Andhra Pradesh News Live September 26, 2024: AP Liquor Shops : ప్రభుత్వ మద్యం షాపులు రద్దు..! ఆర్డినెన్స్‌ జారీ-today andhra pradesh news latest updates september 26 2024 ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Andhra Pradesh News Live September 26, 2024: Ap Liquor Shops : ప్రభుత్వ మద్యం షాపులు రద్దు..! ఆర్డినెన్స్‌ జారీ

AP Liquor Shops : ప్రభుత్వ మద్యం షాపులు రద్దు..! ఆర్డినెన్స్‌ జారీ

Andhra Pradesh News Live September 26, 2024: AP Liquor Shops : ప్రభుత్వ మద్యం షాపులు రద్దు..! ఆర్డినెన్స్‌ జారీ

05:01 PM ISTSep 26, 2024 10:31 PM HT Telugu Desk
  • Share on Facebook
05:01 PM IST

ఆంధ్ర ప్రదేశ్ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.

Thu, 26 Sep 202405:01 PM IST

Andhra Pradesh News Live: AP Liquor Shops : ప్రభుత్వ మద్యం షాపులు రద్దు..! ఆర్డినెన్స్‌ జారీ

  • ఏపీలో ప్రభుత్వ మద్యం షాపులు రద్దు చేస్తూ ఆర్డినెన్స్ జారీ అయింది. రిటైల్‌ లిక్కర్‌ షాపులకు అనుమతిస్తూ చట్ట సవరణ చేసింది. ఈ మేరకు గురువారం ఉత్తర్వులు ఇచ్చింది. త్వరలోనే నూతన మద్యం విధానం అమల్లోకి రానుంది.
పూర్తి స్టోరీ చదవండి

Thu, 26 Sep 202402:55 PM IST

Andhra Pradesh News Live: Tirupati District : తిరుపతి జిల్లా వ్యాప్తంగా సెక్షన్ 30 యాక్ట్ - సభలు, ర్యాలీలపై ఆంక్షలు, పోలీసులు కీలక ప్రకటన

  • తిరుపతి జిల్లా వ్యాప్తంగా సెక్షన్ 30 పోలీసు యాక్ట్ అమల్లోకి వచ్చింది. అక్టోబర్ 24వ తేదీ వరకు ఈ యాక్ట్ అమల్లో ఉంటుందని జిల్లా పోలీసులు ప్రకటించారు. పోలీసుల అనుమతి తర్వాతే ర్యాలీలు, ఊరేగింపులు, సభలు చేపట్టాలని స్పష్టం చేశారు.
పూర్తి స్టోరీ చదవండి

Thu, 26 Sep 202412:33 PM IST

Andhra Pradesh News Live: Tirumala Laddu Row : దేవుడి జోలికెళ్తే ఏమవుతుందో.. జగన్ ఎన్నికల్లో చూశారు: నారా లోకేష్

  • Tirumala Laddu Row : తిరుమల లడ్డూ వివాదంపై మంత్రి నారా లోకేష్ స్పందించారు. దేవుడి జోలికెళ్తే ఏమవుతుందో.. జగన్ ఎన్నికల్లో చూశారని వ్యాఖ్యానించారు. అన్ని మతాలను గౌరవించాలన్నారు. ఉత్తరాంధ్రలో పర్యటించిన లోకేష్.. మీడియాతో మాట్లాడుతూ.. ఈ వ్యాఖ్యలు చేశారు.
పూర్తి స్టోరీ చదవండి

Thu, 26 Sep 202412:30 PM IST

Andhra Pradesh News Live: NMMS Scholarship 2024 : నేషనల్ మెరిట్ స్కాలర్‌షిప్స్ - దరఖాస్తుల గడువు పొడిగింపు, ఎంపికైతే రూ. 48 వేలు

  • ఎన్ఎంఎంఎస్ స్కాల‌ర్ షిప్స్‌ ద‌ర‌ఖాస్తు గడువును పొడిగించారు.  అర్హులైన విద్యార్థులు అక్టోబ‌ర్ 3 వ‌ర‌కు అప్లికేషన్ చేసుకోవచ్చని ఏపీ ప్రభుత్వ పరీక్షల కార్యాలయం సంచాలకులు డి. దేవానంద రెడ్డి ఆదేశాలు ఇచ్చారు. ఈ స్కాలర్ షిప్స్ కు ఎంపికైన విద్యార్థుల‌కు మొత్తం రూ.48 వేలు అందుతాయి.
పూర్తి స్టోరీ చదవండి

