తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Telangana News Live September 13, 2024: Ponnam Sathaiah Goud Award : పొన్నం సత్తయ్య అవార్డుల ప్రదానోత్సవం - హాజరైన స్పీకర్, మంత్రులు
Ponnam Sathaiah Goud Award : పొన్నం సత్తయ్య అవార్డుల ప్రదానోత్సవం - హాజరైన స్పీకర్, మంత్రులు
Ponnam Sathaiah Goud Award : పొన్నం సత్తయ్య అవార్డుల ప్రదానోత్సవం - హాజరైన స్పీకర్, మంత్రులు

Telangana News Live September 13, 2024: Ponnam Sathaiah Goud Award : పొన్నం సత్తయ్య అవార్డుల ప్రదానోత్సవం - హాజరైన స్పీకర్, మంత్రులు

13 September 2024, 22:56 IST

తెలంగాణ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.

13 September 2024, 22:56 IST

Telangana News Live: Ponnam Sathaiah Goud Award : పొన్నం సత్తయ్య అవార్డుల ప్రదానోత్సవం - హాజరైన స్పీకర్, మంత్రులు

  • తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో పొన్నం సత్తయ్య గౌడ్ 14వ వర్ధంతి కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా పొన్నం సత్తయ్య జీవన సాఫల్య పురస్కారాల(2024)ను అందజేశారు. శుక్రవారం సాయంత్రం రవీంద్రభారతి ఆడిటోరియంలో జరిగిన ఈ కార్యక్రమానికి స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తో పాటు పలువురు మంత్రులు హాజరయ్యారు.
పూర్తి స్టోరీ చదవండి

13 September 2024, 22:02 IST

Telangana News Live: TG ICET Counseling 2024 : టీజీ ఐసెట్ ఫస్ట్ ఫేజ్ సీట్ల కేటాయింపు - అలాట్​మెంట్​ ఇలా చెక్ చేసుకోండి

  • టీజీ ఐసెట్‌ - 2024 ప్రవేశాల ప్రక్రియ కొనసాగుతోది. ఫస్ట్ ఫేజ్ సీట్లను అధికారులు శుక్రవారం కేటాయించారు. https://icet.tsche.ac.in/  వెబ్ సైట్ లోకి వెళ్లి అలాట్ మెంట్ కాపీలను పొందవచ్చు. సీట్లు పొందిన విద్యార్థులు సెప్టెంబర్ 17వ తేదీలోపు ఆయా కాలేజీల్లో రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది.
పూర్తి స్టోరీ చదవండి

13 September 2024, 21:02 IST

Telangana News Live: Telangana Flood Damage : తెలంగాణలో వరద నష్టం రూ.10,320 కోట్లు - కేంద్ర బృందంతో సీఎం రేవంత్ రెడ్డి

  • భారీ వర్షాలు, వరదలతో నష్టపోయిన తెలంగాణకు తక్షణమే ఆర్థిక సాయం అందించాలని సీఎం రేవంత్ రెడ్డి మరోమారు కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. వివిధ శాఖల నుంచి అందిన సమగ్ర అంచనాల ప్రకారం రూ.10,320 కోట్ల నష్టం వాటిల్లిందని చెప్పారు. శుక్రవారం కేంద్ర బృందంతో జరిగిన సమావేశంలో సీఎం కీలక అంశాలను వివరించారు.
పూర్తి స్టోరీ చదవండి

13 September 2024, 19:14 IST

Telangana News Live: Rythu Bandhu Scheme : ఆ రైతులకు మాత్రమే రైతు భరోసా డబ్బులు - రుణమాఫీపై మంత్రి కీలక ప్రకటన

  • రైతుబంధు(రైతు భరోసా) స్కీమ్ పై రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల కీలక వ్యాఖ్యలు చేశారు. పంట వేసిన వారికి మాత్రమే రైతు భరోసా డబ్బులు అందుతాయని స్పష్టం చేశారు. కొండలు, గుట్టలకు సాయాన్ని అందిచబోమని చెప్పారు. శుక్రవారం అలంపూర్ లో మాట్లాడిన ఆయన..రుణమాఫీపై కూడా కీలక ప్రకటన చేశారు.
పూర్తి స్టోరీ చదవండి

13 September 2024, 18:03 IST

Telangana News Live: Karimnagar Smart City Project : స్మార్ట్ సిటీ నిధులు గోల్ మాల్..! కమిషనర్ తో సహా ముగ్గురిపై కేసు నమోదు

