తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Telangana News Live September 26, 2024: Karimnagar News : కరీంనగర్ లో షాకింగ్ ఘటన - చనిపోయిన మిత్రుడి ఖాతా నుంచి రూ. 20 లక్షలు కాజేశాడు
Karimnagar News : కరీంనగర్ లో షాకింగ్ ఘటన - చనిపోయిన మిత్రుడి ఖాతా నుంచి రూ. 20 లక్షలు కాజేశాడు
Karimnagar News : కరీంనగర్ లో షాకింగ్ ఘటన - చనిపోయిన మిత్రుడి ఖాతా నుంచి రూ. 20 లక్షలు కాజేశాడు

Telangana News Live September 26, 2024: Karimnagar News : కరీంనగర్ లో షాకింగ్ ఘటన - చనిపోయిన మిత్రుడి ఖాతా నుంచి రూ. 20 లక్షలు కాజేశాడు

26 September 2024, 21:51 IST

తెలంగాణ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.

26 September 2024, 21:51 IST

Telangana News Live: Karimnagar News : కరీంనగర్ లో షాకింగ్ ఘటన - చనిపోయిన మిత్రుడి ఖాతా నుంచి రూ. 20 లక్షలు కాజేశాడు

  • కరీంనగర్ లో సరికొత్త మోసం వెలుగు చూసింది. మృతి చెందిన స్నేహితుడి ఖాతా నుంచి 20 లక్షలను  కాజేశాడు ఓ ఘనుడు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు… కేసును చేధించారు. కేసులో ఉన్న అసలు సూత్రదారి పరారీలో ఉన్నాడు. సాంకేతికంగా సహకరించిన మరో వ్యక్తిని అరెస్ట్ చేశారు.
పూర్తి స్టోరీ చదవండి

26 September 2024, 20:02 IST

Telangana News Live: TG Govt Digital Health Card : 30 రోజుల్లో డిజిటల్‌ హెల్త్‌ కార్డులు - సీఎం రేవంత్ కీలక ప్రకటన

  • డిజిటల్ హెల్త్ కార్డులు జారీపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి కీలక ప్రకటన చేశారు. వచ్చే 30 రోజుల్లోనే ఫ్యామిలీ డిజిటల్‌ హెల్త్‌కార్డులు తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. ప్రతి గ్రామంలోనూ వివరాలను సేకరిస్తారని పేర్కొన్నారు.
పూర్తి స్టోరీ చదవండి

26 September 2024, 19:11 IST

Telangana News Live: Sangareddy : నారింజ వాగులో ఇద్దరు కర్ణాటక వాసులు గల్లంతు.. ఒకరిని కాపాడిన స్థానికులు

  • Sangareddy : రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు జహీరాబాద్ మండలంలోని నారింజ వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. దీంతో కర్ణాటక, జహీరాబాద్ ప్రాంతానికి రాకపోకలు నిలిచిపోయాయి. ఈ క్రమంలో కర్ణాటకకు చెందిన ఇద్దరు వ్యక్తులు బైక్‌పై వాగు దాటే ప్రయత్నం చేయగా.. అదుపుతప్పి ప్రవాహంలో కొట్టుకుపోయారు.
పూర్తి స్టోరీ చదవండి

26 September 2024, 18:53 IST

Telangana News Live: Shirdi Tour Package : షిర్డీకి ఫ్లైట్ టూర్ ప్యాకేజీ - బాబా దర్శనంతో పాటు థీమ్ పార్క్ షో చూడొచ్చు! వివరాలు ఇలా

  • Hyderabad Shirdi Tour Package: షిర్డీకి ఫ్లైట్ జర్నీ ద్వారా వెళ్లేందుకు తెలంగాణ టూరిజం ప్యాకేజీని ప్రకటించింది. హైదరాబాద్ సిటీ నుంచి ఆపరేట్ చేసే ఈ ప్యాకేజీ 2 రోజుల్లోనే ముగుస్తుంది. తెలంగాణ టూరిజం వెబ్ సైట్ లోకి వెళ్లి షెడ్యూల్ తో పాటు పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.
పూర్తి స్టోరీ చదవండి

