Telangana Tourism Package : రూ.2 వేలకే శ్రీశైలం టూర్ ప్యాకేజీ - 'రోప్ వే' జర్నీతో పాటు ఇవన్నీ చూడొచ్చు, ఇవిగో వివరాలు
- కృష్ణమ్మ పరుగులతో శ్రీశైలానికి పర్యాటకులు భారీగా వెళ్తున్నారు. అయితే ఇక్కడికి వెళ్లేందుకు అతి తక్కువ ధరలోనే తెలంగాణ టూరిజం ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది.హైదరాబాద్ నుంచి బస్సులో వెళ్లాల్సి ఉంటుంది. కేవలం 2 వేల ధరతోనే అందుబాటులో ఉంది. https://tourism.telangana.gov.in/ లింక్ తో బుకింగ్ చేసుకోవచ్చు.
- కృష్ణమ్మ పరుగులతో శ్రీశైలానికి పర్యాటకులు భారీగా వెళ్తున్నారు. అయితే ఇక్కడికి వెళ్లేందుకు అతి తక్కువ ధరలోనే తెలంగాణ టూరిజం ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది.హైదరాబాద్ నుంచి బస్సులో వెళ్లాల్సి ఉంటుంది. కేవలం 2 వేల ధరతోనే అందుబాటులో ఉంది. https://tourism.telangana.gov.in/ లింక్ తో బుకింగ్ చేసుకోవచ్చు.
(1 / 6)
శ్రీశైలం వెళ్లే ఆలోచన ఉందా..? అయితే మీలాంటి వారికి తెలంగాణ టూరిజం అద్భుతమైన టూర్ ప్యాకేజీని తీసుకొచ్చింది. అతి తక్కువ ధరలోనే హైదరాబాద్ నుంచి తీసుకెళ్తోంది. మల్లన్న దర్శనంతో పాటు పలు ప్రాంతాలు చూపించనుంది. (ఫైల్ ఫొటో)(image source from unsplash.com/)
(2 / 6)
ఈ ప్యాకేజీని హైదరాబాద్ నుంచి బస్సు జర్నీ ద్వారా ఆపరేట్ చేస్తున్నారు. ప్రతిరోజూ ఈ ప్యాకేజీ అందుబాటులో ఉంటుంది. ఈ ట్రిప్ లో భాగంగా…. శ్రీశైలం దర్శనం, పాతాళగంగా, పాలధార(Paaladhara), పంచధార, శ్రీశైలం డ్యామ్ ప్రాంతాలను చూడొచ్చు.(image source from unsplash.com/)
(3 / 6)
“DAILY SRISAILAM TOUR” పేరుతో తెలంగాణ టూరిజం వెబ్ సైట్ లో ఈ టూర్ ప్యాకేజీ అందుబాటులో ఉంటుంది. హైదరాబాద్ నుంచి జర్నీ స్టార్ట్ అవుతుంది. ఏసీ, నాన్ ఏసీ బస్సు సౌకర్యం ఉంటుంది. ఎంచుకున్న దానిబట్టి టికెట్ ధరలు ఉంటాయి. ప్రతిరోజు హైదరాబాద్ పర్యాటక భవన్, బషీర్‌బాగ్ నుంచి బస్సులు అందుబాటులో ఉంటాయి.(image source from unsplash.com/)
(4 / 6)
Day 1 : ఫస్ట్ డే హైదరాబాద్‌లోలోని పర్యాటక భవన్ నుంచి 8:30 గంటలకు బస్సు బయలుదేరుతుంది. భోజనం తర్వాత మార్గమధ్యంలో సాక్షి గణపతి ఆలయాన్ని దర్శించుకుంటారు. సాయంత్రం 5:00 గంటలకు శ్రీశైలం చేరుకుని.. బస కోసం నేరుగా హోటల్‌కు వెళతారు. శ్రీశైలంలోనే రాత్రి బస ఉంటుంది. (శ్రీశైలం హోటల్లో దుప్పట్లు అందించబడవు. పర్యాటకులు సొంతంగా దుప్పట్లు తీసుకెళ్లాల్సి ఉంటుంది.Day 2 : 2వ రోజు ఉదయం దర్శనం అనంతరం టిఫిన్ చేస్తారు. హోటల్ నుండి చెక్ అవుట్ తర్వాత రోప్ వేకు వెళ్తారు. ఈ జర్నీ అద్భుతంగా ఉంటుంది. పాతాళగంగ, పాలధార, పంచధార, హైడ్రోఎలక్ట్రిక్ ప్రాజెక్టు, శ్రీశైలం డ్యామ్ తదితర ప్రాంతాలను చూస్తారు. రాత్రి 7 గంటలకు హైదరాబాద్ చేరుకుంటారు. దీంతో టూర్ ప్యాకేజీ ముగుస్తుంది.(image source from unsplash.com/)
(5 / 6)
హైదరాబాద్ - శ్రీశైలం టూర్ టికెట్ ధరలు : ఏసీ బస్ ప్యాకేజీ అయితే పెద్దలకు రూ.2400, పిల్లలు (5 నుంచి 12సంవత్సరాలు) రూ.1920 చెల్లించాల్సి ఉంటుంది. నాన్ AC బస్ ప్యాకేజీలో పెద్దలకు రూ.2000, పిల్లలకు రూ.1600గా నిర్ణయించారు.(image source from unsplash.com/)
ఇతర గ్యాలరీలు