  • కరీంనగర్ స్మార్ట్ సిటీ నిధుల దారి మళ్లింపు, దుర్వినియోగం రాజకీయంగా దుమారం రేపుతుంది. మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్ హై కోర్టును ఆశ్రయించడంతో మున్సిపల్ అధికారులపై కేసు నమోదు అయింది. హైకోర్టు ఆదేశంతో మున్సిపల్ కమిషనర్, మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ ఎస్ఈ, స్మార్ట్ సిటీ కన్సల్టెన్సీ ఎండీపై FIR చేశారు.
పూర్తి స్టోరీ చదవండి

13 September 2024, 17:39 IST

Telangana News Live: Tirumala Tour Package : తిరుమల టూర్ ప్యాకేజీ - ఉచితంగా శ్రీవారి శీఘ్రదర్శనం, ధర కూడా చాలా తక్కువ!

  • TG Tourism Tirumala Package: తిరుమల శ్రీవారిని దర్శించుకునే వారికోసం తెలంగాణ టూరిజం ప్రత్యేక ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది. హైదరాబాద్ నుంచి బస్సులో వెళ్లాల్సి ఉంటుంది. ఈ ప్యాకేజీలో  శ్రీవారి శీఘ్రదర్శనం ఉచితంగా ఉంటుంది. https://tourism.telangana.gov.in వెబ్ సైట్ లోకి వెళ్లి బుకింగ్ చేసుకోవచ్చు.
పూర్తి స్టోరీ చదవండి

13 September 2024, 16:59 IST

Telangana News Live: PM Modi Gift : తెలుగు రాష్ట్రాల ప్రజలకు.. ప్రధాని మోదీ గణపతి నవరాత్రుల కానుక

  • PM Modi Gift : తెలుగు ప్రజలకు ప్రధాని వినాయక నవరాత్రుల కానుక ఇచ్చారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి వివరించారు. తెలుగు రాష్ట్రాల్లో 2 కొత్త వందే భారత్ రైళ్లను సెప్టెంబర్ 16న ప్రారంభించనున్నారని చెప్పారు. ఢిల్లీ తర్వాత హైదరాబాద్ నుంచే అత్యధికంగా వందేభారత్ రైళ్ల అనుసంధానత ఉందని చెప్పారు.
పూర్తి స్టోరీ చదవండి

13 September 2024, 15:45 IST

Telangana News Live: Ganesh Shobha Yatra 2024 : గణేష్ భక్తులకు అలర్ట్.. నిమజ్జనం రోజు ఈ నియమాలు తప్పకుండా పాటించాలి!

  • Ganesh Shobha Yatra 2024 : గణేష్ నిమజ్జన శోభాయాత్రల నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు అలర్ట్ అయ్యారు. నిమజ్జనం రోజున పాటించాల్సిన ముందస్తు నియమాలను వెల్లడించారు. గణేష్ భక్తులు నిబంధనలు పాటించి పోలీసులకు సహకరించాలని సీపీ సీవీ ఆనంద్ విజ్ఞప్తి చేశారు.
పూర్తి స్టోరీ చదవండి

13 September 2024, 15:36 IST

Telangana News Live: AWES Recruitment 2024 : ఆర్మీ పబ్లిక్ స్కూళ్లలో ఉద్యోగాల భర్తీకి ప్రకటన - దరఖాస్తులు ప్రారంభం, ఇవిగో వివరాలు

  • AWES Recruitment 2024 : ఆర్మీ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ సొసైటీ నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా ఉన్న కంటోన్మెంట్స్, మిలిటరీ స్టేషన్ల పరిధిలోని 139 ఆర్మీ పబ్లిక్ స్కూళ్లలో టీచింగ్ పోస్టులను భర్తీ చేయనున్నారు. అక్టోబర్ 25వ తేదీతో ఆన్ లైన్ దరఖాస్తుల గడువు పూర్తి కానుంది. 
పూర్తి స్టోరీ చదవండి

13 September 2024, 14:53 IST

Telangana News Live: Flood Damage : ఎలాంటి నిబంధనలు లేకుండా తక్షణ సాయంగా నిధులు విడుదల చేయండి: రేవంత్ రెడ్డి

  • Flood Damage : తెలంగాణ సచివాలయంలో కేంద్ర బృందంతో సీఎం రేవంత్‌ భేటీ అయ్యారు. ఈ భేటీకి మంత్రి పొంగులేటి, ఎంపీ రఘురాంరెడ్డి, సీఎం సలహాదారు నరేందర్‌రెడ్డి, సీఎస్‌ శాంతికుమారి హాజరయ్యారు. తెలంగాణలో వరద నష్టం అంచనాపై చర్చించారు. వరదలతో తీవ్ర నష్టం జరిగిందని సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర బృందానికి వివరించారు.
పూర్తి స్టోరీ చదవండి

13 September 2024, 14:24 IST

Telangana News Live: TG Mee Seva Online : మీ-సేవా కేంద్రాల్లో నిలిచిపోయిన సేవలు - 3 రోజులుగా ఇబ్బందులు!

