KimS Bollineni: టీడీపీ నాయకుడు బొల్లినేని కృష్ణయ్యపై ఫోర్జరీ, క్రిమినల్ కేసు నమోదు, రెండో భార్య ఫిర్యాదు
KimS Bollineni Krishniah: టీడీపీ నాయకుడు, హైదరాబాద్ కిమ్స్ హాస్పటల్ అధినేత బొల్లినేని కృష్ణయ్యపై ఆయన రెండో భార్య ఇచ్చిన ఫిర్యాదుతో క్రిమినల్ ఫోర్జరీ కేసులు నమోదయ్యాయి. రెండో భార్య సంతానాన్నిమరొకరి సంతానంగా చూపారనే అభియోగాలపై హైదరాబాద్ పోలీసులు కేసులు నమోదు చేశారు.
KimS Bollineni Krishniah: రెండో భార్య సంతానానికి తప్పుడు ధృవీకరణ పత్రాలను సృష్టించారనే అభియోగాలపై టీడీపీ నాయకుడు, కిమ్స్ హాస్పటల్ అధినేత బొల్లినేని కృష్ణయ్యపై హైదరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. కృష్ణయ్య రెండో భార్య ఫిర్యాదుతో ఆయనపై క్రిమినల్ కేసు నమోదు చేశారు.
కృష్ణయ్య రెండో భార్యకు పుట్టిన సంతానాన్ని మెదటి భార్యకు, సమీప బంధువులకు జన్మించినట్లు నకిలీ పత్రాలను సృష్టించారని ఆమె ఆరోపించింది. నకిలీ పత్రాలతో బర్త్ సర్టిఫికెట్లు, పాస్ పోర్టులు పొందారు. ఈ విషయం వెలుగు చూడటంతో రెండో భార్య కృష్ణవేణి రాయదుర్గం పీఎస్‌లో ఫిర్యాదు చేశారు.
బాధితురాలి ఫిర్యాదుతో బొల్లినేని కృష్ణయ్య, లోటస్ హాస్పిటల్ యజమానులు హేమ, ప్రసాద్‌లపై కేసు నమోదు చేశారు. ఈ వ్యవహారం మొత్తం నగరంలో జరిగినట్లు దర్యాప్తులో తేలడంతో కేసును దర్యాప్తును హైదరాబాద్ సీసీఎస్ కు బదిలీ చేశారు.
విశాఖపట్నంకు చెందిన కృష్ణవేణి 2003లో నాంపల్లిలోని మెడ్విన్ ఆస్పత్రిలో పనిచేస్తున్న సమయంలో కిమ్స్ హాస్పిటల్ డైరెక్టర్ కృ ష్ణయ్యతో పరిచయం ఏర్పడింది. తన భార్యకు పిల్లలు పుట్టే అవకాశం లేదంటూ కృష్ణవేణి 2004 ఫిబ్రవరిలో వివాహం చేసుకున్నారని ఆరోపించింది.
పెళ్లైన తర్వాత కొంతకాలం బంజారా హిల్స్‌లో కాపురం పెట్టి త్వరలో బంధువులకు భార్యగా పరిచయం చేస్తానని ఆమెను నమ్మించాడని బాధితురాలు ఆరోపించింది. 2004లో కృష్ణయ్య-కృష్ణవేణిలకు అర్జున్ జన్మించాడు. వారిద్దరూ తల్లిదండ్రులుగా బర్త్ సర్టిఫికెట్ తీసుకున్నారు. అనారోగ్య కార ణాలు చూపుతూ కృష్ణయ్య 2006లో కుమారుడిని తనతో తీసుకెళ్లారు. తర్వాత వారికి ఇద్దరు కుమార్తెలు జన్మించారు. 2006లో కృష్ణవేణికి వైష్ణవికి జన్మని చ్చింది. రెండేళ్ల తర్వాత రకరకాల సాకులు చెప్పి వైష్ణవిని కూడా తనతో తీసుకెళ్లిపోయారని ఆరోపించింది.
2011 లో రెండో కుమార్తె శ్రీనిక పుట్టింది. ఆ తర్వాత కృష్ణయ్య.. కృష్ణవేణి వద్దకు రావడం మానేశాడని ఎన్నిసార్లు కోరినా అర్జున్, వైష్ణవిలను తనకు చూపించడానికి సుముఖత చూపలేదని ఆరోపించారు. ప్రతి నెల కృష్ణవేణికి ఖర్చుల కోసం కొంత మొత్తం చెల్లిస్తూ వచ్చిన కృష్ణయ్య 2016లో ఆమెను ఖాజా గూడలో ఉన్న తన విల్లాలోకి మార్చారు. తనతో పాటు తన పిల్లల భవిష్యత్తుకు గ్యారంటీ ఇవ్వాలని కృష్ణవేణి కోరడంతో వారు ఉంటున్న విల్లాను కుమార్తె పేరిట రాశాడు.
ఆ తర్వాత నుంచి కృష్ణవేణిని దూరం పెట్టడం మొదలుపెట్టాడు. కుమారుడిని కలవడానికి అనేక ప్రయత్నాలు చేసిన కృష్ణ వేణి చివరకు 2021లో అతడిని కలిసింది. పసివయసులోనే కుమారుడిని తనతో తీసుకెళ్లిపోయిన కృష్ణయ్య తన మొదటి భార్యనే అర్జున్ తల్లిగా నమ్మించినట్లు బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. కృష్ణవేణి అర్జున్‌ను కలుస్తున్న విషయం తెలుసుకున్న కృష్ణయ్య ఆమెను బెదిరించినట్టు ఆరోపించింది.
2022లో విదేశాలకు వెళ్లిన అర్జున్ అప్పుడప్పుడు తల్లిని కలిసేవారు. ఈ క్రమంలో వైష్ణవి తన సోదరి అని తల్లి కృష్ణవేణి ద్వారా తెలుసుకున్నాడు. కృష్ణయ్య సమీప బంధువులైన హేమ, ప్రసాద్ కుమార్తెగా పెరుగుతున్నట్లు కన్న తల్లితో చెప్పాడు. కృష్ణయ్యతో పాటు హేమ, ప్రసాద్‌లు అర్జున్, వైష్ణవిలకు సంబంధించి నకిలీ పత్రాలు సృష్టించి, ధ్రువీకరణలు పాందినట్లు గుర్తించిన కృష్ణవేణి వాటితో పాస్ పోర్ట్, బర్త్ సర్టిఫికెట్లు తీసుకున్నట్టు ఆధారాలు సేకరించారు. వాటితో రాయదుర్గం ఠాణాలో ఫిర్యాదు చేశారు. ఈ కేసు కొట్టేయాలంటూ కృ ష్ణయ్య కోర్టును ఆశ్రయించినా ఫలితం లేకుండా పోయింది. తాజాగా ఈ కేసు దర్యాప్తును సీసీఎస్‌కు బదిలీ చేశారు.