Eenadu Journalism School : జర్నలిస్ట్ కావాలనుకుంటున్నారా..? శిక్షణతో పాటు స్టైఫండ్, ఇలా దరఖాస్తు చేసుకోండి
Eenadu Journalism School Notification 2024: ఈనాడు జర్నలిజం స్కూల్ లో ప్రవేశాలకు నోటిఫికేషన్ జారీ అయింది. ఆన్ లైన్ దరఖాస్తులు ప్రారంభం కాగా… అక్టోబర్ 13వ తేదీని తుది గడువుగా నిర్ణయించారు. అక్టోబర్ 27వ తేదీన పరీక్ష నిర్వహిస్తారు. డిసెంబర్ 9వ తేదీ నుంచి కోర్సు ప్రారంభం అవుతుందని ప్రకటనలో పేర్కొన్నారు.
జర్నలిజంపై మీకు ఆసక్తి ఉందా..? పాత్రికేయులుగా స్థిరపడాలనే ఆలోచన ఉందా..? అయితే మీలాంటి వారికి శిక్షణ ఇచ్చి ఉద్యోగాలను కల్పించేందుకు ఈనాడు జర్నలిజం స్కూల్ నోటిఫికేషన్ జారీ చేసింది. మల్డీమీడియా, టెలివిజన్, మొబైల్ జర్నలిజం విభాగాల్లో పోస్ట్ గ్రాడ్యూయేట్ డిప్లోమా కోర్సుల్లో ప్రవేశాలను కల్పించనుంది. ఈ మేరకు వివరాలను పేర్కొంది.
ఈ కోర్సుల్లో ప్రవేశాలకు ముందుగా రాత పరీక్షలు ఉంటాయి. తెలుగు, ఇంగ్లీష్ భాషల్లో ప్రావీణ్యంతో పాటు ట్రాన్ లేషన్, కరెంట్ అఫైర్స్ కు సంబంధించిన అంశాలపై పరీక్షలను నిర్వహిస్తారు. ఏపీ, తెలంగాణలోని పలు ప్రాంతాలను సెంటర్లుగా ఎంపిక చేస్తారు.
రాత పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన వారికి గ్రూప్ డిస్కషన్స్ ఉంటాయి. ఇందులో కూడా పాస్ అయిన వారికి వ్యక్తిగత ఇంటర్వూలు ఉంటాయి. ధ్రువపత్రాల పరిశీలనతో పాటు స్కూల్ నిబంధనల మేరకు అంగీకారపత్రం ఇస్తే… అడ్మిషన్ లభిస్తుంది.
ఎంపికైన వారికి ఈనాడు జర్నలిజం స్కూలులో సంవత్సరం పాటు శిక్షణ ఉంటుంది. ఈ సమయంలో మొదటి 6 నెలలు రూ. 14000 భృతి ఇస్తారు. ఆ తరువాతి 6 నెలలకు రూ. 15,000 చొప్పున నెలవారీ భృతి చెల్లిస్తారు. స్కూల్ లో కోర్సును విజయవంతంగా పూర్తి చేసిన వారికి ట్రైనీలుగా అవకాశం కల్పిస్తారు.
ఏడాది పాటు ఉండే ఈ శిక్షణలో రూ. 19,000 జీతం ఉంటుంది. ఇది కూడా పూర్తి అయిన తర్వాత… ఒక ఏడాది కాలం పాటు ప్రొబేషన్ సమయం ఉంటుంది. ఈ కాలంలో రూ. 21వేల జీతం చెల్లిస్తారు. కన్ఫర్మేషన్‌లో రూ. 23,000 వరకు జీతం చెల్లిస్తారు.
ఎలా దరఖాస్తు చేసుకోవాలి!
ఈనాడు జర్నలిజం స్కూల్ లో చేరాలనుకునేవారు ఆన్ లైన్ లో అప్లికేషన్ చేసుకోవాలి. www.eenadu.net లేదా pratibha.eenadu.net/eenadupratibha.net వెబ్ సైట్ లోకి వెళ్లాలి. ఇక్కడ ఈనాడు జర్నలిజం స్కూల్ ప్రవేశాలకు దరఖాస్తు అనే ఆప్షన్ ఉంటుంది. దానిపై క్లిక్ చేస్తే మీకు అప్లికేషన్ ఓపెన్ అవుతుంది. మీ వివరాలను ఎంట్రీ చేయాలి. అప్లికేషన్ ఫీజు రూ. 200 చెల్లించాలి.
ముఖ్య తేదీలు:
- ఆన్ లైన్ దరఖాస్తులు ప్రారంభం - 05, సెప్టెంబర్ 2024.
- ఆన్ లైన్ దరఖాస్తులకు చివరి తేదీ - 13, అక్టోబర్ 2024.
- ప్రవేశ పరీక్ష - 27 అక్టోబర్ 2024
- కోర్సు ప్రారంభం - 09, డిసెంబర్ 2024.
- అప్లికేషన్ లింక్ - https://ejs.eenadu.net/