  • తెలంగాణవ్యాప్తంగా గత మూడు రోజులుగా మీ-సేవా ఆన్ లైన్ సేవలు నిలిచిపోయాయి. కొత్త సేవలను అందుబాటులోకి తీసుకువచ్చే క్రమంలో… సర్వర్ ను అప్డేట్ చేస్తున్నారు. దీంతో మీ-సేవా సేవలు నిలిచినట్లు అధికారులు చెబుతున్నారు. మరో రెండు రోజుల్లో పూర్తిస్థాయిలో సేవలను పునరుద్ధరించనున్నారు.
పూర్తి స్టోరీ చదవండి

13 September 2024, 13:53 IST

Telangana News Live: TG LAWCET 2024 Updates : లాసెట్ సెకండ్ ఫేజ్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల - ఈనెల 17 నుంచి రిజిస్ట్రేషన్లు, ముఖ్య తేదీలివే

  • TG LAWCET 2024 Counselling : టీజీ లాసెట్ - 2024 సెకండ్ ఫేజ్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదలైంది. సెప్టెంబర్ 17వ తేదీ నుంచి ఆన్ లైన్ రిజిస్ట్రేషన్లు ప్రారంభం కానున్నాయి. సెప్టెంబర్ 30వ తేదీన సీట్ల కేటాయింపు ఉంటుందని అధికారులు ప్రకటించారు. https://lawcet.tsche.ac.in/ వెబ్ సైట్ లోకి ప్రాసెస్ చేసుకోవాలి.
పూర్తి స్టోరీ చదవండి

13 September 2024, 13:37 IST

Telangana News Live: Medak Crime: మూగ వ్యక్తిపై హత్యాయత్నం కేసులో ముద్దాయికి ఏడేళ్ల జైలు శిక్ష, 5 వేల జరిమానా..

  • Medak Crime: మాటలు రాని మూగ వ్యక్తిపై హత్యాయత్నం కేసులో నేరస్తునికి 7 సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు రూ. 5 వేల జరిమానా విధిస్తూ గౌరవ అసిస్టెంట్ సెషన్స్ జడ్జి ఎం.రాధా కృష్ణ చౌహాన్ గురువారం తీర్పునిచ్చారు. జరిమానా చెల్లించడంలో విఫలమైతే 3 నెలల సాధారణ జైలు శిక్ష అనుభవించాలని తీర్పునిచ్చారు. 
పూర్తి స్టోరీ చదవండి

13 September 2024, 13:04 IST

Telangana News Live: TG Raithu Bharosa: రైతు భరోసా కోసం... అన్నదాతల ఎదురుచూపులు, ప్రభుత్వం నుంచి ఇంకా అందని సాగు పెట్టుబడి సాయం

  • TG Raithu Bharosa: తెలంగాణ రైతులకు సాగు కష్టాలు తప్పడం లేదు. వర్షాభావ పరిస్థితుల వల్ల గత రెండు వ్యవసాయ సీజన్లను రైతులు నష్టపోయారు. ఈ సారి రుతుపవనాలు సరైన కాలంలోరాక,వర్షాలు ఆలస్యం అయినా ఆగస్టులో కురిసిన భారీ వర్షాలు, తుఫాన్ల వల్ల ప్రాజెక్టులు అన్నీ నిండినా పెట్టుబడి లేక వ్యాపారుల్ని ఆశ్రయిస్తున్నారు.
పూర్తి స్టోరీ చదవండి

13 September 2024, 11:50 IST

Telangana News Live: Medak SHG Issue: మహిళా సంఘం డబ్బులు సొంతగా వాడుకున్నవ్యక్తిని చెట్టుకు కట్టేసిన మహిళలు

