Shirdi Tour Package : షిర్డీకి ఫ్లైట్ టూర్ ప్యాకేజీ - బాబా దర్శనంతో పాటు థీమ్ పార్క్ షో చూడొచ్చు! వివరాలు ఇలా-telangana tourism operate flight tour package to shirdi from hyderabad ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Shirdi Tour Package : షిర్డీకి ఫ్లైట్ టూర్ ప్యాకేజీ - బాబా దర్శనంతో పాటు థీమ్ పార్క్ షో చూడొచ్చు! వివరాలు ఇలా

Shirdi Tour Package : షిర్డీకి ఫ్లైట్ టూర్ ప్యాకేజీ - బాబా దర్శనంతో పాటు థీమ్ పార్క్ షో చూడొచ్చు! వివరాలు ఇలా

Maheshwaram Mahendra Chary HT Telugu
Sep 26, 2024 06:53 PM IST

Hyderabad Shirdi Tour Package: షిర్డీకి ఫ్లైట్ జర్నీ ద్వారా వెళ్లేందుకు తెలంగాణ టూరిజం ప్యాకేజీని ప్రకటించింది. హైదరాబాద్ సిటీ నుంచి ఆపరేట్ చేసే ఈ ప్యాకేజీ 2 రోజుల్లోనే ముగుస్తుంది. తెలంగాణ టూరిజం వెబ్ సైట్ లోకి వెళ్లి షెడ్యూల్ తో పాటు పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.

హైదరాబాద్- షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ
హైదరాబాద్- షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ (Image From @SSSTShirdi Twitter)

షిర్డీకి వెళ్లి ప్లాన్ ఉందా…? తొందరగా వెళ్లి రావాలనుకునే వారికోసం తెలంగాణ టూరిజం ఫ్లైట్ జర్నీ టూర్ ప్యాకేజీ ప్రకటించింది. హైదరాబాద్ నుంచి ఫ్లైట్ లో వెళ్తారు.  కేవలం 2 రోజుల్లోనే ఈ ప్యాకేజీ షెడ్యూల్ పూర్తి అవుతుంది. టూరిజం వెబ్ సైట్ లోకి వెళ్లి వివరాలును తెలుసుకోవచ్చు.

తెలంగాణ టూరిజం వెబ్ సైట్ లో' Shiridi - Flight Package' పేరుతో ఈ ప్యాకేజీ ఉంటుంది. షెడ్యూల్ ప్రకారం…. హైదరాబాద్ నుంచి షిర్డీకి వెళ్లే ఫ్లైట్ శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి మధ్యాహ్నం 1. 30 గంటలకు బయల్దేరుతుంది.

మధ్యాహ్నం 2:50 గంటలకు షిర్డీ ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. 3:30 గంటలకు హోటల్ లోకి చెకిన్ అవుతారు. ఆ తర్వాత సాయిబాబా దర్శనానికి వెళ్తారు. సాయంత్రం జరిగే హారతి కార్యక్రమంలో పాల్గొనటంతో పాటు వీఐపీ దర్శనం లేదా ఫ్రీ దర్శనం ఉంటుంది. రాత్రి 7 గంటలకు థీమ్ పార్క్ షో ఉంటుంది. రాత్రి 8 గంటల వరకు షాపింగ్ చేసుకోవచ్చు. రాత్రి 9 తర్వాత హోటల్ కు చేరుకుంటారు.

ఇక రెండో రోజు మార్నింగ్ టిఫిన్ చేస్తారు.  ఆ తర్వాత పంచముఖి గణపతి టెంపుల్ కు వెళ్తారు. పాత షిర్డీని చూస్తారు. kandoba మందిర్ కు వెళ్లటంతో పాటు సాయి టీత్ ను సందర్శిస్తారు. సాయంత్రం 5:30 గంటలకు హైదరాబాద్ కు ఫ్లైట్ లో చేరుకుంటారు.

హైదరాబాద్  నుంచి షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ ధర రూ. 12499గా ఉంది. ఈ టూర్ ప్యాకేజీలో ఫ్లైట్ టికెట్లతో పాటు వసతి సౌకర్యం ఉంటుంది. ఏమైనా సందేహాలు ఉంటే 9848540371 ఫోన్ నెంబర్ ను సంప్రదించవచ్చు. ఈ ప్యాకేజీ ఆన్ లైన్ లో బుకింగ్ చేసుకునే అవకాశం లేదు. బుకింగ్ చేసుకోవాలనుకునే అభ్యర్థులు హైదరాబాద్ లోని తెలంగాణ టూరిజం ఆఫీస్ ను సంప్రదించాలి.  https://tourism.telangana.gov.in/package/shirdiflight లింక్ పై క్లిక్ చేసి ప్యాకేజీ వివరాలు చూడొచ్చు.