Thu, 26 Sep 202410:33 AM IST

Andhra Pradesh News Live: Tirumala Laddu Row : పవన్‌ కల్యాణ్ బెదిరింపులకు భయపడేది లేదు: పేర్ని నాని

  • Tirumala Laddu Row : తిరుమల లడ్డూ వ్యవహారం ఏపీ రాజకీయాలను కుదిపేస్తోంది. కూటమి ప్రభుత్వం, వైసీపీ మధ్య డైలాగ్ వార్ ముదురుతోంది. తాజాగా.. మాజీమంత్రి పేర్ని నాని పవన్ కల్యాణ్‌పై ఫైర్ అయ్యారు. అటు పేర్ని నాని ఇంటిని జనసేన కార్యకర్తలు ముట్టడించారు. దీంతో హెటైన్షన్ నెలకొంది.
పూర్తి స్టోరీ చదవండి

Thu, 26 Sep 202409:36 AM IST

Andhra Pradesh News Live: APSRTC Dasara Special Buses 2024 : ప్రయాణికులకు ఆర్టీసీ గుడ్ న్యూస్ - అక్టోబరు 3 నుంచి దసరా ప్రత్యేక బస్సులు

  • దసరా పండకు వెళ్లే ప్రయాణికుల కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులను సిద్ధం చేస్తోంది. ఈసారి 900కు ప్రత్యేగా స్పెషల్ బస్సులను నడపాలని నిర్ణయించింది. అక్టోబర్ 3వ తేదీ నుంచి ఈ బస్సులు అందుబాటులోకి రానున్నాయి. గతేడాది  దసరా ప్రత్యేక సర్వీసుల ద్వారా ఆర్టీసికి రూ.2. 35 కోట్ల ఆదాయం వచ్చిన సంగతి తెలిసిందే.
పూర్తి స్టోరీ చదవండి

Thu, 26 Sep 202409:19 AM IST

Andhra Pradesh News Live: Anakapalle : సాగునీటి కోసం క‌త్తుల‌తో దాడి.. భార్య మృతి, భ‌ర్త‌కు తీవ్ర గాయాలు

  • Anakapalle : అనకాప‌ల్లి జిల్లాలో ఘోరం జరిగింది. సాగునీటి కోసం బంధువుల మ‌ధ్య వివాదం నెలకొంది. అది కాస్తా క‌త్తిపోట్ల‌కు దారి తీసింది. ఈ ఘ‌ట‌న‌లో భార్య మృతి చెంద‌గా.. భ‌ర్త‌కు తీవ్ర గాయాలు అయ్యాయి.
పూర్తి స్టోరీ చదవండి

Thu, 26 Sep 202408:27 AM IST

Andhra Pradesh News Live: Bar Coucil Rules: లా డిగ్రీ ఇకపై సులువు కాకపోవచ్చు… బార్‌ కౌన్సిల్ ఆఫ్‌ ఇండియా కీలక నిర్ణయాలు

  • Bar Coucil Rules: దేశంలో న్యాయవిద్యలో మెరుగైన ప్రమాణాలు సాధించడానికి బార్‌ కౌన్సిల్ ఆఫ్‌ ఇండియా కీలక సంస్కరణల్ని అమలు చేయాలని నిర్ణయించారు. ఇకపై నేర చరితులను బార్ అసోసియేషన్లలో నమోదు చేయకుండా  వడపోత నిర్వహిస్తారు. బార్ కౌన్సిల్ అనుమతి లేకుండా అలాంటి వారిని  అనుమతించకూడదని నిర్ణయించారు. 
పూర్తి స్టోరీ చదవండి

Thu, 26 Sep 202408:09 AM IST

Andhra Pradesh News Live: Insurance Adalat: బుడమేరు వరదల్లో పాడైన వాహనాల క్లెయిమ్ పరిష్కారం కోసం ఇన్సూరెన్స్ అదాలత్

  • Insurance Adalat: బుడమేరు వరదల వల్ల విజయవాడ నగరంలోని పలు ప్రాంతాలు జలమయం కావడంతో దెబ్బతిన్న మోటారు వాహనాల భీమా క్లెయిమ్‌ల  పరిష్కారానికి అక్టోబర్‌ 1 నుండి 7 వరకు విజయవాడలో ఇన్సూరెన్సు లోక్ అధాలత్ ను నిర్వహించనున్నారు. 
పూర్తి స్టోరీ చదవండి

