TG AP Scholarships : తెలుగు రాష్ట్రాల విద్యార్థులకు శుభవార్త.. ఏడాదికి రూ.25 వేల స్కాలర్‌షిప్ పొందే ఛాన్స్!-uppalapati ratna manikyamba memorial offers scholarships for telangana and andhra pradesh students ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Tg Ap Scholarships : తెలుగు రాష్ట్రాల విద్యార్థులకు శుభవార్త.. ఏడాదికి రూ.25 వేల స్కాలర్‌షిప్ పొందే ఛాన్స్!

TG AP Scholarships : తెలుగు రాష్ట్రాల విద్యార్థులకు శుభవార్త.. ఏడాదికి రూ.25 వేల స్కాలర్‌షిప్ పొందే ఛాన్స్!

TG AP Scholarships : ప్రతిభ ఉండి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న విద్యార్థులకు పలు సంస్థలు స్కాలర్‌షిప్‌లు అందిస్తూ దన్నుగా నిలుస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల విద్యార్థులకు సాయం చేసేందుకు సంస్థలు ముందుకొస్తున్నాయి. తాజాగా.. ఉప్పలపాటి రత్న మాణిక్యాంబ మెమోరియల్ స్కాలర్‌షిప్‌లు ఇచ్చేందుకు ముందుకొచ్చింది.

ఉప్పలపాటి రత్న మాణిక్యాంబ మెమోరియల్ స్కాలర్‌షిప్‌

ఉప్పలపాటి రత్న మాణిక్యాంబ మెమోరియల్ సంస్థ.. తెలుగు రాష్ట్రాల విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు అందిస్తోంది. 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి విద్యార్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఏడాదికి రూ.25 వేలు, అవసరం ఉంటే ఇంకా ఎక్కువ స్కాలర్‌షిప్ ఇస్తామని సంస్థ ప్రకటించింది. అర్హులైన విద్యార్థులు అప్లై చేసుకోవాలని సంస్థ ప్రతినిధులు సూచించారు.

'కొత్త స్కాలర్‌షిప్‌ను ప్రారంభిస్తున్నామని ప్రకటించినందుకు మేము సంతోషిస్తున్నాము. అర్హులైన విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నాము. ఈ స్కాలర్‌షిప్ విద్యార్థులకు సాయం చేస్తుందని భావిస్తున్నాం. విద్యార్థుల అకడమిక్ ఎక్సలెన్స్‌ కోసం స్కాలర్‌షిప్‌లు అందిస్తున్నాం. ప్రతిభ ఉన్న పేద విద్యార్థుల ఆర్థిక అవసరాన్ని గుర్తించి.. స్కాలర్‌షిప్‌లు అందజేస్తున్నాం' అని ఉప్పలపాటి రత్న మాణిక్యాంబ మెమోరియల్ సంస్థ వివరించింది.

ముఖ్యమైన వివరాలు ఇవే..

స్కాలర్‌షిప్ పేరు: ఉప్పలపాటి రత్న మాణిక్యాంబ మెమోరియల్ స్కాలర్‌షిప్

అవార్డ్: సంవత్సరానికి 25,000 లేదా అంతకంటే ఎక్కువ (అవసరం ఆధారంగా).

అర్హతలు: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన వారై ఉండాలి. బీఈడీ చదువుతున్న విద్యార్థినులు అర్హులు. ఇంటర్‌లో కనీసం 75 శాతం మార్కులు సాధించాలి.

ఆదాయం: దరఖాస్తు చేసుకునే విద్యార్థుల కుటుంబ వార్షిక ఆదాయం రూ.5 లక్షల లోపు ఉండాలి.

దరఖాస్తులను క్షణ్నంగా పరిశీలించిన తర్వాత విద్యార్థినులను ఎంపిక చేస్తారు.

ఎంపీక చేసిన విద్యార్థినులకు ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఆ తర్వాత స్కాలర్‌షిప్ అందిస్తారు.

దరఖాస్తు చేయడానికి చివరి తేదీ: సెప్టెంబర్ 30, 2024

https://impactisglobal.com/s/ums00yd24 వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

మరింత సమాచారం కోసం.. సంస్థ ప్రతినిధి శ్రేష్ఠకు ఫోన్ చేయొచ్చు. (9051064904) నంబర్‌కు కాల్ చేసి మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు.

మెయిల్ ద్వారా అయితే.. shrestha.ganguly@impactisglobal.com ఐడీలో సంప్రదించవచ్చు.