Bigg Boss Elimination: తారుమారైన బిగ్ బాస్ ఓటింగ్.. ఆరుగురిలో నలుగురికి డేంజర్.. ఈవారం డబుల్ ఎలిమినేషన్!
Bigg Boss Telugu 8 Elimination Fourth Week: బిగ్ బాస్ తెలుగు 8లో నాలుగో వారం డబుల్ ఎలిమినేషన్ జరిగే అవకాశం ఎక్కువగా ఉందని సమాచారం వస్తోంది. అలాగే, బిగ్ బాస్ 8 తెలుగు ఈ వారం నామినేషన్స్‌లో ఉన్న ఆరుగురిలో ఏకంగా నలుగురు డేంజర్ జోన్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. వీరిలో ఇద్దరు ఎలిమినేట్ కానున్నారని టాక్.
Bigg Boss 8 Telugu Double Elimination This Week: బిగ్ బాస్ తెలుగు 8 సీజన్ రోజు రోజుకీ మరింత ఉత్సాహంగా, ఇంట్రెస్టింగ్‌గా సాగుతోంది. ఇప్పటికే హౌజ్‌లో 12 మంది సెలబ్రిటీలు వైల్డ్ కార్డ్ ద్వారా రానున్నారని బిగ్ బాస్ చెప్పిన విషయం తెలిసిందే. వారిని ఆపేందుకు ప్రస్తుతం ఉన్న హౌజ్‌మేట్స్ ఫిట్టెస్ట్ ఆఫ్ ది సర్వైవల్ ఛాలెంజ్‌లు గెలవాల్సిందిగా చెప్పారు.
9 వైల్డ్ కార్డ్స్
ఇలా ఇచ్చిన 5 ఫిట్టెస్ట్ ఆఫ్ ది సర్వైవల్ ఛాలెంజ్స్‌లో నిఖిల్ క్లాన్ రెండు గెలవగా.. సీత క్లాన్ ఒకటి గెలిచింది. మిగతా రెండు ఫెయిల్ అయిపోయాయి. దీంతో 12 వైల్డ్ కార్డ్ ఎంట్రీల్లో కేవలం ముగ్గురుని మాత్రమే ఆపగలిగారు ప్రస్తుతం ఉన్న 11 మంది కంటెస్టెంట్స్. ఐదో టాస్క్‌తో సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్ ఛాలెంజ్ ముగిసిపోయినట్లు బిగ్ బాస్ చెప్పాడు. అంటే, హౌజ్‌లోకి 9 మంది ఎంట్రీ వస్తారని చెప్పకనే చెప్పాడు బిగ్ బాస్.
ఈ నేపథ్యంలోనే బిగ్ బాస్ తెలుగు 8 నాలుగో వారం ఎలిమినేషన్‌లో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ వారం ఏకంగా ఒక్కరు కాకుండా ఇద్దరు డబుల్ ఎలిమినేషన్ ద్వారా వెళ్లే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది. వచ్చే రెండు మూడు వారాల్లో వైల్డ్ కార్డ్ ద్వారా 9 మంది కంటెస్టెంట్స్ రావాలంటే ప్రస్తుతం హౌజ్‌లో నుంచి ముగ్గురు నుంచి నలుగురిని బయటకు పంపించాలని బీబీ టీమ్ ఆలోచిస్తుందట.
ఈ వారం డబుల్ ఎలిమినేషన్
అందుకే, వచ్చేవారం కంటే ఈ వారమే డబుల్ ఎలిమినేషన్ ఉండనుందని సమాచారం. ఇదిలా ఉంటే, మొదటి రోజుతో పోలిస్తే వీకెండ్ వచ్చేసరికి బిగ్ బాస్ ఓటింగ్ తారుమారు అయింది. తొలి రోజు నుంచి టాప్‌లో దూసుకుపోతున్న నబీల్ అదే స్థానంలో ఉన్నాడు. కానీ, రెండో స్థానంలో ఉన్న నాగ మణికంఠ మూడో స్థానానికి పడిపోయాడు.
అలాగే, మూడో స్థానంలో ఉన్న ప్రేరణ రెండో స్థానంలోకి వచ్చేసింది. ఇక అన్‌అఫీషియల్ ఓట్లల్లో నాలుగో స్థానంలో కొనసాగిన ఆదిత్య ఓం అఫిషియల్ ఓట్లల్లో చివరి స్థానంలో ఉన్నాడని సమాచారం. ఇక పృథ్వీకి మంచి ఓటింగ్ నమోదు అవుతోందని టాక్. అయితే, సోనియాకు మాత్రం చాలా తక్కువగా ఓట్లు వేస్తున్నారని తెలుస్తోంది.
డేంజర్‌లో నలుగురు
అయితే, అతి తక్కువ ఓట్లతో చివరి మూడు స్థానాల్లో పృథ్వీ, సోనియా, ఆదిత్య ఓం ఉన్నారని సమాచారం. ఈ ముగ్గురు డేంజర్ జోన్‌లో ఉన్నారని టాక్. వీరిలో అధికంగా ఆదిత్యం ఓం ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఎక్కువ అని బిగ్ బాస్ వర్గాల నుంచి వచ్చిన సమాచారం. ఇక డబుల్ ఎలిమినేషన్ ఉంటే.. ఆదిత్యతోపాటు సోనియా కూడా ఎలిమినేట్ కానుందని టాక్.
ఇదే పూర్తిగా నమ్మలమేని, ఈ ఇద్దరితోపాటు నాగ మణికంఠ, పృథ్వీ కూడా ఉన్నారని అధికారిక ఓటింగ్ లెక్కలను బట్టి వస్తోన్న టాక్. ఇలా నామినేషన్స్‌లో ఉన్న ఆరుగురిలో నబీల్, ప్రేరణ తప్ప పృథ్వీ, నాగ మణికంఠ, సోనియా, ఆదిత్య ఓం డేంజర్ జోన్‌లో ఉన్నారట. డబుల్ ఎలిమినేషన్ ఉంటే.. ఆదిత్య, సోనియా బయటకు వెళ్లే ఛాన్స్ ఉందని తెలుస్తోంది.