Anchor Vishnupriya: ప్రేమించమని అడుక్కున్న యాంకర్ విష్ణుప్రియ.. పరువు తీసేసిన సీరియల్ నటుడు.. వీడియో షేర్ చేసిన ఓటీటీ-bigg boss telugu 8 anchor vishnupriya love proposal to prithviraj in bigg boss 8 telugu nominations highlights ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Anchor Vishnupriya: ప్రేమించమని అడుక్కున్న యాంకర్ విష్ణుప్రియ.. పరువు తీసేసిన సీరియల్ నటుడు.. వీడియో షేర్ చేసిన ఓటీటీ

Anchor Vishnupriya: ప్రేమించమని అడుక్కున్న యాంకర్ విష్ణుప్రియ.. పరువు తీసేసిన సీరియల్ నటుడు.. వీడియో షేర్ చేసిన ఓటీటీ

Sanjiv Kumar HT Telugu
Sep 05, 2024 11:47 AM IST

Bigg Boss Telugu 8 Anchor Vishnupriya: సీరియల్ నటుడిని ప్రేమించమని దాదాపుగా అడుక్కునేంత పని చేసింది యాంకర్ విష్ణుప్రియ. ఇదంతా ఇటీవల ప్రారంభం అయిన బిగ్ బాస్ తెలుగు 8 సీజన్‌లో జరిగింది. తనను ప్రేమించమని అడిగినందుకు సీరియల్ యాక్టర్ ఇచ్చిన సమాధానం యాంకర్ విష్ణుప్రియ పరువు పోయేలా చేసింది.

ప్రేమించమని అడుక్కున్న యాంకర్ విష్ణుప్రియ.. పరువు తీసేసిన సీరియల్ నటుడు.. వీడియో షేర్ చేసిన ఓటీటీ
ప్రేమించమని అడుక్కున్న యాంకర్ విష్ణుప్రియ.. పరువు తీసేసిన సీరియల్ నటుడు.. వీడియో షేర్ చేసిన ఓటీటీ

Anchor Vishnupriya Love Proposal: బిగ్ బాస్ తెలుగు 8 సీజన్ సెప్టెంబర్ 1న చాలా గ్రాండ్‌గా ప్రారంభం అయింది. బిగ్ బాస్ 8 తెలుగు హౌజ్‌లోకి మొత్తంగా 14 మంది కంటెస్టెంట్స్ అడుగుపెట్టారు. ఎంట్రీతోనే హౌజ్‌లో గొడవలు మొదలు అయ్యాయి. నామినేషన్స్ కంటే ముందుగానే మనస్పర్థలతో రచ్చ రచ్చ చేశారు కంటెస్టెంట్స్.

దృష్టిలో పడతాం అన్నట్లుగా

పప్పులో కారం ఎక్కువైందని, గుడ్డి ఇవ్వలేదని, ఆమ్లెట్ వేసుకోనివ్వలేదని గత సీజన్ల మాదిరిగానే సిల్లీ కారణాలతో జోరుగా గొడవ పెట్టుకున్నారు. గొడవ పడితేనే ప్రేక్షకుల్లో, బిగ్ బాస్ టీమ్‌ దృష్టిలో పడతాం అన్నట్లుగా ఒకరిమీద మరకొరు విరుచుకుపడ్డారు. ఇక మొదటి వారం నామినేషన్లలో అయితే ఇవే కారణాలతోపాటు మరికొన్ని జోడించి మరింత రచ్చ చేశారు.

ఇక బిగ్ బాస్ అంటేనే గొడవలు, అరుపులు కేకలు, లవ్ ట్రాక్‌లు. ఇప్పటివరకు గొడవలు సాగాయి. ఇక తక్కువైన లవ్ ట్రాక్ కూడా‌కు శ్రీకారం చుట్టేశారు. సెప్టెంబర్ 3వ తేది ఎపిసోడ్‌లో నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. నామినేషన్ల మధ్యలో చిన్న బ్రేక్ ఇచ్చారు. ఈ గ్యాప్‌లో తనను లవ్ చేయొచ్చు కదా అని ప్రాధేయపడింది యాంకర్ విష్ణుప్రియ.

అన్ని చేసి పెడుతున్నాగా..

కిచెన్‌లో సీరియల్ యాక్టర్ పృథ్వీరాజ్‌కు కాఫీ కలిపి ఇచ్చింది యాంకర్ విష్ణుప్రియ. నన్ను ప్రేమించొచ్చు కదా అని దీనంగా అడుక్కుంది యాంకర్ విష్ణుప్రియ. కాఫీ కలిపి ఇచ్చినందుకే నిన్ను ప్రేమించాలా అని విష్ణుప్రియను పైనుంచి కిందకు చూశాడు పృథ్వీరాజ్. దాంతో నవ్వేసిన విష్ణుప్రియ.. ఒక్క కాఫీనేనా, నీకు అన్ని చేసి పెడుతున్నాను.. ఎందుకు.. ఇందాక యాపిల్ ముక్కలు కోసి ఇచ్చా అని అలకతో చెప్పింది.

కానీ, అదేం పృథ్వీరాజ్ మాత్రం పెద్దగా పట్టించుకోకుండా వెళ్లిపోయాడు. దాంతో అడిగి మరి ప్రేమించమని అడుక్కున్న విష్ణుప్రియ పరువు తీసేశాడు పృథ్వీరాజ్. దీనికి సంబంధించిన వీడియోను డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీ షేర్ చేసింది. దీంతో అది వైరల్ గా మారింది.

అయితే, ఇప్పుడు పృథ్వీరాజ్ ఊరుకున్న ముందు ముందు హౌజ్‌లో లవ్ ట్రాక్ నడిపేంచేలా ఉన్నట్లు తెలుస్తోంది. ఇదివరకు గత సీజన్స్‌లో కూడా లవ్ ట్రాక్స్ బిగ్ బాస్‌ షోకు బాగా హెల్ప్ అయ్యాయి.

బడ్డీస్‌గా ఎంట్రీ

మరి ఈ సారి ఈ సీజన్‌లో ఎన్ని జంటలు లవ్ ట్రాక్ నడిపిస్తారో చూడాలి. అంతేకాకుండా బిగ్ బాస్ తెలుగు 8లో కంటెస్టెంట్స్ అందరూ బడ్డీ అనే టైటిల్‌తో జోడీలుగా ఎంట్రీ ఇచ్చారు. అది కూడా ఒక ఆడ, ఒక మగతో మొత్తం ఏడు జంటలు హౌజ్‌లోకి అడుగుపెట్టాయి. అందులో భాగంగానే విష్ణుప్రియ, పృథ్వీరాజ్ ఒక బడ్డీ జోడీగా హౌజ్‌లోకి వెళ్లారు.

పృథ్వీరాజ్ 11వ కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇస్తే.. తనకు బడ్డీగా 12వ ఇంటి సభ్యురాలిగా విష్ణుప్రియ వచ్చింది. ఇదిలా ఉంటే, బిగ్ బాస్ తెలుగు 8 ఫస్ట్ వీక్ నామినేషన్స్‌లో మొత్తం ఆరుగురు కంటెస్టెంట్స్ ఉన్నారు. వారిలో విష్ణుప్రియ, పృథ్వీరాజ్, బెజవాడ బేబక్క, శేఖర్ బాషా, నాగ మణికంఠ, సోనియా ఆకుల రెండు కంటే ఎక్కువ ఓట్లతో నామినేషన్‌లో ఉన్నారు.