Bigg Boss Vishnupriya: యాంకర్ విష్ణుప్రియ బట్టలు మార్చుకునేప్పుడు చూసిన హీరో ఆదిత్య ఓం.. కక్ష కట్టిన సోనియా!-bigg boss telugu 8 sonia says aditya om saw vishnupriya changing clothes after bigg boss 8 telugu 2nd week nominations ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Bigg Boss Vishnupriya: యాంకర్ విష్ణుప్రియ బట్టలు మార్చుకునేప్పుడు చూసిన హీరో ఆదిత్య ఓం.. కక్ష కట్టిన సోనియా!

Bigg Boss Vishnupriya: యాంకర్ విష్ణుప్రియ బట్టలు మార్చుకునేప్పుడు చూసిన హీరో ఆదిత్య ఓం.. కక్ష కట్టిన సోనియా!

Sanjiv Kumar HT Telugu
Sep 11, 2024 11:59 AM IST

Bigg Boss Telugu 8 Vishnupriya Vs Sonia: బిగ్ బాస్ తెలుగు 8 రెండో వారం నామినేషన్స్‌లో యాంకర్ విష్ణుప్రియ బట్టలు వేసుకోవడంపై పర్సనల్ అటాక్ చేసింది సోనియా. తర్వాత విష్ణుప్రియ బట్టలు మార్చుకునే సమయంలో ఆదిత్య వెళ్లినట్లు, అప్పుడు అతను డిస్‌కంఫర్ట్ అయ్యేలా విష్ణుప్రియ చేసినట్లు సోనియా చాడీలు చెప్పింది.

యాంకర్ విష్ణుప్రియ బట్టలు మార్చుకోంగా చూసిన హీరో ఆదిత్య ఓం.. కక్ష్య కట్టిన సోనియా!
యాంకర్ విష్ణుప్రియ బట్టలు మార్చుకోంగా చూసిన హీరో ఆదిత్య ఓం.. కక్ష్య కట్టిన సోనియా!

Bigg Boss 8 Telugu Vishnupriya: బిగ్ బాస్ తెలుగు 8 సెప్టెంబర్ 10వ తేది ఎపిసోడ్‌లో రెండో వారం నామినేషన్స్‌లో ప్రక్రియ పూర్తయింది. ఈ వారం కూడా రెండు రోజుల పాటు నామినేషన్స్ జరిగాయి. మొదటి రోజు కంటే రెండో రోజు నామినేషన్స్‌లో పెద్దగా పస లేదు. అయితే, మొదటి రోజు నామినేషన్స్‌లో యాంకర్ విష్ణుప్రియపై సోనియా ఆకుల చేసిన కామెంట్స్ తెగ వైరల్ అయ్యాయి.

క్యారెక్టర్ అసానినేషన్

యాంకర్ విష్ణుప్రియకు బట్టలు వేసుకోవడం కూడా తెలియదని, దానివల్ల మిగతా హౌజ్‌మేట్స్ డిస్‌కంఫర్ట్ ఫీల్ అయ్యారని, అడల్ట్స్ జోక్స్ వేస్తుందని, అందుకోసమే తనను బిగ్ బాస్ షోకి తీసుకున్నారని, తనను మాత్రం అందుకు తీసుకోలేదని, తనపై చేసిన కామెంట్స్ తన ఫ్యామిలీ చూస్తుందని, విష్ణుప్రియకు ఫ్యామిలీ లేదని చాలా పర్సనల్ అటాక్ చేస్తూ క్యారెక్టర్ అసాసినేషన్ (వ్యక్తిత్వంపై నిందలు వేయడం) చేసింది సోనియా ఆకుల.