Thu, 26 Sep 202407:25 AM IST

Andhra Pradesh News Live: KimS Bollineni: టీడీపీ నాయకుడు బొల్లినేని కృష్ణయ్యపై ఫోర్జరీ, క్రిమినల్ కేసు నమోదు, రెండో భార్య ఫిర్యాదు

  • KimS Bollineni Krishniah: టీడీపీ నాయకుడు, హైదరాబాద్‌ కిమ్స్‌ హాస్పటల్ అధినేత బొల్లినేని కృష్ణయ్యపై ఆయన రెండో భార్య ఇచ్చిన ఫిర్యాదుతో క్రిమినల్ ఫోర్జరీ కేసులు నమోదయ్యాయి. రెండో భార్య సంతానాన్నిమరొకరి సంతానంగా చూపారనే అభియోగాలపై హైదరాబాద్‌ పోలీసులు కేసులు నమోదు చేశారు. 
పూర్తి స్టోరీ చదవండి

Thu, 26 Sep 202406:00 AM IST

Andhra Pradesh News Live: AP High Court: పిల్‌ ఉద్దేశాలపై ఏపీ హైకోర్టు సందేహం, లక్ష డిపాజిట్‌ చేయాలని పిటిషనర్‌కు ఆదేశం…

  • AP High Court: అపార్ట్‌మెంట్ నిర్మాణంలో అక్రమాలు జరిగాయంటూ ఏపీ హైకోర్టులో దాఖలైన పిటిషన్ విచారణ సందర్భంగా చీఫ్‌ జస్టిస్ ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రజాప్రయోజనం ఉద్దేశాలపై సందేహాలు వ్యక్తం చేసిన ధర్మాసనం పిటిషన్‌ తప్పని తేలితే భారీ జరిమానా తప్పదని హెచ్చరించింది. 
పూర్తి స్టోరీ చదవండి

Thu, 26 Sep 202405:08 AM IST

Andhra Pradesh News Live: Vangaveeti Radha: వంగవీటి రాధాకు అస్వస్థత.. ఛాతీ నొప్పితో ఆస్పత్రిలో చేరిక

  • Vangaveeti Radha: విజయవాడకు చెందిన ప్రముఖ నాయకుడు వంగవీటి రాధాకృష్ణ అస్వస్థతకు గురయ్యారు. దివంగత వంగవీటి రంగా కుమారుడు రాధాకృష్ణా కొంతకాలంగా  టీడీపీలో ఉన్నారు. 2019 ఎన్నికలకు ముందు వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు.ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాధా ఎప్పుడూ బయట కనిపించలేదు. 
పూర్తి స్టోరీ చదవండి

Thu, 26 Sep 202403:57 AM IST

Andhra Pradesh News Live: Chittoor : చిత్తూరు జిల్లాలో రోడ్డు ప్ర‌మాదం.. ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన మ‌రో లారీ.. మంట‌ల్లో ఒక‌రు స‌జీవ ద‌హ‌నం

  • Chittoor : చిత్తూరు జిల్లాలో రోడ్డు ప్ర‌మాదం జరిగింది. ప్ర‌మాదాల‌కు కేరాఫ్‌ అడ్రస్‌గా మారిన మొగ‌లి ఘాట్ రోడ్డు మ‌ళ్లీ నెత్తురోడింది. నిత్యం ర‌ద్దీగా ఉండే బెంగ‌ళూరు- చెన్నై జాతీయ ర‌హ‌దారిలో.. మొగ‌లి ఘాట్ రోడ్డు వద్ద‌ జ‌రిగిన ప్ర‌మాదంలో ఇద్ద‌రు ప్రాణాలు కోల్పోయారు. 
పూర్తి స్టోరీ చదవండి

Thu, 26 Sep 202412:28 AM IST

Andhra Pradesh News Live: Flood Relief Released: ముంపు బాధితుల ఖాతాలకు చేరిన వరద సాయం.. ఎలా తెలుసుకోవాలంటే?

  • Flood Relief Released: ఏపీ ప్రభుత్వం వరద బాధితులకు ప్రకటించిన పరిహారం బాధితుల ఖాతాలకు చేరుతోంది. బుధవారం ఉదయం విజయవాడలో రూ.600కోట్ల వరద సాయాన్ని ముఖ్యమంత్రి విడుదల చేయగా సాయంత్రం నుంచి  వరద ముంపు బాధితుల ఖతాలకు నిర్దేశిత మొత్తం  జమ అవుతోంది.గురువారం నగదు అందుకున్న వారికి ధృవీకరణ సందేశాలు పంపుతారు. 
పూర్తి స్టోరీ చదవండి