Tirumala Tour Package : తిరుమల టూర్ ప్యాకేజీ - ఉచితంగా శ్రీవారి శీఘ్రదర్శనం, ధర కూడా చాలా తక్కువ!
TG Tourism Tirumala Package: తిరుమల శ్రీవారిని దర్శించుకునే వారికోసం తెలంగాణ టూరిజం ప్రత్యేక ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది. హైదరాబాద్ నుంచి బస్సులో వెళ్లాల్సి ఉంటుంది. ఈ ప్యాకేజీలో శ్రీవారి శీఘ్రదర్శనం ఉచితంగా ఉంటుంది. https://tourism.telangana.gov.in వెబ్ సైట్ లోకి వెళ్లి బుకింగ్ చేసుకోవచ్చు.
టూరిస్టు ప్లేసులు మాత్రమే కాకుండా అధ్యాత్మిక ప్రాంతాలను చూసేందుకు తెలంగాణ టూరిజం ప్యాకేజీలను ప్రకటిస్తోంది. ఇందులో భాగంగా తిరుమల శ్రీవారి భక్తుల కోసం ప్రత్యేక ప్యాకేజీని తీసుకువచ్చింది. హైదరాబాద్ నుంచి ఆపరేట్ చేస్తున్నట్లు పేర్కొంది. బస్సులో జర్నీ ఉంటుందని తెలిపింది. కేవలం రెండు రోజుల వ్యవధిలోనే ఈ ప్యాకేజీ ముగుస్తుంది.
ఈ ప్యాకేజీని బుకింగ్ చేసుకునే వారికి టూరిజం శాఖ మరో ఆఫర్ కూడా ఇచ్చింది. శ్రీవారి శీఘ్రదర్శనం ఉచితంగా ఉంటుందని ప్రకటించింది. సొంత వాహనాల్లో వచ్చి దర్శన టికెట్లు కోసం రిపోర్ట్ చేస్తే టీటీడీ అధికారులు తిరస్కరిస్తారని స్పష్టం చేసింది. టూరిజం శాఖ ఏర్పాటు చేసే బస్సులోనే ప్రయాణికులు రావాల్సి ఉంటుందని వివరించింది.
టికెట్ ధరలు :
హైదరాబాద్ - తిరుమల టూర్ ప్యాకేజీ టికెట్ ధరలు చూస్తే పెద్దలకు రూ. 3,700గా నిర్ణయించారు. చిన్నారులకు రూ. 2,960గా ఉంది. ఈ ప్యాకేజీలో తిరుమలలో శ్రీవారి శీఘ్రదర్శనం ఉచితంగా ఉంటుంది. https://tourism.telangana.gov.in/package/tirupatitirumalatour లింక్ పై క్లిక్ చేసి నేరుగా ఈ ప్యాకేజీని బుకింగ్ చేసుకోవచ్చు. టూరిజం వెబ్ సైట్ లో TIRUPATI - TIRUMALA TOUR పేరుతో ఈ ప్యాకేజీ డిస్ ప్లే అవుతుంది.
టూర్ షెడ్యూల్ వివరాలు:
- డే 1 - సాయంత్రం 5 గంటలకు హైదరాబాద్ నుంచి బస్సు బయల్దేరుతుంది. బేగంపేట్, బషీర్ బాగ్, యాత్రినివాస్, కూకట్ పల్లిలో పికప్ పాయింట్లు ఉంటాయి. (సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్లు - 9848540374, 9848126947,9848540371)
- డే 2 - ఉదయం 7 గంటలకు తిరుపతికి చేరుకుంటారు. ఫ్రెషప్ అయిన తర్వాత స్థానంకంగా ఉండే ఆలయాలను చూస్తారు. ఆ తర్వాత తిరుమలలో శ్రీవారి శీఘ్రదర్శనం ఉచితంగా ఉంటుంది. మధ్యాహ్నం తిరుపతికి చేరుకుంటారు. హోంటల్ లో ఫ్రెషప్ అవుతారు. సాయంత్రం 5 గంటలకు రిటర్న్ జర్నీ ఉంటుంది.
- డే 3 - ఉదయం 7 గంటల వరకు హైదరాబాద్ చేరుకోవటంతో టూర్ ప్యాకేజీ ముగుస్తుంది.
ఈ ప్యాకేజీని బుకింగ్ చేసుకోవాలనుకునేవారు ఏడు రోజుల ముందే ప్రాసెస్ చేసుకోవాలి. టికెట్ల రద్దుకు అవకాశం ఉండదని టూరిజం శాఖ స్పష్టం చేసింది. ఇక తెలంగాణ టూరిజం బస్సు ప్యాకేజీలో టిక్కెట్లు బుక్ చేసుకున్న యాత్రికులందరూ తెలంగాణ టూరిజం బస్సులో మాత్రమే ప్రయాణించాల్సి ఉంటుందని తెలిపింది. సొంత వాహనాల్లో వచ్చి దర్శన టికెట్లు కోసం రిపోర్ట్ చేస్తే టీటీడీ అధికారులు తిరస్కరిస్తారని హెచ్చరించింది. డబ్బులు వాపస్ కూడా ఇవ్వబడవని తెలిపింది.