26 September 2024, 17:19 IST

Telangana News Live: Eenadu Journalism School : జర్నలిస్ట్ కావాలనుకుంటున్నారా..? శిక్షణతో పాటు స్టైఫండ్‌, ఇలా దరఖాస్తు చేసుకోండి

  • Eenadu Journalism School Notification 2024: ఈనాడు జర్నలిజం స్కూల్ లో ప్రవేశాలకు నోటిఫికేషన్ జారీ అయింది. ఆన్ లైన్ దరఖాస్తులు ప్రారంభం కాగా… అక్టోబర్ 13వ తేదీని తుది గడువుగా నిర్ణయించారు. అక్టోబర్ 27వ తేదీన పరీక్ష నిర్వహిస్తారు. డిసెంబర్ 9వ తేదీ నుంచి కోర్సు ప్రారంభం అవుతుందని ప్రకటనలో పేర్కొన్నారు.
పూర్తి స్టోరీ చదవండి

26 September 2024, 16:29 IST

Telangana News Live: Musi River Survey : మూసీ ప్రక్షాళనకు వేగంగా అడుగులు.. నిర్మాణాల కూల్చివేతకు రంగం సిద్ధం!

  • Musi River Survey : హైదరాబాద్‌‌లోని మూసీనది పరివాహక ప్రాంతాల్లో అధికారులు సర్వే చేశారు. ఎఫ్‌టీఎల్‌, బఫర్‌జోన్లలోని అక్రమ నిర్మాణాలకు మార్కింగ్‌ చేశారు. అక్రమంగా నివాసముంటున్నవారికి ఖాళీ చేయాలని చెబుతున్నారు. హిమాయత్‌నగర్‌ ఎమ్మార్వో నేతృత్వంలో సర్వే జరుగుతోంది.
పూర్తి స్టోరీ చదవండి

26 September 2024, 15:45 IST

Telangana News Live: Nalgonda Congress : ఒక్క జిల్లా.. 5 మంది ఆశావహులు! కేబినెట్లో చోటు దక్కేదెవరికి..?

  • తెలంగాణ కేబినెట్ విస్తరణలో చోటు దక్కించుకోవాలని నల్గొండ జిల్లా ఎమ్మెల్యేలు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే జిల్లా నుంచి ఇద్దరు మంత్రులు ఉన్నారు. అయితే విస్తరణలో చోటు కోసం ఐదుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పావులు కదుపుతున్నారు. సామాజిక సమీకరణాలతో కూడిన లెక్కలు వేసుకుంటున్నారు.
పూర్తి స్టోరీ చదవండి

26 September 2024, 14:02 IST

Telangana News Live: TG SET Results 2024 : 'సెట్' అభ్యర్థులకు అలర్ట్.. 'కీ'లపై అభ్యంతరాలకు ఇవాళే చివరి తేదీ - త్వరలోనే ఫలితాలు..!

  • TG SET Exam 2024 Results : తెలంగాణ సెట్ పరీక్షలకు సంబంధించిన ప్రాథమిక  కీలు ఇటీవలే విడుదలయ్యాయి. వీటిపై అభ్యంతరాల గడువు సెప్టెంబర్ 26వ తేదీతో ముగియనుంది. అభ్యంతరాల పరిశీలన తర్వాత త్వరలోనే ఫలితాలను ప్రకటించనున్నారు. 
పూర్తి స్టోరీ చదవండి

26 September 2024, 13:30 IST

Telangana News Live: PM Kisan : రైతులకు మోదీ దసరా కానుక.. అక్టోబర్ 5న అన్నదాతల ఖాతాల్లోకి డబ్బులు

  • PM Kisan : రైతులకు కేంద్రం దసరా కానుక ఇవ్వనుంది. ప్రధానమంత్రి కిసాన్ పథకం 18వ విడత నిధులను.. అక్టోబర్ 5న నరేంద్ర మోదీ విడుదల చేయనున్నారు. 17వ విడత నిధులు జూన్ 18న విడుదల చేశారు. ఇప్పుడు 18వ విడత నిధులు విడుదల చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.
పూర్తి స్టోరీ చదవండి

26 September 2024, 13:03 IST

Telangana News Live: Hyderabad : డిటోనేటర్లతో భవనాన్ని పేల్చిన అధికారులు.. ఇద్దరికి తీవ్ర గాయాలు

