Bigg Boss Elimination: బిగ్ బాస్ ఎలిమినేషన్‌లో నలుగురు సేఫ్.. ఆ ముగ్గురికి డేంజర్.. ఈరోజు ఎలిమినేట్ అయ్యేది ఎవరంటే?
Bigg Boss Telugu 8 Third Week Elimination: బిగ్ బాస్ తెలుగు 8 మూడో వారం ఎలిమినేషన్ ఊహించనివిధంగా ఉండనుందని తెలుస్తోంది. బిగ్ బాస్ 8 తెలుగు మూడో వారం ఎలిమినేషన్‌లో ముగ్గురు కంటెస్టెంట్స్ డేంజర్ జోన్‌లో ఉండగా.. నలుగురు సేఫ్ అయ్యారని సమాచారం. మరి ఈ వారం ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్ ఎవరంటే..
Bigg Boss 8 Telugu Elimination This Week: బిగ్ బాస్ తెలుగు 8 సీజన్ రోజురోజుకీ రసవత్తరంగా సాగుతోంది. ప్రతి సీజన్‌లాగే అరుపులు, గొడవలు, బలప్రయోగాలు, లవ్ ట్రాక్స్, అలకలు, బుజ్జగింపులతో జోరుగా బిగ్ బాస్ 8 తెలుగు నడుస్తోంది. ఇక తెలుగు రియాలిటీ షో మూడో వారానికి చేరుకుంది. దీంతో ఎలిమినేట్ కానున్న మూడో కంటెస్టెంట్ ఎవరా అనేది క్యూరియాసిటీగా మారింది.
బిగ్ బాస్ మూడో వారం నామినేషన్స్
అయితే, బిగ్ బాస్ తెలుగు 8లోకి ముందుగా 14 మంది తెలిసి, తెలియని సెలబ్రిటీలు కంటెస్టెంట్స్‌గా వచ్చిన విషయం తెలిసిందే. వీరిలో మొదటి రెండు వారాల్లో వరుసగా.. బెజవాడ బేబక్క, శేఖర్ బాషా ఎలిమినేట్ అయి ఇంటిదారి పట్టారు. దాంతో హౌజ్‌లో 12 మిగిలారు. వారికి మూడో వారం నామినేషన్ల ప్రక్రియ నిర్వహించారు.
కేవలం ఒకరోజు మాత్రమే జరిగిన బిగ్ బాస్ 8 తెలుగు మూడో వారం నామినేషన్ల ప్రక్రియలో 8 మంది కంటెస్టెంట్స్ నామినేట్ అయ్యారు. కనీసం రెండు ఓట్లు వచ్చిన ఇంటి సభ్యులు నామినేట్ అయినట్లుగా ప్రకటించాడు బిగ్ బాస్. అలా సెల్ఫ్ నామినేట్ చేసుకున్న అభయ్ నవీన్‌తోపాటు నాగ మణికంఠ, సీత, ప్రేరణ, యష్మీ, విష్ణుప్రియ, నైనిక, పృథ్వీరాజ్ మొత్తం 8 మంది మూడో వారం నామినేషన్స్‌లో ఉన్నారు.
డేంజర్ జోన్‌లో ముగ్గురు
వీరిలో విష్ణుప్రియకు మొదటి రోజు నుంచే మంచి ఓటింగ్ వస్తూ నెంబర్ వన్ స్థానంలో నిలిచింది. అలాగే, ప్రతిసారి ఎమోషనల్ అవుతున్నప్పిటికీ ఆటపరంగా మంచి పోటీ ఇస్తున్న నాగ మణికంఠ రెండో స్థానంలో ఉన్నాడు. తర్వాత ప్రేరణ, సీత, యష్మీ సైతం మంచి ఓటింగ్ సేఫ్ సైడ్ నిలుచున్నారు. కానీ, నైనిక, అభయ్ నవీన్, పృథ్వీరాజ్ మాత్రం డేంజర్ జోన్‌లో ఉన్నారు.
అగ్రెషన్ తప్పితే.. ఇతరులు గురించి ఏమాత్రం ఆలోచించని పృథ్వీకి అతి తక్కువ ఓట్లు పడ్డాయి. కానీ, పృథ్వీ ఉంటే చాలా వరకు కంటెంట్ అవకాశం ఉండటంతో తనను బిగ్ బాస్ ఎలిమినేట్ చేసే అవకాశం లేదని సమాచారం. దాంతో అభయ్, నైనికకు రిస్క్ ఎక్కువ ఉందని తెలుస్తోంది. ఈ ఇద్దరు ఈ వీక్‌లో పెద్దగా ఆటతో ప్రభావం చూపించలేకపోయారు.
నలుగురు సేఫ్
నైనిక తనవంతూ బాగానే ప్రదర్శించిన ఈ వీక్ మాత్రం తక్కువ కంటెంట్ ఇచ్చింది. ఇక ఆడేందుకు స్కోప్ ఉన్న అభయ్ గివప్ ఇచ్చేశాడు. దానికి పనిష్‌మెంట్‌గా చీఫ్ పదవి నుంచి తొలగించాడు బిగ్ బాస్. ఈ ఇద్దరిలో ఎవరో ఒకరు ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉందని సమాచారం. ఎక్కువగా అభయ్ పేరు వినిపిస్తున్న ఊహించని ఎలిమినేషన్ జరుగుతుందని టాక్.
ఇక ఆదివారం ప్రకటించే ఎలిమినేషన్‌ను ఒకరోజు ముందే అంటే శనివారం (సెప్టెంబర్ 21) షూటింగ్ జరుగుతుంది. దీని ప్రకారం ఇవాళే ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్ ఎవరనేది తెలియనుంది. అయితే, ఈ ఎలిమినేషన్ నుంచి ఇప్పటికీ యష్మీ, విష్ణుప్రియ, ప్రేరణ, నాగ మణికంఠ సేఫ్ అయినట్లు బిగ్ బాస్ వర్గాల నుంచి వచ్చిన సమాచారం.