  • Medak SHG Issue: మహిళా సంఘం లోన్ డబ్బులను బ్యాంకులో కట్టకుండా సొంత ఖర్చులకు వాడుకున్న గ్రూప్ నాయకురాలి భర్తను గ్రూప్ సభ్యులు స్థంబానికి తాడుతో కట్టేసిన సంఘటన మెదక్ జిల్లాలో కలకలం సృష్టించింది. బ్యాంకు నుంచి తీసుకున్న రుణాన్ని తిరిగి చెల్లించే క్రమంలో ఓ వ్యక్తి వాటిని సొంతానికి వాడేసుకున్నాడు. 
పూర్తి స్టోరీ చదవండి

13 September 2024, 11:46 IST

Telangana News Live: Ganesh Immersion 2024 : గణపతి భక్తులకు గుడ్‌న్యూస్.. నిమజ్జనం రోజు రాత్రి నిరంతరాయంగా ఎంఎంటీఎస్ సేవలు

  • Ganesh Immersion 2024 : గణేష్ నిమజ్జనం హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్ పరిసరాల్లో కన్నుల పండువగా జరుగుతుంది. డప్పు చప్పుళ్లు, యువత కేరింతలు, రంగురంగుల లైట్లను చూడటానికి రెండుకళ్లు చాలవు. నగర ప్రజలే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వస్తుంటారు. వారి సౌకర్యం కోసం రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది.
పూర్తి స్టోరీ చదవండి

13 September 2024, 11:34 IST

Telangana News Live: Ganesh Nimarjanam: 24 చెరువులు 4,600 విగ్రహాలు, వరంగల్‌లో గణనాథుడి నిమజ్జనానికి ఏర్పాట్లు

  • Ganesh Nimarjanam: వరంగల్ నగరంలో గణపతి నవరాత్రి ఉత్సవాలు సందడిగా కొనసాగుతున్నాయి. ఇంకో నాలుగు రోజుల్లో నిమజ్జనం నిర్వహించనున్న నేపథ్యంలో అధికారులు దానికి సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో అత్యధికంగా వరంగల్ ట్రై సిటీలోనే 4,600 కు పైగా గణనాథుడి విగ్రహాలు ప్రతిష్టించారు.
పూర్తి స్టోరీ చదవండి

13 September 2024, 11:04 IST

Telangana News Live: Travels Bus in Fire: బస్సులో చెలరేగిన మంటలు, చాకచక్యంగా వ్యవహరించి ప్రయాణికుల ప్రాణాలు కాపాడిన డ్రైవర్

  • Travels Bus in Fire: వేగంగా వెళ్తున్న ఆర్టీసీ బస్సు లో మంటలు చెలరేగడంతో, గుర్తించిన ఆర్టీసీ బస్సు డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించి, వెంటనే బస్సు పక్కకు ఆపటంతో అందులో ప్రయాణిస్తున్న సుమారు 15 మంది ప్రయాణికులు ఎలాంటి గాయాలు కాకుండా ప్రమాదం నుండి తప్పించుకున్నారు.  డ్రైవర్‌ అప్రమత్తతో అందరి బయటపడ్డారు. 
పూర్తి స్టోరీ చదవండి

13 September 2024, 10:17 IST

Telangana News Live: Warangal : 24 చెరువులు.. 4,600 విగ్రహాలు.. వరంగల్ నగరంలో గణనాథుడి నిమజ్జనానికి ఏర్పాట్లు

  • Warangal : వరంగల్ నగరంలో గణపతి నవరాత్రి ఉత్సవాలు సందడిగా కొనసాగుతున్నాయి. ఇంకో 3 రోజుల్లో నిమజ్జనం నిర్వహించనున్న నేపథ్యంలో.. అధికారులు దానికి సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నారు. నిమజ్జనం చేసే చెరువులను అధికారులు, పోలీసులు పరిశీలించారు. సిబ్బందికి సూచనలు చేశారు.
పూర్తి స్టోరీ చదవండి

13 September 2024, 10:01 IST

Telangana News Live: PET Suspend : రోడ్డెక్కిన గురుకుల విద్యార్థినులు.. పీఈటీని సస్పెండ్ చేసిన కలెక్టర్

  • PET Suspend : విద్యార్థినులను వేధిస్తున్నారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న పీఈటీని కలెక్టర్ సస్పెండ్ చేశారు. తంగళ్లపల్లి మండలంలోని గిరిజన గురుకుల విద్యార్థినులు పీఈటీపై ఆరోపణలు చేస్తూ.. రోడ్డెక్కారు. దీంతో జిల్లా పాలనాధికారి ఈ నిర్ణయం తీసుకున్నారు. విద్యార్థుల సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
పూర్తి స్టోరీ చదవండి

    ఆర్టికల్ షేర్ చేయండి