  • Hyderabad : హైదరాబాద్ నగర పరిసర ప్రాంతాల్లో కూల్చివేతలు కొనసాగుతున్నాయి. తాజాగా.. కొండాపూర్‌లో చెరువులో నిర్మించిన భవనాన్ని రెవెన్యూ అధికారులు కూల్చేశారు. జేసీబీలు వెళ్లే వీలు లేకపోవడంతో.. డిటోనేటర్లతో పేల్చేశారు. ఈ క్రమంలో శిథిలాలు మీదపడి ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.
పూర్తి స్టోరీ చదవండి

26 September 2024, 12:23 IST

Telangana News Live: KMC Warangal : కాకతీయ మెడికల్ కాలేజీలో ఉద్యోగాలు.. నెలకు జీతం ఎంతో తెలుసా!

  • KMC Warangal : వరంగల్ నగరంలోని కాకతీయ మెడికల్ కాలేజీలో వివిధ విభాగాల్లో పోస్టులు భర్తీ చేయనున్నారు. దీనికి సంబంధించి కేఎంసీ వరంగల్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈనెల 27వ తేదీ నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. వివరాల కోసం ప్రిన్సిపల్ కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు.
పూర్తి స్టోరీ చదవండి

26 September 2024, 12:06 IST

Telangana News Live: ‌Journalist Death: మేడపై నుంచి పడి ఈటీవీ బ్యూరో చీఫ్‌ నారాయణ కన్నుమూత, సంతాపం తెలిపిన సీఎం రేవంత్‌ రెడ్డి

  • ‌Journalist Death: మేడపై నుంచి జారిపడి ఈటీవీ హైదరాబాద్ బ్యూరో చీఫ్‌ టి.నారాయణ కన్నుమూశారు. ఏపీలో ప్రకాశం జిల్లాకు చెందిన నారా‍యణ పాతికేళ్లు జర్నలిస్టుగా పనిచేస్తున్నారు. ఆయన మృతికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సంతాపం తెలిపారు. 
పూర్తి స్టోరీ చదవండి

26 September 2024, 11:38 IST

Telangana News Live: Telangana Police : ఫొటోలు తీసి బ్లాక్ మెయిల్ చేసిన కానిస్టేబుళ్లు.. సస్పెండ్ చేసిన ఎస్పీ

  • Telangana Police : ఫొటోలు తీసి బ్లాక్ మెయిల్ చేసిన ఇద్దరు కానిస్టేబుళ్లపై వేటు పడింది. ఫొటోలు చూపించి డబ్బులు డిమాండ్ చేసిన కానిస్టేబుళ్లను నాగర్‌కర్నూల్ జిల్లా ఎస్పీ సస్పెండ్ చేశారు. పోలీస్ శాఖలో ఎవరు తప్పు చేసినా చర్యలు తప్పవని హెచ్చరించారు. విధుల్లో నిజాయతీగా వ్యవహరించాలని సూచించారు.
పూర్తి స్టోరీ చదవండి

26 September 2024, 10:53 IST

Telangana News Live: TG Govt Jobs 2024 : 612 పోస్టుల భర్తీకి త్వరలో నోటిఫికేషన్.. పూర్తి వివరాలు ఇవే

  • TG Govt Jobs 2024 : వైద్య ఆరోగ్యశాఖలో పోస్టుల భర్తీకి రంగం సిద్ధం అవుతోంది. 612 పోస్టుల భర్తీ కోసం త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. మరో 1600 మెడికల్‌ ఆఫీసర్‌ పోస్టులను మంజూరు చేయాలని కోరుతూ.. వైద్య, ఆరోగ్యశాఖ ఆర్థికశాఖకు ఇటీవల ప్రతిపాదనలు పంపింది.
పూర్తి స్టోరీ చదవండి

26 September 2024, 10:10 IST

Telangana News Live: TG AP Scholarships : తెలుగు రాష్ట్రాల విద్యార్థులకు శుభవార్త.. ఏడాదికి రూ.25 వేల స్కాలర్‌షిప్ పొందే ఛాన్స్!

