PM Kisan : రైతులకు మోదీ దసరా కానుక.. అక్టోబర్ 5న అన్నదాతల ఖాతాల్లోకి డబ్బులు
PM Kisan : రైతులకు కేంద్రం దసరా కానుక ఇవ్వనుంది. ప్రధానమంత్రి కిసాన్ పథకం 18వ విడత నిధులను.. అక్టోబర్ 5న నరేంద్ర మోదీ విడుదల చేయనున్నారు. 17వ విడత నిధులు జూన్ 18న విడుదల చేశారు. ఇప్పుడు 18వ విడత నిధులు విడుదల చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రైతులకు దసరా కానుక ఇవ్వనున్నారు. పీఎం కిసాన్ 18వ విడత నిధులను అక్టోబర్ 5న విడుదల చేయనున్నారు. దీనికి సంబంధించి కేంద్రం ప్రకటన చేసింది. పీఎం కిసాన్ పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం రూ. 6 వేలు రైతులకు సాయం చేస్తోంది. 2018 డిసెంబర్‌లో ఈ పథకాన్ని కేంద్రం ప్రారంభించింది. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ ద్వారా రైతులకు లబ్ధి చేకూరుతోంది. లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు ప్రతి నాలుగు నెలలకు రూ. 2 చొప్పున మూడు వాయిదాలలో డబ్బు ఇస్తున్నారు. పీఎం కిసాన్ యోజన 16వ విడతలో 93 మిలియన్ల మంది రైతులు రూ.2 పొందారు.
18వ విడత అందాలంటే రైతులు ఈకేవైసీ పూర్తి చేయాలి.
అధికారిక వెబ్‌సైట్ https://pmkisan.gov.in కి వెళ్లాలి.
ఫార్మర్ కార్నర్.. విభాగంలోని 'ఈకేవైసీ' పై క్లిక్ చేయాలి.
అవసరమైన ఫీల్డ్‌లో 12 అంకెల ఆధార్ నంబర్‌ను టైప్ చేయాలి
'సెర్చ్' బటన్‌పై క్లిక్ చేయాలి
ఆధార్- రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని నమోదు చేయాలి.
ఈకేవైసీపీ ప్రక్రియను పూర్తి చేయడానికి సబ్‌మిట్ బటన్ నొక్కాలి.
రైతులు తమ సమీపంలోని కామన్ సర్వీస్ సెంటర్‌లో కూడా ఈకేవైసీ పూర్తి చేయొచ్చు.
స్టేట్‌మెంట్ ఎలా చూడాలి..
పీఎం కిసాన్ వెబ్‌సైట్‌ను ఓపెన్ చేయాలి.
హోమ్‌పేజీలో 'ఫార్మర్స్ కార్నర్' విభాగంలోకి వెళ్లాలి.
'బెనిఫిషియరీ స్టేటస్' ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
రిజిస్టర్డ్ ఆధార్ నంబర్ లేదా బ్యాంక్ ఖాతా నంబర్‌ను ఎంటర్ చేయాలి.
'గెట్ డేటా' బటన్‌పై క్లిక్ చేయాలి. అప్పుడు స్టేట్‌మెంట్ వస్తుంది.
ఈకేవైసీ తప్పనిసరి..
రైతులు బ్యాంక్ అకౌంట్‌కు ఆధార్ లింక్, ఈ కేవైసీ పూర్తి అయ్యాయో లేదో చెక్ చేసుకోవాలి. పీఎం కిసాన్‌కు దరఖాస్తు చేసుకున్న రైతులకు.. ఈ కేవైసీ తప్పనిసరి. ఓటీపీ ఆధారిత ఈకేవైసీ.. పీఎం కిసాన్ పోర్టల్‌లో అందుబాటులో ఉంది. బయోమెట్రిక్ ఆధారిత ఈకేవైసీ కోసం సమీపంలోని సీఎస్‌సీ కేంద్రాలకు వెళ్లాలి. పీఎం కిసాన్ పథకంలో మధ్యవర్తుల ప్రమేయం లేకుండా.. చేయడానికే ఈకేవైసీని తప్పనిసరి చేశారు.