Bigg Boss Remuneration: నామినేట్ అయిన తొలి వారమే ఎలిమినేట్.. 3 వారాల్లో అభయ్ నవీన్ సంపాదించి ఎంతంటే?
Bigg Boss Telugu 8 Abhay Naveen Remuneration: బిగ్ బాస్ తెలుగు 8 మూడోవారం ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ అభయ్ నవీన్. బిగ్ బాస్ హౌజ్‌లోకి మూడో కంటెస్టెంట్‌గా అడుగుపెట్టిన అభయ్ నవీన్ ఊహించనివిధంగా ఎలిమినేట్ అయిన మూడో కంటెస్టెంట్‌గా నిలిచాడు. మరి మూడు వారాలు హౌజ్‌లో ఉన్న అభయ్ ఎంత సంపాదించాడో చూస్తే..
Bigg Boss Telugu 8 Third Elimination Abhay Naveen: బిగ్ బాస్ తెలుగు 8 సీజన్ హోరా హోరీగా సాగుతోంది. గొడవలు, అలకలు, అరుపులతో మొత్తానికి బిగ్ బాస్ 8 తెలుగు సీజన్ నాలుగో వారంలోకి అడుగుపెట్టింది. అయితే, హౌజ్‌లో నాలుగో వారం నామినేషన్స్ కూడా రచ్చ రచ్చగా సాగాయి.
బిగ్ బాస్‌ను తిట్టడం
బిగ్ బాస్ తెలుగు 8 నాలుగో వారం నామినేషన్స్‌లో మొత్తంగా ఆరుగురు నామినేట్ అయ్యారు. వారిలో ఈ వారం ఒకరు ఎలిమినేట్ కానున్నారు. అయితే, బిగ్ బాస్ తెలుగు 8 మూడోవారం అభయ్ నవీన్ ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే. అప్పటివరకు కాస్తా పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకున్న అభయ్ మూడో వారం బిగ్ బాస్‌ను అనవసరంగా తిట్టడం, కామెడీ అనుకుని ఓవరాక్షన్ చేయడంతో నెగెటివిటీ తెచ్చుకున్నాడు.
ఫలితంగా బిగ్ బాస్ తెలుగు 8 ఓటింగ్‌లో అట్టడుగు స్థానంలో నిల్చొని చివరిగా మూడో వారం ఎలిమినేట్ అయ్యాడు. బిగ్ బాస్ 8 తెలుగు హౌజ్‌లోకి మూడో కంటెస్టెంట్‌గా అడుగుపెట్టిన అభయ్ నవీన్ ఎలిమినేట్ అయిన మూడో కంటెస్టెంట్‌గా నిలవడం విశేషం. అయితే, మొదటి రెండు వారాలు అభయ్ నవీన్ నామినేషన్స్‌లో లేడు.
బెడిసి కొట్టిన నామినేషన్
మూడో వారంలోనే చీఫ్‌గా బాధ్యతలు చేపట్టిన అభయ్ నవీన్ సెల్ఫ్ నామినేట్ చేసుకున్నాడు. ఇద్దరు చీఫ్స్ అయిన నిఖిల్, అభయ్‌లలో ఒకరు నామినేట్ కావాలని బిగ్ బాస్ ఆదేశించాడు. దాంతో వేరే ఆలోచన లేకుండా అభయ్ సెల్ఫ్ నామినేట్ అయినట్లు బిగ్ బాస్‌కు చెప్పాడు. దాంతో తొలిసారిగా నామినేషన్‌లోకి వచ్చాడు అభయ్ నవీన్. కానీ, అది అతనికీ బెడిసి కొట్టినట్లు తెలుస్తోంది.
అయితే, సర్‌ప్రైజ్ టాస్క్‌లో అభయ్ తన తండ్రికి గిఫ్ట్‌గా ఇచ్చిన వాచ్ వచ్చేలా చేసిన నిఖిల్‌కు రుణంగా సెల్ఫ్ నామినేట్ అయినట్లు అభయ్ నాగార్జునతో చెప్పాడు. "తన తండ్రి షర్ట్‌ను త్యాగం చేసి మరి నాకు నా తండ్రికి ఇచ్చిన వాచ్ వచ్చేలా చేశాడు. అందుకే వాడికి ఏదైనా చేయాలనిపించి సెల్ఫ్ నామినేట్ అయ్యాను. అందులో నేను గిల్టీగా ఫీల్ అవ్వట్లేదు. నేను చేసిన మిస్టేక్ వల్లే ఎలిమినేట్ అయ్యాను" అని స్టేజీపై నాగార్జునతో అభయ్ చెప్పుకొచ్చాడు.
అతి తక్కువగా
ఇదిలా ఉంటే, బిగ్ బాస్ 8 తెలుగు మూడో వారం నామినేషన్స్‌లో 8 మంది ఉండగా.. వారిలో విష్ణుప్రియ టాప్‌లో ఉంది. ఓటింగ్ చివరి రోజు నాటికి విష్ణుప్రియకు 23.99 శాతం (7,014 ఓట్లు), 17.95 శాతం (5,249 ఓట్లు)తో నాగ మణికంఠ రెండో స్థానంలో, 10.6 శాతం (3,101)తో నైనిక మూడో స్థానంలో, 10.38 శాతం (3,036 ఓట్లు)తో ప్రేరణ నాలుగో స్థానంలో నిలిచారు.
అలాగే, కిర్రాక్ సీత 10.25 శాతం (2,998 ఓట్లు)తో ఐదో స్థానం, యష్మీ గౌడ 9.54 శాతం (2,791 ఓట్లు)తో ఆరో స్థానంలో ఉన్నారు. ఇక పృథ్వీరాజ్ 9.02 శాతం (2,638 ఓట్లు)తో ఏడో స్థానంలో ఉంటే.. అభయ్ నవీన్ అతి తక్కువగా 8.26 శాతం (2,416 ఓట్లు)తో ఎనిమిదో స్థానంలో నిలిచి.. ఫైనల్‌గా ఎలిమినేట్ అయ్యాడు.
అభయ్ నవీన్ రెమ్యునరేషన్
ఇక, అభయ్ నవీన్ బిగ్ బాస్ హౌజ్‌లో ఉండేందుకు రోజుకు రూ. 28,572 చొప్పున వారానికి రూ. 2 లక్షల వరకు రెమ్యునరేషన్ తీసుకున్నాడని సమాచారం. అలా మొత్తం మూడు వారాలకు అభయ్ నవీన్ రూ. 6 లక్షల వరకు సంపాదించాడని తెలుస్తోంది. కాస్తా నెగెటివిటీతో బయటకెళ్లిన అభయ్ నవీన్ బిగ్ బాస్ ద్వారా జీఎస్టీతో కలిపి ఆరు లక్షలు సంపాదించాడని సమాచారం.