Insurance Adalat: బుడమేరు వరదల్లో పాడైన వాహనాల క్లెయిమ్ పరిష్కారం కోసం ఇన్సూరెన్స్ అదాలత్-insurance adalat for claim settlement of vehicles damaged in budameru floods ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Insurance Adalat: బుడమేరు వరదల్లో పాడైన వాహనాల క్లెయిమ్ పరిష్కారం కోసం ఇన్సూరెన్స్ అదాలత్

Insurance Adalat: బుడమేరు వరదల్లో పాడైన వాహనాల క్లెయిమ్ పరిష్కారం కోసం ఇన్సూరెన్స్ అదాలత్

Insurance Adalat: బుడమేరు వరదల వల్ల విజయవాడ నగరంలోని పలు ప్రాంతాలు జలమయం కావడంతో దెబ్బతిన్న మోటారు వాహనాల భీమా క్లెయిమ్‌ల పరిష్కారానికి అక్టోబర్‌ 1 నుండి 7 వరకు విజయవాడలో ఇన్సూరెన్సు లోక్ అధాలత్ ను నిర్వహించనున్నారు.

ఇన్సూరెన్స్‌ క్లెయిమ్స్‌ కోసం అదాలత్‌

Insurance Adalat: సెప్టెంబర్‌ మొదటి వారంలో విజయవాడను ముంచెత్తిన బుడమేరు వరదలలో నగరంలోని పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి. వరదల కారణంగా దెబ్బతిన్న మోటారు వాహనాల భీమా క్లెయిముల సత్వర పరిష్కారం కోసం అక్టోబర్ నెల 1 నుండి 7 వరకు విజయవాడలో ఇన్సూరెన్సు లోక్ అధాలత్ ను నిర్వహించనున్నట్టు ఏపీ న్యాయ సేవాసాధికార సంస్థ ప్రకటించింది.

వరధ బాదితులు అందరూ ఈ అధాలత్ ను సద్వినియోగం చేసుకోవాలని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర న్యారు సేవాధికార సంస్థ మెంబర్ సెక్రటరీ (డిస్ట్రిక్టు అండ్ సెషన్స్ జడ్జి) ఎమ్.బబిత విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ కార్యాలయంలో భీమా కంపెనీలు, ఆటోమొబైల్ బాడీ షాప్స్ మరియు ఆటో డ్రైవర్ల అసోషియేషన్ ప్రతినిధులతో వారు సమావేశం నిర్వహించారు.

మోటారు వాహనాల భీమా క్లైమ్ల సత్వర పరిష్కార అంశంలో ఎదురవుతున్న పలు సమస్యలు వాటి పరిష్కారానికై తీసుకుంటున్న చర్యలపై చర్చించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ఉన్నత న్యాయ స్థానం ప్రధాన న్యాయమూర్తి, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ప్యాట్రన్ ఇన్ చీఫ్ జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ మరియు కార్య నిర్వాహాక అధ్యక్షులు, న్యాయమూర్తి జస్టిస్ జి.నరేందర్ గారి ఆదేశాల మేరకు ఈ ఇన్సూరెన్సు లోక్ అధాలత్ ను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

గతంలో ఎన్నడూలేని విధంగా బుడమేరు వరదలవల్ల వారం రోజుల పాటు విజయవాడ నగరం అస్తవ్యస్తం అయిపోందని వివరించారు. ఇది ఎవరూ ఊహించని ప్రకృతి విపత్తు అని, ఈ విపత్తు వల్ల ఎన్నో గృహాలు, గృహాప కరణాలు, వాహనాలు జలమయం అవ్వడమే కాకుండా కొంత మంది ప్రాణాలను కోల్పోవడం కూడా జరిగిందన్నారు. రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ తరపున తాము కూడా వరద ముంపుకు గురైన పలు ప్రాంతాల్లో పర్యటించి పునరావాస కేంద్రాల్లో అందజేస్తున్న సహాయక చర్యలను పరిశీలించడం జరిగిందన్నారు.

వరదల వంటి ప్రకృతి వైపరీత్యాల సమయం లో జాతీయ న్యాయ సేవాధికార సంస్థ సూచించిన అనేక న్యాయ సేవలు అందించటానికి తమ సంస్థ కృషి చేస్తుందని వివరించారు. రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ తరపున వరద బాదితులను ఆదుకోవాలనే సంకల్పంతో మోటారు వాహనాల బీమా క్లైమ్ల సత్వర పరిష్కారానికై ఇన్సూరెన్సు లోక్ అధాలత్ ను అక్టోబర్ 1 వ తేదీ నుంచి 7వ తేదీ వరకు విజయవాడ లోని న్యాయస్థాన సముదాయాలలో నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు.

మోటారు వాహనాల బీమా క్లైమ్లకు సంబందించి వచ్చిన దరఖాస్తులు అన్నింటినీ సానుకూలంగా పరిశీలిస్తూ బాదితులకు సాద్యమైనంత మేర మేలు జరిగే విధంగా తగు చర్యలు తీసుకోవాలని బీమా కంపెనీల ప్రతినిధులను ఆమె కోరారు. అదే విధంగా వాహన మరమత్తుల విషయంలో ఆటోమొబైల్ బాడీ షాప్స్ ప్రతినిధుల కూడా సానుకూలంగా స్పందిస్తూ వాహనాల మరమ్మత్తు పనులను సాద్యమైనంత త్వరగా పూర్తి చేయాలని కోరారు.

భీమా క్లెయిములు, వాహన మరమత్తుల విషయంలో సమస్యలు ఏమన్నా ఉంటే వాటి పరిష్కారానికై జాతీయ టోల్ ఫ్రీ నెంబరు 15100 కు ఫోన్ చేసి ఉచిత న్యాయ సేవలు పొందవచ్చన్నారు. జాతీయ న్యాయ సేవాధికార సంస్థ అఫిషియల్ వెబ్ సైట్లో సంబందిత బాదితులు ఫిర్యాధులను నమోదు చేసుకోవచ్చని ఆమె తెలిపారు. భారత రాజ్యాంగం (39-ఎ) ఆర్టికల్ ప్రకారం న్యాయ సేవలను ఉచితంగా అందజేయనున్నారు. మోటారు వాహనాల భీమా క్లైమ్ల పరిష్కారానికి వచ్చే నెల మొదటి వారంలో నిర్వహించే ఇన్సూరెన్సు లోక్ అథాలత్ చక్కని వేదిక అని, ఈ అవకాశాన్ని వరద బాదితులు అందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.