  • TG AP Scholarships : ప్రతిభ ఉండి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న విద్యార్థులకు పలు సంస్థలు స్కాలర్‌షిప్‌లు అందిస్తూ దన్నుగా నిలుస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల విద్యార్థులకు సాయం చేసేందుకు సంస్థలు ముందుకొస్తున్నాయి. తాజాగా.. ఉప్పలపాటి రత్న మాణిక్యాంబ మెమోరియల్ స్కాలర్‌షిప్‌లు ఇచ్చేందుకు ముందుకొచ్చింది.
పూర్తి స్టోరీ చదవండి

26 September 2024, 9:51 IST

Telangana News Live: Tirumala Ghee Effect: తిరుమల కల్తీ నెయ్యి ఎఫెక్ట్.. దేవాదాయ శాఖ అప్రమత్తం, తెలంగాణ ఆలయాల్లో తనిఖీలు..

  • Tirumala Ghee Effect: తిరుమల తిరుపతి లడ్డూ వివాదం ఎంతటి హాట్ టాపిక్ గా మారిందో తెలిసిన విషయమే.ఆ లడ్డూల్లో కల్తీ నెయ్యి,జంతువుల కొవ్వు కలుపుతున్నారనే ఆరోపణలు రాగా.. ఈ విషయంపై ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర చర్చ నడుస్తోంది.ఈ నేపథ్యంలో తెలంగాణలోని ప్రముఖ ఆలయాల లడ్డుల నాణ్యత ఎలా ఉందనే చర్చ భక్తుల్లో మొదలైంది.
పూర్తి స్టోరీ చదవండి

26 September 2024, 9:33 IST

Telangana News Live: Husnabad Industrial Park: హుస్నాబాద్ నియోజకవర్గంలో 80 ఎకరాలలో, రూ. 431 కోట్లతో ఇండస్ట్రియల్ పార్క్

  • Husnabad Industrial Park: హుస్నాబాద్  పారిశ్రామికంగా అభివృద్ధి చెందేలా అక్కన్నపేట మండల కేంద్రంలో ఏర్పాటు చేయనున్న తెలంగాణ ఇండస్ట్రియల్ అండ్ ఇన్‌‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (TGIIC) ఇండస్ట్రియల్ పార్కులో  పరిశ్రమల స్థాపనకు ముందుకు రావాలని జిల్లా మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు.
పూర్తి స్టోరీ చదవండి

26 September 2024, 8:46 IST

Telangana News Live: Cyber Crime: ములుగు కలెక్టర్ పేరుతో ఫేక్ వాట్సాప్ అకౌంట్, ఉజ్బెకిస్తాన్ నుంచి డబ్బులు డిమాండ్

  • Cyber Crime: సైబర్ నేరగాళ్లు జిల్లా అధికారుల పేరుతో జనాలకు టోకరా వేస్తున్నారు. ఇదివరకే ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పలువురు కలెక్టర్లు, పోలీసు ఆఫీసర్ల పేరుతో ఫేస్ బుక్, వాట్సాప్ అకౌంట్ల ద్వారా డబ్బులు దండుకునే ప్రయత్నం చేయగా.. తాజాగా బాధితుల జాబితాలో ములుగు కలెక్టర్ కూడా చేరారు. 
పూర్తి స్టోరీ చదవండి

26 September 2024, 6:53 IST

Telangana News Live: Karimnagar Tragedy: చందాలతో అంతిమ సంస్కారం, కరీంనగర్ జిల్లాలో హృదయ విదారకమైన ఘటన

  • Karimnagar Tragedy: అసలే పేదరికం... ఆపై అనారోగ్యం... ఫలితంగా ప్రాణం పోయింది. అద్దె ఇంట్లోకి శవాన్ని తీసుకు రావద్దని ఇంటి ఓనర్ చెప్పడంతో ఊరు బయట డేరా కింద శవాన్ని పెట్టి చేతిలో చిల్లిగవ్వ లేక అంత్యక్రియలు నిర్వహించుకోలేని దుస్థితి ఏర్పడటంతో గ్రామస్తులు తలో చేయి వేసి అంతిమ సంస్కారాలు పూర్తి చేశారు.
పూర్తి స్టోరీ చదవండి

    ఆర్టికల్ షేర్ చేయండి