigg Boss Vishnupriya: అడుక్కునేవాళ్లకు వేసినట్లు వేసింది.. ఎవరికైనా ఆకలేగా అంటూ ఏడ్చేసిన విష్ణుప్రియ (వీడియో)

Sanjiv Kumar HT Telugu
Sep 18, 2024 12:16 PM IST

Bigg Boss Telugu 8 Vishnupriya Vs Prerana On Food: బిగ్ బాస్ తెలుగు 8లో విష్ణుప్రియ ఫుడ్ విషయంలో కన్నీళ్లు పెట్టుకుంటూ ఏడ్చేసింది. ప్రేరణ ఫుడ్ వేసిన విధానం తనకు బాధకలిగించిందని, ఎవరికైనా ఆకలేగా అని విష్ణుప్రియ ఎమోషనల్ అయింది. బిగ్ బాస్ 8 తెలుగు సెప్టెంబర్ 18వ తేది ఎపిసోడ్ ప్రోమో చూస్తే..

అడుక్కునేవాళ్లకు వేసినట్లు వేసింది.. ఎవరికైనా ఆకలేగా అంటూ ఏడ్చేసిన విష్ణుప్రియ
అడుక్కునేవాళ్లకు వేసినట్లు వేసింది.. ఎవరికైనా ఆకలేగా అంటూ ఏడ్చేసిన విష్ణుప్రియ

Bigg Boss 8 Telugu Today Episode Promo: బిగ్ బాస్ తెలుగు 8 సీజన్‌లో ప్రస్తుతం మూడో వారం రేషన్ టాస్క్ జరుగుతోంది. సెప్టెంబర్ 17వ తేది ఎపిసోడ్‌లో బెలూన్ టాస్క్‌లో బాగానే ఫైట్ జరిగింది. సంచాలక్‌గా ఉన్న సోనియా ఆకుల తన టీమ్‌కు ఫేవర్‌గా చేసిందని యష్మీ ఫైర్ అయింది. అది కంటిన్యూ చేస్తూనే బిగ్ బాస్ తెలుగు 8 సెప్టెంబర్ 18వ తేది ఎపిసోడ్ ప్రోమోను స్టార్ట్ చేశారు.

సోనియా విషయంలో గొడవ

"స్టిక్స్ విరిగిపోతే గేమ్ ఆపాలని సంచాలక్‌ చెప్పారు. కానీ, మీరు ఆగలేదు. మీ సంచాలక్ బెలూన్స్‌ను బాక్స్‌లోకి పంపకుండా ఎందుకు సైలెంట్‌గా ఉంది" అని నిఖిల్‌తో గొడవ పెట్టుకుంది యష్మీ. అరవకు అని నిఖిల్ అన్నాడు. నేను అరుస్తానని యష్మీ అంటే.. అయితే, పక్కకు వెళ్లి అరువు, నువ్వు ఎవరు నాకు చెప్పడానికి అని నిఖిల్ ఫైర్ అయ్యాడు. అలా ఇద్దరూ సోనియా విషయంలో గొడవపడ్డారు.

కింద ఉన్న బెలూన్స్

"వాళ్లిద్దరూ ఈక్వెల్‌గా మిస్టేక్ చేసినప్పుడు గేమ్‌లో ఫస్ట్ లైన్ (రూల్) ఉందిగా ఒంటిమీద ఉన్న బెలూన్ అని. ఎందుకు ఆ నిర్ణయం తీసుకోలేదు. అవి కాకుండా కింద ఉన్న బెలూన్స్ ఎందుకు తీసుకుంది" అని ప్రేరణతో యష్మీ చెప్పుకొచ్చింది. తర్వాత సోనియా తల నిమురుకుంటూ కనిపించింది.

మహారాణిలా ఉండాలా

"బ్రీతింగ్ ప్రాబ్లమ్ ఉంటే.. అది వాళ్ల వీక్‌నెస్. అంత ప్రాబ్లమ్ ఉంటే నబీల్ రావాలి, లేదా ఆదిత్య రావాలి" అని పృథ్వీ చెప్పాడు. "నేను అడిగితే అన్ని చూసుకోవాల అని అంటుంది. ఇలా చేస్తూ అన్ని చూసుకోడానికి అవదా.. సంచాలక్‌ అంటే మహారాణిలా ఉండాలా" అని యష్మీ అంది. "మనోడు ఒక కాలు బయట పెట్టి, ఒకటి లోపల పెట్టి కొడుతుండు" అని నిఖిల్ అన్నాడు.

అది నా స్ట్రాటజీ

"నా వెనుక రెండు బెలూన్స్ ఉన్నాయి కాబట్టి వాటిని కాపాడుకునేందుకు నేను బయటకు వెళ్లా. అది నా స్ట్రాటజీ" అని అభయ్ చెప్పుకొచ్చాడు. కట్ చేస్తే విష్ణుప్రియ ఏడుస్తూ కనిపించింది. ఏమైందని అంతా అడిగారు. "ప్రేరణ ఫుడ్ విషయంలో. నాకు తను వేసిచ్చిన విధానం హర్టింగ్‌గా ఉంది" అని ఏడ్చేసింది విష్ణుప్రియ.

విసిరేసినట్లుగా

"వేసిచ్చే ఆ విల్లింగ్‌నెస్ ఉంటుంది కదా అది మిస్ అయింది" అని మణికంఠ అన్నాడు. "ఫుడ్ వేస్తారు చూడు" అని విష్ణుప్రియ అంటే.. "విసిరేసినట్లుగానా" అని నిఖిల్ అన్నాడు. అడుక్కునేవారికి ఫుడ్ వేసినట్లుగా అని అక్కడ విష్ణుప్రియ చెప్పినట్లుగా తెలుస్తోంది. "కాదురా.. ఎవరికైనా ఆకలే కదా" అని విష్ణుప్రియ కన్నీరుమున్నీరు అయింది.

ఏమైనా చేసుకో పో..

"తీసుకో.. తీసుకో పో" అని అన్నానా అని ప్రేరణ చెప్పుకొచ్చింది. "తను ఇలా వేసిచ్చిందా లేదా.. నువ్ చూశావ్ కదా" అని మణికంఠను విష్ణుప్రియ అడిగింది. కట్ చేస్తే "ప్రేరణ, విష్ణుప్రియ కూర్చుని ఉన్నారు. ఇలాంటి యాటిట్యూడ్ నాకు చూపించకు ప్లీజ్" అని ప్రేరణతో మణికంఠ అన్నాడు. "ఏమైనా చేసుకో పో.. పో.." అని ప్రేరణ రూడ్‌గా అంది.