TTD Seva male quota: టీటీడీ శ్రీ‌వారి సేవ‌కుల మ‌గ‌వారి కోటా నేడు విడుద‌ల..అంగ ప్ర‌ద‌క్షిణం సేవా టిక్కెట్లు కూడా..-ttd shrivari sevakula male quota released today anga pradakshinam seva tickets also ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ttd Seva Male Quota: టీటీడీ శ్రీ‌వారి సేవ‌కుల మ‌గ‌వారి కోటా నేడు విడుద‌ల..అంగ ప్ర‌ద‌క్షిణం సేవా టిక్కెట్లు కూడా..

TTD Seva male quota: టీటీడీ శ్రీ‌వారి సేవ‌కుల మ‌గ‌వారి కోటా నేడు విడుద‌ల..అంగ ప్ర‌ద‌క్షిణం సేవా టిక్కెట్లు కూడా..

HT Telugu Desk HT Telugu
Sep 12, 2024 08:53 AM IST

TTD Seva male quota: టీటీడీ శ్రీ‌వారి సేవ‌కుల మ‌గ‌వారి కోటా గురువారం విడుద‌ల కానున్నాయి. దీంతో పాటు స్థానికుల‌కు అంగ ప్ర‌ద‌క్షిణం సేవా టిక్కెట్ల కోసం రిజిస్ట్రేష‌న్ కూడా ప్రారంభం కానుంది. శ్రీవారి మెట్టు నెంబ‌ర్ 1,200 వ‌ద్ద త‌ప్ప‌నిస‌రిగా స్కానింగ్‌ తప్పనిసరి చేశారు.

తిరుమలలో మగవారి సేవా టిక్కెట్లు నేడు విడుదల
తిరుమలలో మగవారి సేవా టిక్కెట్లు నేడు విడుదల

TTD Seva male quota: తిరుమల శ్రీ‌వారి ఆలయంలో సేవ‌కులుగా సేవలందించడానికి మ‌గ‌వారి కోటా గురువారం విడుద‌ల కానున్నాయి. స్థానికుల‌కు అంగ ప్ర‌ద‌క్షిణం సేవా టిక్కెట్లు కోసం రిజిస్ట్రేష‌న్ కూడా గురువారం నుంచి ప్రారంభం కానుంది. తిరుమల వచ్చే వారు శ్రీవారి మెట్టు నెంబ‌ర్ 1,200 వ‌ద్ద త‌ప్ప‌నిస‌రిగా స్కాన్ చేసుకోవాల‌ని, లేక‌పోతే శ్రీ‌వారి ద‌ర్శ‌న‌మున‌కు అనుమ‌తించ‌ర‌ని టీటీడీ ప్రకటించింది.

టీడీడీ మగ శ్రీవారి సేవకుల కోసం ప్రత్యేకంగా (శ్రీవారి సేవ (జెంట్స్)) తిరుమలకు సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్-2024 నెలలకు సంబంధించిన ఆన్‌లైన్ కోటా 12 తేదీ ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నట్టు టీటీడీ తెలిపింది. అలాగే సెప్టెంబ‌ర్ 14 రోజుకు (శనివారం) తిరుపతి (అర్బన్ మరియు రూరల్), తిరుమల స్థానికులకు (మాత్రమే) అంగప్రదక్షిణం సేవా టిక్కెట్లు “eDip” రిజిస్ట్రేషన్‌లు 12వ తేదీ ఉదయం 10:00 నుండి సాయంత్రం 4:00 గంటల మధ్య అందుబాటులో ఉంటాయని తెలిపారు.

మ‌రోవైపు తిరుమలలో భక్తుల రద్దీ స్వ‌ల్పంగా పెరిగింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో వేచివుండే అవసరం లేకుండా నేరుగా శ్రీవారి దర్శనం జ‌రిగింది. బుధ‌వారం 67,668 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. 23,157 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. రూ.3.56 కోట్ల హుండీ ఆదాయం వ‌చ్చింది. స‌ర్వ‌ద‌ర్శ‌నం కోసం (ఎస్ఎస్‌డీ టోకెన్లు లేకుండా) ఆరు గంట‌ల స‌మ‌యం ప‌ట్టింది. ఎస్ఎస్‌డీ టోకెన్‌, దివ్య ద‌ర్శ‌నం ఉన్న వారికి రెండు నుండి నాలుగు గంట‌ల స‌మ‌యం ప‌ట్టింది. రూ.300 ద‌ర్శ‌నానికి 1 నుండి రెండు గంట‌ల స‌మ‌యం ప‌ట్టింది.

సెప్టెంబ‌ర్ 16 వ‌ర‌కు కాణిపాక వార్షిక బ్ర‌హ్మోత్స‌వాలు

కాణిపాక వినాయ‌క వార్షిక బ్ర‌హ్మోత్స‌వాలు జ‌రుగుతున్నాయి. సెప్టెంబ‌ర్ 12న రాత్రి వృష‌భ వాహ‌నంపై సేవ‌లు నిర్వ‌మించ‌నున్నారు. 13న గ‌జ వాహ‌నంపైన ఊరేగింపు ఉంటుంది. 14న ర‌థోత్స‌వం నిర్వ‌హిస్తారు. 15న బిక్షాండి, అదే రోజున సాయంత్రం తిరుక‌ళ్యాణం, రాత్రి అశ్వ‌వాహ‌నం, 16న సాయంత్రం ధ్వ‌జారోహ‌ణం, వ‌డాయ‌త్తు ఉత్స‌వం, ఏకాంత సేవ‌తో బ్ర‌హ్మోత్స‌వాలు ముగియ‌నున్నాయి.

సెప్టెంబ‌ర్ 17 నుంచి కాణిపాక ప్ర‌త్యేక ఉత్స‌వాలు

కాణిపాక వినాయ‌క వార్షిక బ్ర‌హ్మోత్స‌వాలు ముగిసిన అనంత‌రం ప్ర‌త్యేక ఉత్స‌వాలు సెప్టెంబ‌ర్ 17న ప్రారంభం కానున్నాయి. ప్ర‌త్యేక ఉత్స‌వాల్లో భాగంగా సెప్టెంబ‌ర్ 17న అధికార నంది వాహ‌నం, 18న రావ‌ణ బ్ర‌హ్మ వాహ‌నం, 19న యాళివాహ‌నం, 20న విమానోత్స‌వం, 21న పుష్ప ప‌ల్ల‌కి సేవ‌, 22న కామ‌ధేను వాహ‌నం, 23న సూర్య ప్ర‌భ‌, 24న చంద్ర‌ప్ర‌భ‌, 25న క‌ల్ప‌వృక్ష వాహ‌నం, 26న పూలంగి సేవ‌, 27న తెప్పోత్స‌వంతో ప్ర‌త్యేక ఉత్స‌వాలు ముగుస్తాయి.

(జ‌గ‌దీశ్వ‌ర‌రావు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)