నామినేషన్స్ పూర్తయిన తర్వాత కూడా ఇదే టాపిక్ కొనసాగింది. విష్ణుప్రియ వల్ల డిస్‌కంఫర్ట్ ఫీల్ అయింది హీరో ఆదిత్యం ఓం అని నిఖిల్, అభయ్ నవీన్‌కు చెప్పింది సోనియా. విష్ణుప్రియ బ్లౌజ్ మార్చుకుని, జాకెట్‌లో ఉంది. విష్ణుప్రియ గదిలోకి వచ్చిన సడెన్‌గా వచ్చిన ఆదిత్య ఓం తనను చూసి వణికిపోయి బయటకు వెళ్లిపోయారని సోనియా చెప్పింది.

కావాలనే వేస్తుంది

"అప్పుడు ఆదిత్యతో మిమ్మల్ని డిస్‌కంఫర్ట్ చేస్తున్నాను.. సారీ అనుకుంటూ అతనితో విష్ణుప్రియ మాట్లాడి మరింత డిస్‌కంఫర్ట్ చేసింది. ఆదిత్య గారు కూడా చెప్పారు కదా. నేను కావాలనే తన అడల్టరీ జోక్స్ వేస్తుందని అన్నాను. అందుకే తను వేసే జోక్స్ తీసుకోలేదు" అని నిఖిల్, అభయ్‌‌తో చెప్పుకొచ్చింది సోనియా.

ఇదంతా మంగళవారం (సెప్టెంబర్ 10) నాటి ఎపిసోడ్‌లో చూపించలేదు. కానీ, లైవ్‌లో టెలీకాస్ట్ అయింది. ఇవాళ అది టెలీకాస్ట్ చేస్తారో చూడాలి. అయితే, విష్ణుప్రియపై సోనియా చాడీలు చెప్పడాన్ని పలువురు రివ్యూవర్స్ ఖండిస్తున్నారు. కావాలనే విష్ణుప్రియపై కక్ష కట్టి తప్పుగా చూపించే ప్రయత్నం చేస్తుందని వివరిస్తున్నారు. ఈ క్రమంలోనే సోనియా మాట్లాడిన వీడియోలను ఇన్‌స్టా స్టోరీల్లో ఆధారాలుగా పోస్ట్ చేస్తున్నారు.

మెచ్యూర్‌గా మాట్లాడారు

విష్ణుప్రియ చీర మార్చుకునేటప్పుడు ఆదిత్య ఓం సెడన్‌గా వెళ్లారని, అలా వెళ్లినందుకు వెంటనే బయటకు వెళ్లారని, అంతేకానీ, దానికి ఆదిత్యం వణికిపోలేదని రివ్యూవర్స్ చెబుతున్నారు. ఆదిత్య ఓం సడెన్‌గా వచ్చి చూడటం కూడా విష్ణుప్రియ తప్పు అన్నట్లుగా సోనియా చూపిస్తుందని చెబుతున్నారు. ఇదే విషయంపై సోనియా కంటే వయసులో చిన్నవాళ్లైనా నైనిక, ప్రేరణ ఎంత మెచ్యుర్‌గా మాట్లాడారో కూడా వీడియోలు షేర్ చేస్తున్నారు.

"సాధారణంగానే ఆదిత్య గారు ఆడవాళ్లతో డిస్‌కంఫర్ట్ ఉంటారు. ఇలా జరిగే సరికి ఇంకాస్తా ఎక్కువ ఫీల్ అయింటారు కానీ, డిస్‌కంఫర్ట్ కాదు" అని విష్ణుప్రియతో ప్రేరణ అంటే.. "అసలు నామినేట్ చేయాల్సిన పాయింటే కాదు" అని నైనిక చెప్పింది.

ఇవే కాకుండా నామినేషన్స్‌లో విష్ణుప్రియపై సోనియా చేసిన పర్సనల్ కామెంట్స్ ఎందుకు టెలీకాస్ట్ చేయలేదని స్టార్ మాను ప్రశ్నిస్తున్నారు రివ్యూవర్స్. తెలుగులో మంచి ఫేమ్ ఉన్న విష్ణుప్రియను కావాలని తప్పు పట్టించడానికే సోనియా ఇలా చేస్తుందని చెబుతున్నారు.