Santoor Scholarship : విద్యార్థినులకు గుడ్‌న్యూస్.. ఏడాదికి రూ.24 వేల స్కాలర్‌షిప్‌.. ఈ లింక్ ద్వారా అప్లై చేసుకొండి!-santoor scholarship financially support girls from disadvantaged backgrounds ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Santoor Scholarship : విద్యార్థినులకు గుడ్‌న్యూస్.. ఏడాదికి రూ.24 వేల స్కాలర్‌షిప్‌.. ఈ లింక్ ద్వారా అప్లై చేసుకొండి!

Santoor Scholarship : విద్యార్థినులకు గుడ్‌న్యూస్.. ఏడాదికి రూ.24 వేల స్కాలర్‌షిప్‌.. ఈ లింక్ ద్వారా అప్లై చేసుకొండి!

Basani Shiva Kumar HT Telugu
Sep 20, 2024 10:07 AM IST

Santoor Scholarship : తెలుగు రాష్ట్రాల విద్యార్థులకు విప్రో కన్జ్యూమర్‌ కేర్‌ 9వ ఎడిషన్‌ స్కాలర్‌షిప్‌ పథకాన్ని ప్రకటించింది. దీని ద్వారా ఆర్థికంగా వెనకబడిన విద్యార్థులకు సపోర్ట్ చేయనుంది. స్కాలర్‌షిప్ పొందాలనుకునే విద్యార్థినులు ఈనెల 30వ తేదీ లోపు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాలి.

విద్యార్థినులకు స్కాలర్‌షిప్‌
విద్యార్థినులకు స్కాలర్‌షిప్‌ (Image Source: Santoor )

పదో తరగతి, ఇంటర్‌ ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదివిన విద్యార్థినులకు విప్రో కన్జ్యూమర్‌ కేర్‌ 9వ ఎడిషన్‌ స్కాలర్‌షిప్‌ పథకాన్ని ప్రకటించింది. ప్రస్తుతం ఫుల్‌టైం డిగ్రీ చదువుతున్న విద్యార్థినులకు స్కాలర్‌షిప్ ఇవ్వనుంది. ఈసారి 1500 మందికి ఉపకార వేతనాలు అందిస్తామని సంతూర్ ప్రతినిధులు ప్రకటించారు. ప్రతిభ ఆధారంగా స్కాలర్‌షిప్‌కు ఎంపిక చేస్తారు. ఏడాదికి రూ. 24వేల చొప్పున ఆర్థిక సాయం అందిస్తామన్నారు.

ఎంపికైన విద్యార్థులకు కోర్సు పూర్తయ్యే వరకు స్కాలర్ షిప్ ఇస్తారు. ట్యూషన్ ఫీజులు, ఇతర విద్యా ఖర్చుల కోసం వీటిని వాడుకోవచ్చు. గత ఎనిమిది సంవత్సరాలుగా దాదాపు 8 వేల మంది విద్యార్థులు సంతూర్ స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్ ద్వారా ఆర్థికంగా సాయం చేస్తున్నారు. ప్రొఫెషనల్ కోర్సుల వైపు మొగ్గు చూపే విద్యార్థులతో పాటు, హ్యుమానిటీస్, లిబరల్ ఆర్ట్స్, సైన్సెస్‌లో ఉన్నత విద్యను అభ్యసించడానికి ఆసక్తిని ఉన్నవారు దరఖాస్తు చేసుకోవాలి. వెనుకబడిన జిల్లాల విద్యార్థులకు ప్రాధాన్యత ఉంటుంది.

ఎవరు దరఖాస్తు చేసుకోవాలి..

ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి పాస్ అయ్యి ఉండాలి.

2023-24 విద్యా సంవత్సరంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల నుంచి 12వ తరగతి ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

2024-25 నుంచి ప్రారంభమయ్యే గ్రాడ్యుయేట్ కోర్సులో ఆడ్మిషన్ పొంది ఉండాలి.

ఎలా అప్లై చేసుకోవాలి..

అర్హత ఉన్న విద్యార్థినులు.. https://www.buddy4study.com/page/santoor-scholarship-programme#singleScApply ఈ లింక్ ద్వార్ అప్లై చేసుకోవాలి.

సెప్టెంబర్ 30వ తేదీ లోపు వచ్చిన అప్లికేషన్లను మాత్రమే పరిగణలోకి తీసుకుంటారు.

విద్యార్థులు కోర్సు పూర్తి చేసేవరకు సంవత్సరానికి రూ.24,000 స్కాలర్‌షిప్ ఇస్తారు.

దరఖాస్తు చేయడానికి చివరి తేదీ సెప్టెంబర్ 30, 2024