APSRTC Dasara Special Buses 2024 : ప్రయాణికులకు ఆర్టీసీ గుడ్ న్యూస్ - అక్టోబరు 3 నుంచి దసరా ప్రత్యేక బస్సులు-apsrtc dasara special buses from october 3 in andhrapradesh ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Apsrtc Dasara Special Buses 2024 : ప్రయాణికులకు ఆర్టీసీ గుడ్ న్యూస్ - అక్టోబరు 3 నుంచి దసరా ప్రత్యేక బస్సులు

APSRTC Dasara Special Buses 2024 : ప్రయాణికులకు ఆర్టీసీ గుడ్ న్యూస్ - అక్టోబరు 3 నుంచి దసరా ప్రత్యేక బస్సులు

దసరా పండకు వెళ్లే ప్రయాణికుల కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులను సిద్ధం చేస్తోంది. ఈసారి 900కు ప్రత్యేగా స్పెషల్ బస్సులను నడపాలని నిర్ణయించింది. అక్టోబర్ 3వ తేదీ నుంచి ఈ బస్సులు అందుబాటులోకి రానున్నాయి. గతేడాది దసరా ప్రత్యేక సర్వీసుల ద్వారా ఆర్టీసికి రూ.2. 35 కోట్ల ఆదాయం వచ్చిన సంగతి తెలిసిందే.

ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులు

దసరాకు ఊరెళ్తున్నారా..? అయితే ప్రయాణికులకు ఏపీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. గతేడాది కంటే ఈసారి ఎక్కువ ప్రత్యేక బస్సులను నడపాలని నిర్ణయించింది. ఈసారి 960కిపైగా ప్రత్యేక బస్సులను అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించింది. రాష్ట్రం నలమూలల నుంచే కాకుండా… పక్క రాష్ట్రాల్లో ఉన్న ప్రయాణికులను గమ్య స్థానాలకు చేర్చేలా కార్యాచరణను సిద్ధం చేసింది.

శరన్నవరాత్రి ఉత్సవాలు అక్టోబర్ 3 నుంచి ప్రారంభం కానున్నాయి. అక్టోబర్ 12వ తేదీ దసరా పండగ ఉంది. ఇదే రోజుతో శరన్నవరాత్రి ఉత్సవాలు ముగుస్తాయి. ఇక అక్టోబర్ 4వ తేదీ నుంచి విద్యా సంస్థలకు కూడా సెలవులు రానున్నాయి. ఈ నేపథ్యంలో చాలా మంది సొంత గ్రామాలకు వెళ్లేందుకు రెడీ అయిపోతున్నారు. వీరిని గమ్యస్థానాలకు చేర్చే దిశగా ప్రత్యేక బస్సులను సిద్ధం చేసింది. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా అక్టోబర్ 13వ తేదీ వరకు స్పెషల్ బస్సులు సర్వీసులు అందిచనున్నాయి.

గతేాడాది మాదిరిగానే ఈసారి హైదరాబాద్ నగరానికి అత్యధికంగా సర్వీసులు నడిపనుంది ఏపీఎస్ఆర్టీసీ. 300కు పైగా ప్రత్యేక బస్సులు సర్వీసులు అందించే అవకాశం ఉంది. బెంగళూరుతో పాటు మరికొన్ని నగరాలకు కూడా ప్రత్యేక బస్సులను అందుబాటులోకి తీసుకురానుంది. గతేడాది దసరా పండగ  వేళ ప్రత్యేక సర్వీసుల ద్వారా రూ.2.35 కోట్ల ఆదాయం సమకూరింది. ఈఏడాది ఎక్కువ సర్వీసులను నడపాలని నిర్ణయించిన నేపథ్యంలో సంస్థకు భారీగానే ఆదాయం వచ్చే అవకాశం ఉంది.

త్వరలోనే దసరా సెలవులు:

ఈ ఏడాది ఏపీలో చూస్తే మొత్తం 10 రోజులు సెలవులు రానున్నాయి. విద్యాశాఖ ప్రకటించిన అకడమిక్ క్యాలెండర్ ప్రకారం అక్టోబర్ 4వ తేదీ నుంచి సెలవులు ప్రారంభమవుతాయి. అక్టోబర్ 13వ తేదీతో ముగుస్తాయి. ఇక అక్టోబర్ 2వ తేదీన గాంధీ జయంతి ఉంది. ఈ రోజు కూడా సెలవు ఉంటుంది. మధ్యలో మూడో తేదీ మినహాయిస్తే… అక్టోబర్ 13వ తేదీ వరకు హాలీ డేస్ ఉంటాయి. తిరిగి అక్టోబర్ 14వ తేదీన అంటే సోమవారం స్కూళ్లు, కాలేజీలు పునఃప్రారంభమవుతాయి. అయితే 3వ తేదీన కూడా సర్కార్ సెలవు ఇస్తే… 13 రోజుల పాటు హాలీ డేస్ వస్తాయి. దసరా సెలవులపై ఏపీ సర్కార్ నుంచి అధికారికంగా ప్రకటన రానుంది.

ఇక వచ్చే అక్టోబ‌ర్ నెల‌లోనే దీపావళి పండగ కూడా రాబోతుంది. అక్టోబర్ 31వ తేదీన దీపావళి ఉండటంతో ఆ రోజు రాష్ట్రంలోని అన్ని స్కూల్స్‌, కాలేజీల‌కు సెల‌వు ఉండనుంది. ఇక మైనారిటీ విద్యా సంస్థలకు క్రిస్మస్ సెలవులు డిసెంబరు 22 నుంచి 29 వరకు ఇవ్వనున్నారు. సంకాంత్రి సెలవులు చూస్తే… 2025 జనవరి 10 నుంచి 19 వరకు ఉంటాయి. మైనారిటీ విద్యా సంస్థలకు మాత్రం జనవరి 11 నుంచి 15 వరకు సెలవులు ఇవ్వనున్నారు.